Andhra Pradesh Government: ఆంధ్రప్రదేశ్ లో అప్పుల బారం పెరిగిపోతోంది. దీంతో సీఎం జగన్ ఆపసోపాలు పడుతున్నారు. నెలనెల ప్రభుత్వ నిర్వహణ కష్టంగా మారుతోంది. దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు గా ఉంది పరిస్థితి. అందినకాడల్లా అప్పులు చేస్తూ లక్షలాది కోట్లు అప్పులు చేస్తూ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారు. ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో నెలనెల గడవడం కష్టంగా మారుతోంది. దీనిపై జగన్ కూడా లోలోపల బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్తులను ఎక్కడికక్కడ తనఖా పెడుతూ రుణాలు తీసుకుంటున్నారు.
ఈనేపథ్యంలో ఏపీలో సంక్షేమ పథకాల అమలు పెరగడంతో ప్రభుత్వంపై భారం పడుతోంది. ప్రతి సంవత్సరం లక్షలాదికోట్లు అప్పులు తెస్తుండటంతో అప్పుల భారం ఎక్కవవుతోంది. ఈ క్రమంలో జగన్పై భాధ్యత పెరుగుతోంది. ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి అప్పులు తెస్తోంది. కేంద్రం వద్ద నుంచి కూడా ఎడాపెడా అప్పులు వారం వారం తెచ్చుకుంటున్నారు. దీంతో రిజర్వ్ బ్యాంకు దగ్గర కూడా లెక్కకు మించి రుణాలు తీసుకొచ్చారు. రాష్ట్రంలో అన్ని ఆస్తులను దాదాపు ఇప్పటికే కుదువ పెట్టినట్లు తెలుస్తోంది.
Also Read: సంపత్ రాజ్ భార్య ఎవరో తెలుసా? అసలు విడిపోవడానికి కారణం ఏంటి?
దీంతో రుణాల వెతుకులాట ప్రభుత్వానికి తప్పడం లేదు. ఎక్కడ పడితే అక్కడ బాకీలు తెస్తూ పబ్బం గడుపుతోంది. ఏపీ ప్రభుత్వం ఇలా అప్పులు చేస్తుండటంతో వడ్డీలు సైతం పెరిగిపోతున్నాయి. కానీ ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయ వనరులు కనిపించడం లేదు. దీంతోనే ప్రభుత్వ భూములను చూపించి రుణాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అమరావతిలోని భూములను కూడా తనఖా పెట్టేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో అప్పులు ఇలా పెరుగుతుంటే జగన్ ఇచ్చిన హామీల అమలుకు ఇంకా పెద్ద మొత్తంలోనే రుణాలు అవసరమవుతున్నాయి. దీంతో రోజురోజుకు రుణాల భారం ఆకాశాన్నంటుతోంది. అయినా జగన్ మాత్రం భయపడకుండా పెద్ద మొత్తంలో అప్పులు తీసుకొచ్చేందుకే మొగ్గు చూపుతోంది. సంక్షేమ పథకాల అమలుతో రుణాల భారం ఇంకా ఎక్కువ అవుతోంది. ఇంకా రెండేళ్లు ఉండటంతో ప్రభుత్వానికి గుదిబండగా మారే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అయినా ప్రభుత్వానికి రుణాల భారం తప్పేలా కనిపించడం లేదు.
కానీ ప్రభుత్వం మాత్రం తన పరపతి ఉపయోగించుకుని అప్పులు తీసుకొస్తోంది. ఈ లెక్కన వచ్చే ఎన్నికల నాటికి ప్రభుత్వం సాఫీగా సాగాలంటే ఇంకా అప్పులు ఎక్కువగా చేయాల్సి వస్తోందని తెలుస్తోంది. కానీ జగన్ మాత్రం అందిన చోటల్లా అప్పులు చేస్తూ తమ హామీలు నెరవేర్చుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.