Pilot Forgot Passport
Passport : విమానంలో ప్రయాణం చేయాలని చాలామందికి ఉంటుంది. కానీ బస్సుల్లో, రైల్లో కంటే విమానంలో ప్రయాణం చేసేవారు కొన్ని నిబంధనలు తెలుసుకోవాలి. విమానంలో ప్రయాణం చేసేవారు కేవలం చార్జీలు చెల్లించడమే కాకుండా.. అందుకు అనుమతి కోసం Passport ను కచ్చితంగా తీసుకోవాలి. అయితే ఒక దేశంలోని ప్రయాణికులు అదే దేశంలో ప్రయాణించాల్సి వస్తే Passport అవసరం లేదు. కానీ ఒక దేశంలోని ప్రయాణికుడు మరో దేశంలోకి వెళ్లాలంటే కచ్చితంగా దీని అవసరం ఉంటుంది. అయితే విమానంలో ప్రయాణించే వారు మాత్రమే కాకుండా.. విమానాన్ని నడిపే పైలెట్ కూడా పాస్పోర్ట్ను కలిగి ఉండాలి. బస్సుల్లో, రైలలో పైలెట్ కు ఎలాంటి అవసరం లేకున్నా పర్వాలేదు.. కానీ విమానాన్ని నడిపే పైలెట్ మాత్రం కచ్చితంగా పాస్పోర్ట్ ను కలిగి ఉండాల్సిందే. అలా Passport లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
సాధారణంగా ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లేటప్పుడు కచ్చితంగా దానికి సంబంధించిన వస్తువులను తీసుకెళ్తూ ఉంటాము. ప్రయాణం చేసే సమయంలో టికెట్లను కచ్చితంగా దగ్గరే ఉంచుకుంటాం. కానీ విమానాన్ని నడిపే ఓ పైలట్ తన Passportను మరిచిపోయాడు. సాధారణంగా ప్రయాణికులు పాస్పోర్టు లేకుంటే విమానం ఎక్కడానికి అనుమతించరు. బోర్డు చెకింగ్ లోనే పాస్పోర్ట్ ఉందా? లేదా? అని చెక్ చేసి ఆ తర్వాత ఫ్లైట్ దగ్గరికి పంపిస్తారు. కానీ పైలట్ తన వద్ద పాస్పోర్టు ఉంచుకొని ఫ్లైట్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఓ పైలెట్ మాత్రం తన Passport ను మర్చిపోయాడు.
Also Read : పాస్‌పోర్టు మరిచిన పైలట్.. అమెరికా నుంచి చైనా వెళ్లాల్సిన ప్రయాణం రివర్స్‌లో!
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నుంచి చైనాలోని షాంఘై కి ఈనెల 22న విమానం బయలుదేరింది. అయితే టేక్ ఆఫ్ అయినా రెండు గంటల తర్వాత పైలట్ తన పాస్పోర్ట్ లేదని గుర్తించాడు. ఈ విషయాన్ని అతడు అధికారులకు అందించాడు. దీంతో అధికారుల ఆదేశాల మేరకు అతడు ఆ ఫ్లైట్ను యూటర్న్ చేశాడు. మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరిన ఈ ఫ్లైట్.. యూటర్న్ తీసుకోవడంతో తిరిగి 5 గంటలకు మళ్ళీ లాస్ ఏంజెల్స్ లో ల్యాండ్ అయింది. అయితే అప్పటికే స్థానిక అధికారులు మరో విమానాన్ని సిద్ధం చేశారు. తిరిగి 9 గంటలకు అక్కడ నుంచి మరో విమానం చైనాకు బయలుదేరి.. 12 గంటలపాటు జర్నీ చేసి చివరికి షాంఘై కి చేరుకుంది. అయితే తిరిగి లాస్ ఏంజెల్స్ కి విమానం రావడంతో ప్రయాణికులు ఇబ్బందుని ఎదుర్కొన్నారు. వీరికి ప్రత్యేకంగా ఆహారపు టోకెన్లు అందించామని విమానయాన అధికారులు తెలిపారు.
కాగా ఈ ఫ్లైట్లో మొత్తం 257 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఫ్లైట్ నడిపే పైలెట్ పాస్పోర్ట్ మర్చిపోవడం విషయం సోషల్ మీడియాలో రావడంతో తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అయితే పైలెట్లు కచ్చితంగా పాస్పోర్టు ఉంచుకోవాలని కొందరు అంటున్నారు. అయితే అనుకోకుండా అతడు పాస్పోర్టు మర్చిపోయాడని.. సాధారణంగా ఏ పైలెట్ ఇలా పాస్పోర్ట్ మర్చిపోకుండా లైట్ వద్దకు వెళ్లడానికి అంటున్నారు. ఏది ఏమైనా దీని గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు.
Also Read : 2023 అక్టోబర్ 1 తర్వాత పుట్టిన వాళ్లకు పాస్ పోర్టు కావాలంటే అది ఇవ్వాల్సిందే