Homeజాతీయ వార్తలుCM KCR Delhi Tour: వెన్నులో వణుకు.. కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌ అందేకేనా? ప్రధానిని కలువ...

CM KCR Delhi Tour: వెన్నులో వణుకు.. కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌ అందేకేనా? ప్రధానిని కలువ కూడదనే ఆకస్మిక యాత్ర!!

CM KCR Delhi Tour: తప్పు చేయని వాడు తల దించుకోడు.. తాను చేసిన పనిని ధైర్యంగా చెబుతాడు.. తలెత్తుకుని వాదిస్తాడు. తప్పు చేసిన వాడు ముఖం చాటేస్తాడు.. తల దించుకుని మాట్లాడుతాడు. కానీ తప్పు చేసి తల దించుకునేందుకు అహం అడ్డు వచ్చేవాడు.. ఎవరి విషయంలో తప్పు చేశాడో.. వారికి కనిపించకుండా తప్పించుకు తిరుగుతాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రస్తుతం ఇదే చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసీఆర్‌ ఆకస్మిక ఢిల్లీ టూర్‌తో తెలంగాణ బీజేపీకి సీఎం స్వయంగా ఒక విమర్శనాస్త్రాన్ని ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

CM KCR Delhi Tour
CM KCR

కేంద్రంతో చెడిన సఖ్యత..
దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రాల అభివృద్ధి విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక ఎజెండా ఉంటుంది. కేంద్రంతో కొన్ని అంశాల్లో విభేధించినా రాష్ట్ర అవసరాల విషయంలో మాత్రం కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రధానిని, మంత్రులను కలుస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దాదాపు ఏడాదిన్నరగా ఆయన ప్రధాని నరేంద్రమోదీని కలువలేదు. కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కూడా కోరలేదు. కారణం కేవలం తెలంగాణలో బీజేపీ బలపడడమే. కేసీఆర్‌ అవినీతిని బీజేపీ నాయకులు ప్రశ్నించడమే. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించినంత పని చేయడమే. తాను ఏకఛత్రాదిపత్యం చేయాలని చూస్తున్న తెలంగాణలో తనకు దీటుగా మరొకరి ఎదుగుదలను ఓరవ్వలేని కేసీఆర్‌ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నారు. ఇందులో భాగంగానే ధాన్యం కొనుగోలు అంశాన్ని ఎంచుకున్నారు. అది బెడిసి కొట్టడంతో విధిలేని పరిస్థితిలో యాసంగి ధాన్యం కొనేందుకు ముందుకు వచ్చారు. తాజాగా దేశ రాజకీయాల్లోకి వస్తా.. దేశాన్ని మార్చేస్తా అంటూ పర్యటించారు. కానీ ఎవరూ కలిసి రాలేదు. తాను కలిసిన ప్రతిపక్ష నేతలు కూడా కేసీఆర్‌ను బీజేపీ వ్యతిరేకిగా గుర్తించలేదు. దీంతో కేంద్రంతో చేసే పోరాటంలో కేసీఆర్‌ ఒంటరయ్యారు.

Also Read: Dissidence TRS Leaders: టీఆర్ఎస్ నేతల కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వల?

ప్రధానికి ముఖం చూపని కేసీఆర్‌..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దాదాపు ఏడాదిన్నరగా ప్రధానికి ముఖం చూపలేదు. అధికారిక కార్యక్రమాలకు పీఎంవో కార్యాలయం నుంచి రాష్ట్రానికి ఆహ్వానం అందినా కేసీఆర్‌ హాజు కావడం లేదు.

– ఫిబ్రరిలో హైదరాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌లో నిర్వహించిన సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని హాజరయ్యారు. కేసీఆర్‌ రాష్ట్రంలోనే ఉండి తనకు జ్వరం వచ్చిందని ప్రధానిని కలువకుండా దూరంగా ఉన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను ఎయిర్‌పోర్టుకు పంపించారు.

– కరోనా ఫోర్త్‌ వేవ్‌పై ప్రధాని మూడు నెలల క్రితం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రితో సమీక్ష నిర్వహించారు. దీనికి కేసీఆర్‌ గైర్హాజరయ్యారు.

– సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ.రమణ ఇటీవల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. చీఫ్‌ జస్టిస్‌తో కేసీఆర్‌కు మంచి అనుబంధమే ఉన్నప్పటికీ కేవలం ప్రధాని అధ్యక్షతన జరుగుతుందన్న కారణంలో ఆ సమావేశానికి రాష్ట్ర న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను పంపించారు.

CM KCR Delhi Tour
CM KCR

– తాజాగా ఈనెల 26న ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌ పర్యటన ఖరారైంది. ఐఎస్‌బీ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. ఈమేరకు పీఎంవో ఆఫీస్‌ నుంచి ప్రధాని పర్యటన షెడ్యూట్‌ రాష్ట్ర పోలీసులకు అందింది. ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్‌ రాష్ట్రంలో ఉంటే ప్రధాని పాల్గొనే అధికారిక కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుంది. ప్రధానికి ఆహ్వనం పలికేందుకు ఎయిర్‌ పోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉండకుండా పోవడమే మంచిదని భావించిన కేసీఆర్‌ ఆకస్మిక ఢిల్లీ టూర్‌ పెట్టుకున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ ప్రధాని పర్యటన నేపథ్యంలో పక్క రాష్ట్రాలకు పారిపోయారని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Also Read:Pawan Kalyan CM Candidate: పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్.. టీడీపీతో పొత్తుకు బీజేపీ ముందస్తు షరతు?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular