Kolkatha-Bankok Highway : కోల్ కతా-బ్యాంకాక్ హైవే చాలా స్పెషల్.. వాణిజ్యమే కాదు.. టూరిజంపై ప్రధాన దృష్టి .. ఈ త్రైపాక్షిక హైవే గురించి పూర్తి కథనం..

టూరిస్ట్ ప్లేస్ లలో భారతీయులు ఎక్కువగా విజిట్ చేసేది బ్యాంకాక్, థాయ్ లాండ్, మయన్మార్.. ఇప్పటి వరకు ఈ దేశాలకు వెళ్లాలంటే విమానంలో వెళ్లేవారు.. కానీ 2027 తర్వాత బై రోడ్ లో కూడా వెళ్లవచ్చని మూడు దేశాల ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఈ త్రైపాక్షిక హైవేతో టూరిజమే కాకుండా వాణిజ్యం కూడా పెరగబోతోంది.

Written By: Mahi, Updated On : August 28, 2024 11:08 am

Kolkatha-Bankok Highway

Follow us on

Kolkatha-Bankok Highway: బ్యాంకాక్ వెళ్లాలంటే దాదాపు ఫ్లయిట్ దారినే ఎంచుకుంటాం.. కానీ ఈ హైవే పూర్తయితే బైరోడ్ కూడా వెళ్లవచ్చు. హాయిగా.. ప్రకృతిని ఆశ్వాదిస్తూ ఆనందంగా ప్రయాణం చేయవచ్చు. ప్రస్తుతం భారత ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ హైవే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇది పూర్తయితే థాయ్ లాండ్, మయన్మార్ ను కూడా కలుపుతుంది. త్రైపాక్షిక రహదారి అని కూడా పిలువబడే కోల్కతా-బ్యాంకాక్ హైవే భారతదేశం, మయన్మార్, థాయ్ లాండ్ మధ్య కనెక్టివిటీని పెంచే ఒక ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు. ఈ రహదారి భారతదేశంలోని కోల్ కత్తా నుంచి బ్యాంకాక్, థాయ్ లాండ్ వరకు వెళ్తుంది. మయన్మార్ గుండా వెళ్తుంది. మెరుగైన వాణిజ్య సంబంధాలు, ప్రాంతీయ సమైక్యతకు అనుమతిస్తుంది. 2,800 కిలో మీటర్ల పొడవైన ఈ రహదారి థాయ్ లాండ్ తో తక్కువ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అయితే భారతదేశంను పరిశీలిస్తే అతి పొడవైన రహదారిగా ఉంటుందిన తెలుస్తోంది. ఇండియాస్ లుక్ ఈస్ట్ పాలసీకి అనుగుణంగా ఉన్న ఈ ప్రాజెక్టు బంగాళాఖాతం ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (బిమ్ స్టెక్)లో భాగం. ఇది పూర్తయితే, ఇది భారతదేశంలోని పొడవైన హైవే ప్రాజెక్టుల్లో ఒకటిగా ఉంటుందని చెప్తున్నారు.

భారత్, మయన్మార్, థాయ్ లాండ్ మధ్య సామరస్యపూర్వక సంబంధాలను పెంపొందించేందుకు 2002లో భారత మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్ పేయి త్రైపాక్షిక రహదారిని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు మూడు దేశాల మధ్య ఎలాంటి అంతరాయం లేకుండా కనెక్టిటీని కలిగి ఉంటుంది. ఈ హైవేతో మూడు దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా.. వాణిజ్య పరంగా మేలు జరుగుతుంది. పైగా పర్యాటకం కూడా మెరుగవుతుందని ఇరు దేశాలకు చెందిన ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఈ హైవే నిర్మాణంలో అనేక అడ్డంకులు, ఆలస్యాలు ఉన్నప్పటికీ, ఈ రహదారి 2027 నాటికి పూర్తవుతుందని అందరూ భావిస్తున్నారు.

కోల్ కత్తా-బ్యాంకాక్ హైవేతో ప్రయోజనాలు..
కీలక నగరాల అనుసంధానం..
భారత్ -బ్యాంకాక్ -మయన్మార్ -థాయ్ లాండను కలిపే ఈ రహదారి బ్యాంకాక్, యాంగూన్, మాండలే, కోల్ కత్తాతో పాటు మూడు దేశాల్లోని ఇతర ప్రధాన నగరాలను కూడా కలుపుతుంది. భారతదేశంలో, సిలిగురి, గౌహతి, కోహిమా వంటి ప్రదేశాల నుంచి ఈ హైవే వెళ్తుంది. ఇది ఆయా దేశాల్లోని ప్రధాన నగరాలతో కనెక్ట్ పెంచుతుంది. కంబోడియా, లావోస్, వియత్నాంకు ప్రవేశం కల్పించే ఈస్ట్-వెస్ట్ కారిడార్, అయ్యవాడి-చావో ఫ్రయా-మెకాంగ్ ఎకనామిక్ కోఆపరేషన్ స్ట్రాటజీలో ఈ హైవే కీలక పాత్ర పోషిస్తుంది.

మెరుగైన ప్రయాణం..
ఈ మార్గం అందుబాటులోకి వస్తే కోల్ కత్తా, బ్యాంకాక్ మధ్య యాత్రికులు, సందర్శకుల తాకిడి పెరుగుతుంది. గతంలో ఉన్న విమానయానానికి ప్రత్యన్మయంగా ఈ రహదారి ఉంటుంది. ప్రయాణ బడలిక, ఖర్చులను చాలా వరకు తగ్గిస్తుంది. ప్రైవేట్ వెహికిల్స్ లో వెళ్లే వారికి మంచి టూరిస్ట్ అనుభూతి కలుగుతుంది.

వాణిజ్యం పెరుగుదల..
ఈ రహదారి భారతదేశం, ఆసియాన్ దేశాల మధ్య దిగుమతులు, ఎగుమతులకు ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఆర్థిక సంబంధాలు మెరుగవుతాయి. వాణిజ్య పరిమాణాలను ఈ రహదారి పెంచుతుంది.

ఈ రహదారి కనెక్టివిటీని పెంచేందుకు, మూడు దేశాల మధ్య సజావుగా రవాణా అనుమతించేందుకు పలు విభాగాలుగా విభజించారు. ఇది పూర్తయితే, కోల్ కత్తా-బ్యాంకాక్ హైవే ప్రాంతీయ సహకారం, పురోగతికి చిహ్నంగా ఉంటుంది. ఆగ్నేయ ఆసియా వాణిజ్య, ప్రయాణ దృశ్యం పూర్తిగా మారిపోతుంది.