Big game begins in Bihar Politics: బిహార్.. ఉత్తర భారత దేశంలో అతిపెద్ద రాస్ట్రాల్లో ఇదీ ఒకటి. ఇక్కడ బీజేపీ, జేడీయూ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. నితీశ్‌కుమార్ వరుసగా 15 ఏళ్లు సీఎంగా ఉన్నారు. ఈ ఏడాది చివరలో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి బిహార్‌లో ఎన్డీఏ అదికారంలో రాకుండా చేయడమే లక్ష్యంగా విపక్ష కాంగ్రెస్, ఆర్జేడీ, జన్ సురాజ్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలో హిందీ వ్యతిరేక నిరసనలు, ఏడీఆర్ ఎన్నికల సంస్కరణల వ్యతిరేకత, నార్వే రాయబారితో కిశోర్ సమావేశం రాజకీయ కుట్రల చర్చను రేకెత్తిస్తున్నాయి.
ఎన్డీఏకు వ్యతిరేకంగా కొత్త కూటమి?
కాంగ్రెస్, ఆర్‌జేడీలతో కూడిన ఇండియా కూటమి బిహారీ గుర్తింపు, సామాజిక న్యాయ ఎజెండాతో ముస్లిం, యాదవ, ఓబీసీ, ఈబీసీ ఓట్లను లక్ష్యంగా చేసుకుంది. ప్రశాంత్ కిశోర్ జన్ సురాజ్ పార్టీ అగ్రకులాల ఓట్లను చీల్చడంతోపాటు యువత, నిరుపేదలను ఆకర్షిస్తోంది. కిశోర్ జేడీయూ 25 సీట్లు దాటదని, నితీశ్ కుమార్ మళ్లీ సీఎం కాబోడని సవాల్ విసిరారు. ఇండియా కూటమి సామాజిక న్యాయ ఎజెండాతో బలమైన ఓటు బ్యాంకును ఏర్పరచగలదు. ఈ క్రమంలోనే కీలక పరిణామాలు జరుగుతున్నాయి.
మహారాష్ట్రలో హిందీ వ్యతిరేక నిరసనలు..
మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే (శివసేన యూబీటీ), రాజ్ ఠాక్రే (ఎంఎన్‌ఎస్) హిందీని మూడో భాషగా పరిచయం చేసే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించి, 20 ఏళ్ల తర్వాత కలిశారు. ఈ నిరసనలు మహాయుతి (బీజేపీ–శివసేన) ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, హిందీ విధానాన్ని రద్దు చేయించాయి. బిహారీలపై దాడులు ఈ నిరసనలతో ముడిపడి ఉన్నాయనే అనుమానం ఉంది. ఈ నిరసనలు బీజేపీకి రాజకీయ నష్టం కలిగించి, బిహార్ ఎన్నికల్లో బిహారీ గుర్తింపును లేవనెత్తే ఇండియా కూటమి వ్యూహానికి సహకరిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: మోడీని దిగిపోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ హింట్ ఇచ్చాడా? ప్రధానిని దించడం సాధ్యమేనా?!
నార్వే రాయబారి సమావేశం..
ప్రశాంత్ కిశోర్‌తో నార్వే రాయబారి సమావేశం కొత్త చర్చకు దారితీసింది. నార్వే గతంలో లిబియా, ఇథియోపియా, శ్రీలంకలో ప్రభుత్వాల మార్పుకు సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొన్న చరిత్ర ఉంది. ఈ సమావేశం ఎన్డీఏను ఓడించే కుట్రలో భాగమనే ఊహాగానాలు ఉన్నాయి.
ఎన్నికల సంస్కరణను వ్యతిరేకిస్తున్న ఏడీఆర్..
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) బిహార్‌లో ఓటరు జాబితా సవరణను వ్యతిరేకిస్తోంది, దీనిని ఎన్డీఏ ఆమోదించింది. గతంలో ఎన్నికల బాండ్ల రద్దు, రఫేల్ వివాదంలో బీజేపీని లక్ష్యంగా చేసుకున్న ఏడీఆర్, ఇండియా కూటమికి మద్దతుగా పనిచేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఏడీఆర్ వ్యతిరేకత ఓటరు జాబితా సవరణను దళిత, ఓబీసీ, మైనారిటీ ఓటర్లకు వ్యతిరేకమైన చర్యగా చిత్రీకరిస్తోంది. ఇది ఇండియా కూటమికి రాజకీయంగా లాభిస్తుంది.
ఎన్డీఏలో అంతర్గత సవాళ్లు..
ఎన్డీఏలో బీజేపీ 74 సీట్లతో బలంగా ఉన్నప్పటికీ, జేడీయూ 43 సీట్లతో బలహీనంగా ఉంది. చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ 243 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించి, ఎన్డీఏ ఓట్లను చీల్చే అవకాశం ఉంది. బిహార్‌లో ఎన్డీఏను ఓడించేందుకు కాంగ్రెస్, ఆర్జేడీ, జన్ సురాజ్ వ్యూహాత్మక కదలికలు సాగిస్తున్నాయి. మహారాష్ట్రలో హిందీ వ్యతిరేక నిరసనలు, ఏడీఆర్ ఎన్నికల సంస్కరణల వ్యతిరేకత, నార్వే రాయబారి సమావేశం రాజకీయ కుట్రల చర్చను రేకెత్తిస్తున్నాయి. ఎన్డీఏలో అంతర్గత కలహాలు, చిరాగ్ పాశ్వాన్ స్వతంత్ర వైఖరి ఇండియా కూటమికి అవకాశం కల్పిస్తున్నాయి. అయితే, విదేశీ జోక్యం ఆరోపణలకు ఆధారాలు అవసరం. బిహార్ ఎన్నికలు రసవత్తరంగా మారినప్పటికీ, ఫలితాలే ఈ రాజకీయ ఆటలో విజేతను నిర్ణయిస్తాయి.