Isha Foundation Police Raid: దేశంలో బాబాల ముసుగులో అనేక అక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న విషయాలు ఆలస్యంగా బయట పడుతున్నాయి. నిత్యానంద స్వామి దేశం విడిచి పారిపోయాడు. డేరాబాబా అయితే జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడుకు చెందిన అనేకమంది స్వామీజీలు ఆరోపణలు ఎదురొం్కంటున్నారు. ఆశ్రమానికి వచ్చేవారిని వేధిస్తున్నారని, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్నింటిపై విచారణ కూడా సాగుతున్నాయి. తాజాగా మరో స్వామీజీ చిక్కుల్లో పడ్డారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అనేక మందికి బ్రెయిన్ వాష్ చేసి సన్యాసులుగా మారుసుతన్న ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో సుమారు 150 మంది పోలీసులు ఈషా ఫౌం్డషన్‌ను చుట్టముట్టారు. అనువణువు సోదాలు చేశారు.
తమ కూతుళ్లను సన్యాసం ఇచ్చారని..
చెన్నైకి చెందిన రిౖటñ ర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.కామరాజు తమ కూతుళ్లకు ఇషా ఫౌండేషన్ బలవంతంగా సన్యాసం ఇచ్చిందని మంద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు., హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. విచారణ అనంతరం పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫౌండేషన్‌లో పరిస్థితులు, కామరాజ్ కూతుళ్ల అభిప్రాయాలు తెలుసుకోవాలన సూచించింది. దీంతో సుమారు 150 మంది పోలీసులు ఇషా ఫౌండేషన్‌ను చుట్టుముట్టారు. కామరాజ్ కుమార్తెలతో మాట్లాడారు. అక్కడ ఉన్న అనేక మంది అభిప్రాయం తెలుసుకున్నారు.
యోగా, ఆధ్యాత్మికత కోసమే..
ఇదిలా ఉంటే.. యోగా, ఆధ్యాత్మికతను ప్రోత్సహించాలన్న సంకల్పంతో ఈషా ఫౌండేషన్ ఏర్పాటు చేశామని సంస్థ ప్రతినిధుల తెలిపారు. పెళ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం, సన్నాసం స్వీకరించడం వంటి అంశాలు ఇక్కడికి వచ్చేవారి వ్యక్తిగత అంశాలని పేర్కొంది. ఇక్కడ ఎవరినీ బలవంతంగా సన్యాసం తీసుకోమని ఒత్తిడి చేయడం లేదని తెలిపింది. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెల్లడించింది. అయితే సన్యాసం స్వీకరించిన వేలాది మందికి ఈషా యోగా కేంద్రం నిలయంగా ఉందని పేర్కొంది.
పోలీసులకు సహకారం..
తాము పోలీసులకు పూర్తి సహకారం అందిస్తున్నట్లు ఈషా సంస్థ తెలిపింది. తాము ఎవరినీ ఒత్తిడి చేయడం లేదని తెలిపింది. కామరాజ్ కుమార్తెలు మేజర్లని, వారి ఇష్టప్రకారమే సన్యాసం తీసుకున్నారని వెల్లడించింది. కోర్టు ఆదేశాలను పాటిస్తూ పోలీసులకు తాము అన్నివిధాలుగా సహకరిస్తున్నామన్నారు. తమ ఫౌండేషన్‌పై అసత్య ప్రచారం చేయొద్దని సూచించారు.
1992లో ప్రారంభం..
ఇదిలా ఉంటే.. ఈషా ఫౌండేషన్ 1992లో ప్రారంభమైంది. ఎలాంటి లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక సంస్థ. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో సద్గురు(జగదీష్ వాసుదేవ్) దీనిని స్థాపించారు. ఈషా యోగా కేంద్రాన్ని, ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్వహిస్తుంది. పూర్తిగా వలంటీర్లే దీనిని నిర్వహిస్తున్నారు. నీలగిరి పర్వతాలలో భాగమైన వెల్లియంగిరి శ్రేణిలో 150 ఎకరాల స్థలంలో దట్టమైన అడవులు, ప్రత్యేకమైన వన్యప్రాణుల అభయారణ్యంతో ఉంది. ఇది ప్రఖ్యాత శక్తి కేంద్రం భక్తి, జ్ఞానోదయం, కర్మ, క్రియ వంటి యోగా అన్ని విభాగాలను ఒకే గొడుగు క్రింద అందించడం, గురు–శిష్య సంప్రదాయాన్ని పునరుద్ధరించడం ద్వారా ప్రపంచం నలుమూలల నుండి ప్రజలను ఆకర్షిస్తుంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: The isha foundation in coimbatore was raided by 150 police officers the organization explained
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com