Homeజాతీయ వార్తలుUnion Budget Of India 2022: వేతన జీవులపై అదే ‘పన్ను’ బాదుడు.. బడ్జెట్ పేరు...

Union Budget Of India 2022: వేతన జీవులపై అదే ‘పన్ను’ బాదుడు.. బడ్జెట్ పేరు గొప్ప.. ఊరు దిబ్బ?

Union Budget Of India 2022: ఎంతో ఊరించారు.. ఉసూరుమనిపించారని బడ్జెట్ పై నిపుణులు, రాజకీయ పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా వేతన జీవులు ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు. ఆదాయపుపన్ను మినహాయింపులపై ఈ బడ్జెట్ లో కరుణ చూపలేదు. దీంతో వేతన జీవులకు తీవ్ర నిరాశ కలిగింది.

Union Budget Of India 2022
Union Budget Of India 2022

ఇప్పటికే కరోనా సమయంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. రాబడి మార్గాలు మూసుకుపోయాయి. ఇంతటి కల్లోలంలో వేతన జీవులకు ఎలాంటి ఊరట లభించకపోవడం అందరినీ నిరాశకు గురిచేయలేదు.

ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే ప్రజల్లో కొనుగోలు సామర్థ్యం పెంచి తద్వారా డిమాండ్ లో వృద్ధితీసుకురావాలి. కానీ ఆదాయపు పన్ను మినహాయింపు ప్రజల చేతిలో నిధులను పెంచుతుంది. తాజాగా బడ్జెట్ ప్రభావం ఎక్కువగా మధ్యతరగతి ప్రజలపై ఎక్కువగా భారం పడేలా ఉంది. ఆదాయపు పన్ను స్లాబుల్లో ఎటువంటి మార్పు చేయకపోవడం మెజార్టీ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది.

కరోనా సమయంలో ఆర్థికంగా ఉన్నత వర్గాల వారికి ఆదాయం పెరిగింది. అయితే మధ్య, దిగువ మధ్యతరగతి వారి ఆదాయాలు మాత్రం గణనీయంగా పడిపోయాయి. చాలా మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం కారణంగా అదనపు ఖర్చులు వచ్చి చేరాయి. కానీ వారికి ఎలాంటి ఊరట కలిగించే నిర్ణయాలను కేంద్రబడ్జెట్ లో ప్రకటించలేదు.

Also Read: Union Budget Of India 2022: పాతికేళ్ల విజన్‌తో కేంద్ర బడ్జెట్.. ఉపాధి కల్పనకు అగ్ర తాంబూలం

దేశ జనాభాలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కేవలం 1శాతం మాత్రమే ఉన్నారు. 130 కోట్ల జనాభాలో ఆదాయపు పన్ను చెల్లింపు దారులు కేవలం 1.45 కోట్లు మాత్రమే. దీంతో కరోనా సమయంలో ఆదాయవర్గాలకు ఎలాంటి పన్ను మినహాయింపులు ఇవ్వకుండా ప్రభుత్వం పిండుడే పరమావధిగా పెట్టుకుంది.

నేషనల్ పెన్షన్ స్కీంలో కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు, యజమాని వాటా కింద చెల్లించే 14 శాతం వరకూ పన్ను మినహాయింపు ఉంది. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీన్ని వర్తింపచేశారు. డిజిటల్ ఆస్తుల బదలాయింపుతో వచ్చే ఆదాయంపై 30శాతం పన్ను వేశారు. క్రిప్టో కరెన్సీని గుర్తిస్తూ పన్ను వేశారు.

Also Read: Union Budjet 2022: వేతన జీవులపై అదే ‘పన్ను’ బాదుడు.. బడ్జెట్ పేరు గొప్ప.. ఊరు దిబ్బ?

-బడ్జెట్ లోని కీలక అంశాలివీ..
-నదుల అనుసంధానానికి ప్రాధాన్యం.. కెన్-బెత్వా ప్రాజెక్టుకు 44605 కోట్లు,

-కోవిడ్ తో మానసికంగా కుంగిపోయిన వారికోసం ‘నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’

-క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై 30శాతం పన్ను

-ఐటీ రిటర్న్ ల దాఖలులో రెండేళ్లలో సవరణలకు వెసులుబాటు

-2022-23 బడ్జెట్ లో ద్రవ్యలోటు 6.9శాతం. మొత్తం బడ్జెట్ అంచనాలు రూ.39 లక్షల కోట్లు.

-డిజిటల్ కరెన్సీ ప్రకట.. దీంతో డిజిటల్ బ్యాంకింగ్ అభివృద్ధి

-దేశీయంగా రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యం

-త్వరలో ఈపాస్ పోర్టు విధానం

-వ్యవసాయ వర్సిటీల్లో సిలబస్ లో మార్పులు

-వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపు కోసం స్టార్టప్ లు

-మహిళ శిశు సంక్షేమ శాఖ పునర్వస్థీకరించి నారీ శక్తికి ప్రాధానం.. మంచి నీటి సరఫరా పథకం విస్తరణ

-పీఎం గతిశక్తి, అభివృద్ధి, ఉత్పాదకత, అవకాశాలు, శక్తివనరులు, వాతావరణ మార్పులపై అధ్యయంనం.. పెట్టుబడులకు చేయూత వంటి ఏడు అంశాలపై ఫోకస్

-2023 చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటన.. దేశీయంగా నూనె గింజల పంటల పెంపు

-నదుల అనుసంధానం: కృష్ణ-గోదావరి, కృష్ణా -పెన్నా, పెన్నా-కావేరి నదులను అనుసంధానిస్తామని ప్రకటన

-400 వందే భారత్ రైళ్లు

Also Read: Union Budget Of India 2022: ఎవుసానికి కేంద్రం పెద్ద పీట.. కనీస మద్దతు ధరతో రైతులకు రూ.2.37 లక్షల కోట్లు..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

4 COMMENTS

  1. […] Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిస్క్ చేసి మరీ బాక్సింగ్ నేపథ్యంలో చేస్తోన్న సినిమా ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ బాక్సర్‌ గా కనిపించనుండగా.. ఈ చిత్రం రిలీజ్‌పై యూనిట్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న ఈ సినిమాను విడుదల చేస్తామని రెండు డేట్‌ లను ప్రకటించింది. గతేడాది డిసెంబర్‌ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular