Shah Sodagar Jamal: గుజరాత్.. ఈ పేరు వినగానే వ్యాపారులు గుర్తొస్తారు. 18 వ శాతాబ్దం నుంచే గుజరాతీలు వ్యాపారరంగంలో పేరు, గుర్తింపు పొందారు. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారం చేస్తున్న భారతీయుల్లో గురజారీలే ఎక్కువ. ప్రస్తుతం భారత సంపన్నుడు అయిన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదీనీలది కూడా గుజరాతే. ఇదంతా ఎందుకంటే.. 18వ శతాబ్దంలో బ్రిటిష్ వ్యాపారులకే చెమటలు పట్టించాడు భారతీయ వ్యాపారి. గుజరాత్‌లో పుట్టి.. మయన్మార్‌లో స్థిరపడిన ఈ వ్యాపారి ప్రపంచ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలాడు.
1862లో జామ్‌నగర్‌లో జన్మించిన అబ్దుల్ కరీం జమాల్. ఆరేళ్ల వయసులో తండ్రితో కలిసి రంగూన్(ప్రస్తుత మయన్మార్) చేరుకున్నారు. రంగూన్‌లో స్థిరపడి, సంప్రదాయ ఇస్తాం విద్యతోపాటు తండ్రి ’జమాల్ బ్రదర్స్’ వస్త్ర వ్యాపారాన్ని నేర్చుకున్నారు. 1884లో అతని తండ్రి వ్యాపారం నుంచి తప్పుకున్నాడు. 1886 నాటికి కరీం జమాన్ పూర్తి బాధ్యతలు చేపట్టి, చిన్న దుకాణాన్ని పెద్ద మార్కెట్‌గా మార్చారు. నిజాయితీ, స్వచ్ఛతతో ’షా సోదాగర్’ అనే కీర్తి సంపాదించారు.
సింథియా కంపెనీకి సర్వస్వ త్యాగం
1921లో భారతీయ ’సింథియా స్టీమ్ నావిగేషన్’ కోల్‌కతా–ముంబయి–రంగూన్ మార్గాల్లో పోటీపడుతుండేవి. అయితే భారతీయ కంపెనీ ఎదుగుదలను బ్రిటిష్ సంస్థలు ఓర్వలేదు. దీంతో వ్యాపారంలో డిస్కౌంట్లు ప్రకటించాయి. దీంతో సింథియా సంస్థకు నష్టాలు మొదలయ్యాయి. ఒక దశలో దాన్ని మూసివేయాలనుకున్నాయి. ఈ క్రమంలో జమాల్ లాభాలను పట్టించుకోకుండా, ప్రతి స్టీమర్‌ను తన వస్తువులతో నింపి, ఏడాది పూర్తి పని ఇచ్చారు. బియ్యం వ్యాపారంతో దివాళా దశలో ఉన్న సింథియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ తిరిగి లాభాల బాట పట్టాంది. ఈ ధైర్యం ముంబయిలో భవనం నిర్మించి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చేతుల మీదుగా ప్రారంభించేలా ఎదిగారు.
బియ్యం రాజు నుంచి పెట్రోలియం సామ్రాజ్యం
రంగూన్ బియ్యం కేంద్రంగా మారినప్పుడు, స్థానిక రైతులకు న్యాయమైన ధరలు ఇచ్చి, మిల్లులు ఏర్పాటు చేసి ’రైస్ కింగ్’గా ఎదిగారు. తర్వాత చమురు, కిరోసిన్ రంగాల్లో ’ఇండో–బర్మా పెట్రోలియం’ (రూ1 కోటి మూలధనం), పత్తి, రబ్బరు, తేయాకు, ఇనుప, మైనింగ్ వంటి రంగాల్లో ప్రవేశించారు. ’జమాల్ బ్రదర్స్’ (రూ.1 కోటి), ’జమాల్ కాటన్’ (రూ.30 లక్షలు) సంస్థలు స్థాపించి, బ్రిటిష్ పోటీదారులను ఎదుర్కొన్నారు.
బ్రిటిష్‌వారి బిరుదులు..
1915లో సీఐఈ, 1920లో నైట్‌హుడ్ బిరుదులు పొందినా, భారతీయ కంపెనీలకు మద్దతు ఇచ్చారు. బ్రిటిష్ హెచ్చరికలు, బియ్యం ఎగుమతి నిషేధాలతో రూ.8 కోట్ల అప్పులు చేసినా, తీర్చేశారు. యుద్ధ నిధులు, మానవసేవలకు లక్షలు దానం చేశారు. రంగూన్‌లో బాలికల పాఠశాల, పర్షియన్ విద్యా కేంద్రాలు నడిపారు. విద్యావేత్తలకు ’ధుని’ (అమూల్య దానాలు) ఇచ్చారు.
గాంధీజీ, అగా ఖాన్, రాజులు సందర్శించిన ’జమాల్ విల్లా’లో నిరాడంబరంగా జీవించారు. కుచ్చి మెమన్ దుస్తులు, ఫెంటో ధరించి గుజరాతీ సంప్రదాయాన్ని కాపాడారు. 1924లో 71 ఏళ్ల వయసులో లోనరవడంతో పాటు, రంగూన్‌లో వీధికి పేరు, ముంబయి భవనం ఆయన కీర్తిని గుర్తుచేస్తున్నాయి.