T-Hub 2.0: తెలంగాణ ప్రభుత్వం ఐటీకి పెద్దపీట వేస్తోంది. సాంకేతికతను ఉపయోగించుకుని రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడంలో మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని ముందుకెళ్తున్నారు. పెట్టుబడులు పెట్టిస్తూ పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ ను ఐటీలో ఎంతో ఎత్తుకు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ లోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో 2015లో మొదటి హబ్ ను ఏర్పాటు చేసింది. తరువాత అంతే స్థాయిలో ఉండేందుకు రెండో హబ్ ను కూడా ఏర్పాటు చేసింది.

టీ హబ్-2.0కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించింది. రూ.276 కోట్లతో నిర్మించిన టీ హబ్ 2.0 దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ సెంటర్ గా మారనుంది. దీంతో ప్రభుత్వం టీహబ్ నిర్మాణానికి ఎంతో శ్రద్ధ పెట్టింది. భవిష్యత్ లో రాష్ట్రం మరింత అభివృద్ధి కావాలంటే సాంకేతికత చాలా అవసరమని గుర్తించి హబ్ నిర్మాణంపై దృష్టి సారించింది. 5.82 చదరపు అడుగుల విస్తీర్ణంలో అందరి దృష్టి ఆకర్షించేలా పది అంతస్తులతో నిర్మించి తన సత్తా చాటుతోంది.
Also Read: Cabinet Reshuffle in Telangana: మంత్రివర్గ మార్పునకు లైన్ క్లియర్.. రాజ్‌భవన్‌లో ఎంట్రీ అందుకేనా?
టీ హబ్ 2.0 ను నేడు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. కొరియా కంపెనీ టీహబ్ 2.0 ను రూపకల్పన చేసింది. దీంతో ప్రభుత్వం టీ హబ్ నిర్మాణంలో ఎంతో ఉత్సాహం చూపించింది. దీని నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ వేగవంతంగా పూర్తి చేసేందుకు సర్వ శక్తులు ఒడ్డింది. దీంతో ప్రభుత్వం ఐటీ కోసం నిధులు కేటాయిస్తూ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే టీ హబ్ 2.0 నిర్మాణం రూపుదిద్దుకుంది. ప్రజాప్రతినిధుల చొరవతో టీ హబ్ నిర్మాణం పూర్తయినట్లు తెలుస్తోంది.

టీహబ్ 2.0 ని పది అంతస్తులతో నిర్మించడంతో ఇందులో అధునాతన సదుపాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐటీ రంగం పురోగమనంలో దీని పాత్ర ఎంతో కీలకం కానుంది. ఇప్పటికే రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతుండనుందని సమాచారం. దీంతో రాష్ట్రంలో మరిన్ని ఉపాధి మార్గాలు వచ్చే వీలుంది. దీనికి ప్రభుత్వం చేపట్టిన చర్యలే ఇందుకు దోహదపడుతున్నాయని చెబుతున్నారు. మొత్తానికి టీహబ్ 2.0తో ఎన్నో రకాలైన లాభాలు జరగనున్నట్లు విశ్లేషకులు సూచిస్తున్నారు.
Also Read:CM KCR Visits Raj Bhavan: కేసీఆర్ కాంప్రమైజ్.. రాజ్‌భన్‌కు వచ్చిన సీఎం.. తమిళిసైతో మాటామంతి!