Thalapathy Vijay Falls: జననాయగన్ సినిమా ఆడియో లాంచ్ కోసం ఇటీవల తమిళ సూపర్ స్టార్ విజయ్ చిత్ర బృందంతో కలిసి మలేషియా వెళ్లారు. అక్కడ భారీగా వచ్చిన ప్రేక్షకుల మధ్య ఆడియో లాంచ్ చేశారు. ఆ తర్వాత ఆయన చెన్నై నగరానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన వస్తున్నారని విషయం తెలుసుకున్న అభిమానులు భారీగా చెన్నై విమానాశ్రయానికి వచ్చారు. చెన్నై విమానాశ్రయానికి విజయ్ వచ్చిన తర్వాత అక్కడ ఒకసారి గా కలకలం నెలకొంది.
విజయ్ చెన్నై విమానాశ్రయం వచ్చిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది. ఆ వీడియోలో విజయ్ జారిపడ్డారు. మలేషియాలో విజయ్ జననాయగన్ ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ఇది విజయ్ 69వ సినిమా. ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని ప్రత్యేకమైన విమానంలో విజయ్ చెన్నై వచ్చారు. ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా రావడంతో అడుగు కూడా వేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఆయన ఒక్కసారిగా కింద పడిపోయారు.. వెంటనే భద్రతా సిబ్బంది ఆయనకు అండగా నిలిచారు. జనంలో విజయ్ పడిపోయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తోంది.
విజయ్ జన నాయకన్ ఆడియో లాంచ్ కోసం ఇటీవల మలేషియా వెళ్లారు. ఆడియో లాంచ్ తర్వాత ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. సినిమాలకు దూరం జరుగుతున్నానని చెప్పి భావోద్వేగానికి గురయ్యారు. ఇది తన చివరి చిత్రమని.. కన్నీరు పెట్టుకున్నారు. ఆయన అలా చెప్పడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తమ అభిమాన నటుడు ఇలాంటి ప్రకటన చేయడం పట్ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే ఆయనను చూసేందుకు భారీగా విమానాశ్రయానికి వచ్చారు.. ఈ క్రమంలోనే విజయ్ కింద పడ్డారు. వెంటనే భద్రత సిబ్బంది ఆయనను అత్యంత కట్టుదిట్టమైన ప్రొటెక్షన్ మధ్య కారులోకి ఎక్కించారు. ఆ తర్వాత ఆయన తన ఇంటికి వెళ్లే వరకు ఎస్కార్ట్ కల్పించారు.
విజయ్ జననాయగన్ సినిమాను కేవీఎన్ సంస్థ నిర్మించింది. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే, మమత బైజు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బాబి డియోల్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నాడు. పొంగల్ కానుకగా ఈ సినిమా విడుదల కాబోతోంది. అనిరుద్ రవిచంద్రన్ స్వరపరిచిన మూడు పాటలు ఇప్పటికే చాట్ బస్టర్ అయ్యాయి. తెలుగులో విజయం సాధించిన భగవంత్ కేసరి సినిమాకు జననాయగన్ రీమేక్.
#WATCH | மலேசியாவில் இருந்து சென்னை திரும்பியபோது கூட்ட நெரிசலில் சிக்கி தடுமாறி கீழே விழுந்த விஜய்!#SunNews | #Vijay | #ChennaiAirport pic.twitter.com/os3XYCulvR
— Sun News (@sunnewstamil) December 28, 2025