బాదుడే బాదుడు: సామాన్యుడిపై ‘గ్యాస్’ బండ

కాదేది పెంచడానికి అనర్హం అన్నట్టు.. కరోనా కల్లోలంతో ఆదాయం కోల్పోయిన ప్రభుత్వాలు ఇప్పుడు వినియోగదారుడిని ధరాఘాతంతో బాదడమే పనిగా పెట్టుకున్నాయి. ఓ వైపు నిత్యావసరాల మంట.. మరోవైపు పెట్రోల్ ధరలతో సతమతమవుతున్న సామాన్యుల నెత్తిపై తాజాగా ‘గ్యాస్’ బండ పడింది. పెట్రోల్ ధరలను పట్టపగ్గాలు లేకుండా పెంచి క్యాష్ చేసుకుంటున్న మోడీ సర్కార్ ఇప్పుడు ‘గ్యాస్’ పై పడింది. గత కొద్దిరోజులుగా దేశంలో పెట్రోల్, డీజీల్ తోపాటు వంట గ్యాస్ ధరలు కూడా భారీగా పెరుగుతూనే ఉన్నాయి. […]

Written By: NARESH, Updated On : July 1, 2021 10:58 am
Follow us on

కాదేది పెంచడానికి అనర్హం అన్నట్టు.. కరోనా కల్లోలంతో ఆదాయం కోల్పోయిన ప్రభుత్వాలు ఇప్పుడు వినియోగదారుడిని ధరాఘాతంతో బాదడమే పనిగా పెట్టుకున్నాయి. ఓ వైపు నిత్యావసరాల మంట.. మరోవైపు పెట్రోల్ ధరలతో సతమతమవుతున్న సామాన్యుల నెత్తిపై తాజాగా ‘గ్యాస్’ బండ పడింది. పెట్రోల్ ధరలను పట్టపగ్గాలు లేకుండా పెంచి క్యాష్ చేసుకుంటున్న మోడీ సర్కార్ ఇప్పుడు ‘గ్యాస్’ పై పడింది.

గత కొద్దిరోజులుగా దేశంలో పెట్రోల్, డీజీల్ తోపాటు వంట గ్యాస్ ధరలు కూడా భారీగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గ్యాస్ సిలిండర్ ధరలను సైతం చమురు సంస్థలు మరోసారి పెంచాయి.

ఇంట్లో నిత్యావసరమైన సిలిండర్ పై రూ.25, వాణిజ్య సిలిండర్ పై రూ.84ను పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నట్లు తెలిపాయి.

హైదరాబాద్ లో 14.2 కేజీల ఇంట్లో వాడే సిలిండర్ ధర ఏకంగా రూ.834.50కి చేరింది. వాణిజ్యసిలిండర్ ధర ఏకంగా రూ.1768కి పెరిగింది. గత ఆరు నెలల్లోనే వంట గ్యాస్ సిలిండర్ ధర140కి పెగరడం విశేషం.ఈ ఏడాది ఫిబ్రవరి 4న తొలిసారిగా సిలిండర్ ధరను రూ.25కు పెంచారు. ఆతర్వాత రూ.100వరకు పెరిగింది. మార్చి నుంచి ఏప్రిల్ 1 వరకు పెంచుతూ పోయారు.

ఇలా సామాన్యులపై వరుసగా నెలకోమారు.. రెండు సార్లు రూ.25 నుంచి 50 రూపాయలవరకు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరిచేస్తున్నారు.