Bank scams: ప్రపంచ స్థాయి ప్రముఖ బ్యాంకు అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్(యూబీఎస్).. ఇలా అంటే ఎవరికీ తెలియదు.. స్విస్ బ్యాంకు.. పేరు కూడా చాలా మందికి తెలియదు.. కానీ సంపన్నులకు, నల్లధనం దాచుకునే వ్యాపారులు, నేతలకు దీనిగురించి బాగా తెలుసు. భారత్కు చెందిన వేల కోట్ల రూపాయలన నల్లధనం ఈ బ్యాంకులో ఉంది. ఈ బ్యాంకు పాటించే గోప్యత కారణంగానే చాలా మంది ఇక్కడ తమ డబ్బులు దాచుకుంటున్నారు. ఇదిలాఉంటే.. ఈ బ్యాంకు ఇప్పుడు సంచనల నిర్ణయం తీసుకుంది. దీంతో పది వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. మొత్తం ఉద్యోగుల్లో ఇది 9 శాతంగా లెక్కలు చెబుతున్నాయి.
ఎందుకీ నిర్ణయం..
2023లో క్రెడిట్ సూయిస్ విలీనం అనంతరం భారీగా ఆపరేషనల్ ఖర్చులు తగ్గించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో యూబీఎస్ఉద్యోగుల సంఖ్యను నియంత్రణలో ఉంచేందుకు మేకానిజాలు, స్వచ్ఛంద పదవీ విరమణలు, అలాగే ఉద్యోగుల వలసలు ద్వారా సంస్కరణలు అమలు చేస్తోంది. తొలగించిన ఉద్యోగుల స్థానాలను కొత్తగా భర్తీ చేయకుండా, మిగిలిన సిబ్బందితో పని నిర్వహిస్తారని ప్రకటించింది బ్యాంకు.
ప్రపంచవ్యాప్తంగా ప్రభావం..
స్విస్ కేంద్ర కార్యాలయం కంటే ఇతర దేశాల్లోని ఆ బ్యాంకు శాఖల కార్యాలయాల్లో ఉద్యోగులపై అసలు ప్రభావం తక్కువగా ఉంటుందని యాజమాన్యం అధికారులు వివరణ ఇచ్చారు. 2025 సెప్టెంబరు వరకు ఉద్యోగుల సంఖ్య 1,04,427 ఉంది. రాబోయే ఏళ్లలో ఉద్యోగాల తగ్గుదల మరింత ఘనంగా ఉంటుందని అంచనా. స్విస్ బ్యాంకు అంచనా ప్రకారం, ఈ తొలగింపులు వచ్చే నాలుగు ఐదు త్రైమాసికాల్లో మరింత వేగవంతం కావచ్చు.
బ్యాంకు సమీకరణాల ఖర్చులను తగ్గించి, మరింత సమర్థవంతమైన వ్యాపార నిర్మాణాన్ని అభివృద్ధి చేసేందుకు స్విస్ బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇలాంటి భారీ ఉద్యోగాల తొలగింపులు బ్యాంకింగ్ రంగంలోనే కాదు, ఆర్థిక రంగంలో కూడా భారీ మార్పులకు సంకేతం అని నిపుణులు పేర్కొంటున్నారు.