ABN RK: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చూసి ఏబీఎన్ ఆర్కే గుండెలు బాదుకుంటున్నారు. జగన్ అటు బిజెపితో.. ఇటు కాంగ్రెస్ తో దోస్తీ చేస్తున్నాడని.. మాయ చేస్తున్నాడని.. ఇది దారుణాతి దారుణ చర్య అని.. సోనియా, రాహుల్ గాంధీకి రాజకీయం తెలియదని.. అందుకే తమ దగ్గరకు వచ్చిన షర్మిలను సందేహంలో పడేశారని ఆర్కే తన కొత్త పలుకులో రాసుకు వచ్చారు. జగన్ డబ్బుతో మేనేజ్ చేసి కాంగ్రెస్ శిబిరాన్ని లోగోరుచుకున్నారన్నది ఆర్కే సందేశం. అయితే తాను అనుకున్నది జరగలేదని. తన రాతల ద్వారా వ్యక్తం చేశారు ఆర్కే. సోనియాతో దోస్తీకి తహతహలాడుతున్న జగన్ను ప్రధాని మోదీ నమ్మడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
జగనన్న వదిలిన బాణం తెలంగాణ వైపు దూసుకెల్లడమే ఒక అనుమానం. తెలంగాణలో కేసీఆర్ నుంచి మైనారిటీలు, రెడ్లు, పాత వైయస్సార్ అభిమానులు ఓట్లను చీల్చడానికి.. తద్వారా బిజెపికి ప్రయోజనం చేకూర్చేందుకే షర్మిల తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఉండొచ్చు కదా? అయితే వీర సమైక్యవాదిగా పేరుపొందిన షర్మిలను తెలంగాణ ప్రజలు విశ్వాసంలో తీసుకోలేదు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో విపక్ష కూటమి కాంగ్రెస్ ఆధ్వర్యంలో పురుడుపోసుకుంది. రోజురోజుకీ బలోపేతం అవుతుంది. రేపు పొద్దున అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే జగన్ తన బాణమైన షర్మిలను కాంగ్రెస్ శిబిరంలోకి పంపించి ఉండవచ్చు కదా. మరోవైపు డీకే శివకుమార్ ద్వారా డబ్బులతో కాంగ్రెస్ కు సన్నిహితం కావడానికి ప్రయత్నించొచ్చు కదా. ఒకప్పుడు చంద్రబాబు సైతం ఇదే డబ్బులతోనూ కాంగ్రెస్కు దగ్గర అయిన మాట వాస్తవమే కదా. అంతెందుకు కేసిఆర్ కూడా డబ్బులు రాజకీయాలే చేస్తున్నారు కదా. అవసరమైతే తనను లీడరుగా ఎన్నుకుంటే ప్రతిపక్షాల ప్రచార ఖర్చు బాధ్యతను తనదేనని ఓపెన్ ఆఫర్ ఇచ్చిన మాట వాస్తవమే కదా.
ఇన్ని అనుమానాలను పరిగణలోకి తీసుకోకుండా ఆర్కే శోకాలు పెడుతుండడం విశేషం. షర్మిలాను కాంగ్రెస్ తెలంగాణలో పోటీ చేయించడం లేదు. అలాగని ఏపీలో కూడా ఉపయోగించడం లేదు. ఏపీలో జగన్కు వ్యతిరేకంగా షర్మిల బాణం అవుతారని ఆర్కే భావించారు. ఇప్పుడు జగన్, కాంగ్రెస్ ఒక్కటైతే షర్మిల వేరవుతారా అన్నది ఆర్కేనే ఆలోచించుకోవాలి. జగన్,కాంగ్రెస్, షర్మిల ఒకటైతే.. అది రహస్యంగా నైనా మరి మా చంద్రబాబు పరిస్థితి ఏమిటన్నదే ఆంధ్రజ్యోతి బాధ.
జగన్ ఎవరితో కలవాలన్నది వచ్చే ఎన్నికల ఫలితాలే తేలుస్తాయి. అంతేకానీ మోడీ నీ వెనుక జగన్ కాంగ్రెస్తో కాళ్ల బేరాలకు దిగారని.. ముందస్తు ఒప్పందం చేసుకుంటున్నాడని రాధాకృష్ణ కథనాలు రాస్తే మోదీ నమ్మే ఛాన్స్ ఉందా? వెంటనే జగన్ పై కోపం తెచ్చుకుని దూరం పెట్టాలన్నది ఆర్కే భావనగా తెలుస్తోంది. తద్వారా జనసేన బిజెపి, టిడిపిలను ఒక్కతాటిపైకి తేవాలన్నది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆలోచన. అందుకే ఈ అర్థం పర్థం లేని శోకాలని.. ఆర్కే రాతలు కన్ఫ్యూజ్ గా ఉన్నాయని.. ఆయనకు అర్థం అవ్వని రీతిలో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు నడుస్తున్నాయని సెటైర్లు పడుతున్నాయి. ఆర్కే రాతల్లో భయం స్పష్టంగా కనిపిస్తోందని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. అటు షర్మిల విషయంలో సైతం ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి అన్న ట్యాగ్ లైన్ పక్కకు వెళ్లిపోయింది. తాను ఒకటి ఊహిస్తే.. మరో టైపు రాజకీయాలు జరుగుతున్నాయన్న బాధ ఆర్కే లో వ్యక్తం అవుతోంది. దీంతో తన రాతలతో అక్కసు వెళ్ళగక్కుతున్నారు.