IND vs Pak : ఇండియా – పాకిస్తాన్ సంబంధాల్లో సమస్య ప్రభుత్వాలతోనే.. ప్రజలతో కాదు!

IND vs Pak : అఖండ భారతావని ఒకప్పుడు ఉండేది. తూర్పున బంగ్లాదేశ్ మనదే. పశ్చిమాన అప్ఘనిస్తాన్ వరకూ మనదే. దక్షిణాన శ్రీలంక కూడా మనదే. ఉత్తరాన అచేతు హిమాచలంలోని నేపాల్ కూడా భారతావనిలోనే ఉండేది. అలాంటి దేశాన్ని పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకగా విభజించారు బ్రిటీష్ వారు. ఒక్కో దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చారు. ఇప్పటికీ పాకిస్తాన్ తో మనకు పంచాయితీ ఏర్పడడానికి బ్రిటీష్ వారే కారణం. వారు కానుక ఇలా విభిజించి ఉండకపోతే ఇప్పుడు అఖండ భారత్ […]

Written By: NARESH, Updated On : February 21, 2023 10:17 pm
Follow us on

IND vs Pak : అఖండ భారతావని ఒకప్పుడు ఉండేది. తూర్పున బంగ్లాదేశ్ మనదే. పశ్చిమాన అప్ఘనిస్తాన్ వరకూ మనదే. దక్షిణాన శ్రీలంక కూడా మనదే. ఉత్తరాన అచేతు హిమాచలంలోని నేపాల్ కూడా భారతావనిలోనే ఉండేది. అలాంటి దేశాన్ని పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకగా విభజించారు బ్రిటీష్ వారు. ఒక్కో దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చారు. ఇప్పటికీ పాకిస్తాన్ తో మనకు పంచాయితీ ఏర్పడడానికి బ్రిటీష్ వారే కారణం. వారు కానుక ఇలా విభిజించి ఉండకపోతే ఇప్పుడు అఖండ భారత్ చైనాను అధిగమించి ఒక అఖండ శక్తిగా ఉండేది. అయితే ప్రభుత్వాలు, పాలకులు తమ స్వార్థం కోసం ప్రాంతాల కోసం విద్వేశాలు రెచ్చగొట్టి చలికాచుకున్నారు.

కశ్మీర్ కోసం పాకిస్తాన్ పాలకులు అక్కడి ప్రజలను రెచ్చగొట్టి ఉగ్రవాదులుగా మార్చి చేస్తున్న మారణకాండ ఇప్పటికీ ఆరడం లేదు. బంగ్లాదేశ్ విడిపోవడానికి పాకిస్తాన్ తో యుద్ధమే కారణం. ఇక శ్రీలంక మనకు పక్కలో బల్లెంలాంటి చైనాతో దోస్తీ చేస్తోంది. నేపాల్ ది అదే పరిస్థితి.

అయితే ఈ దేశాల ప్రభుత్వాలు, పాలకుల తీరు వల్లే అఖండ భారతవానిలోని ప్రజల మధ్య చిచ్చు రేపుతున్నారు. అయితే ప్రజలు ఇప్పటికీ కలిసి మెలిసి ఉండడానికే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వాలను తిడుతున్నారు తప్పితే ప్రజలను తప్పు పట్టడం లేదు. భాయిభాయి అనుకుంటూ ఇతర దేశాలలోని తమ ఆత్మీయులతో అనుబంధాన్ని పెంచుకుంటున్నారు.

తాజాగా భారత ప్రముఖ సింగర్ జావేద్ అక్తర్ పాకిస్తాన్ లో పర్యటించి అక్కడి ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఆయన ప్రసంగానికి అక్కడి పాకిస్తాన్ ప్రజలు కూడా జైజైలు పలకడం విశేషం. ‘26/11 దాడికి పాల్పడిన వ్యక్తులు పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారనే’ ఆయన వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భారత్ కు చెందిన సంగీత విధ్వంసుడు జావేద్ అక్తర్ పాకిస్తాన్ గడ్డపై ఆ దేశానికి వ్యతిరేకంగా చేసిన ప్రసంగానికి అక్కడి ప్రజలు చప్పట్లతో స్వాగతం పలకడం అంటే మామూలు విషయం కాదు.

ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఊతం. ఆ దేశానికి వెళ్లి ఆ దేశ ప్రజలది తప్పు అని చెప్పడానికి గట్స్ కావాలి. దాన్నే జావేద్ చేసి చూపించాడు. సుతిమెత్తగా భారత్ ది తప్పు కాదు.. మీ ప్రభుత్వాలది.. పాలకులది తప్పు అని సుతిమెత్తగా చెప్పాడు. ఉదాహరణ చూపించాడు. అందుకే పాకిస్తాన్ ప్రజలు కూడా జావేద్ ప్రసంగానికి చప్పట్లతో అది కరెక్ట్ అని ఆదరించారు. “మేము దేశాలను ఏకశిలాగా భావిస్తాము. పాకిస్తాన్ అలా కాదు. భారతదేశంతో కనెక్ట్ కావాలనుకునే మిలియన్ల మంది వ్యక్తులతో మేము ఎలా కనెక్ట్ అవుతామో మీరు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు” అని జావేద్ అన్నారు. “అధికారంలో ఉన్నవారు, ఆ పదవిలో ఉన్నవారు విద్వేషాలు సృష్టిస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ ప్రజలు, పాకిస్తాన్ స్థాపన ఒకే ఒరలో లేరు” అని జావెద్ కుండబద్దలు కొట్టారు.

వైరల్‌గా మారిన జావేద్ ప్రసంగంలో పాకిస్తాన్ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు. భారత్ బాంబు వేస్తోంది కదా? అన్న ప్రశ్నకు “వాతావరణం ఉద్రిక్తంగా ఉంది, దానిని చల్లార్చాలి. మేము ముంబైకి చెందినవాళ్ళం, మా నగరంపై దాడిని చూశాము. దాడి చేసినవారు నార్వే లేదా ఈజిప్టు నుండి రాలేదు. వారు ఇప్పటికీ మీ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కాబట్టి ఇక్కడ ఉగ్రవాదులు ఉంటే హిందుస్తానీ హృదయంలో కోపం ఉంది. కాబట్టి మీరు ఫిర్యాదు చేయలేరు, ”అంటూ పాకిస్తాన్ లో పెంచి పోషిస్తున్న ఉగ్రవాదమే భారత్ శత్రువు కానీ.. అక్కడి ప్రజలు కాదని జాదేవ్ చేసిన ప్రసంగానికి అక్కడికి వచ్చిన పాకిస్తాన్ ప్రజలు సైతం చప్పట్లతో ప్రశంసించారు.

జావేద్ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో అందరూ ప్రశంసించారు. కొందరు దీనిని పాకిస్తాన్ పై జావేద్ “సర్జికల్ స్ట్రైక్” అని కూడా పేర్కొనడం విశేషం.