మహేష్ తో తెలంగాణ పోలీస్: బీ అలెర్ట్

కరోనా కల్లోలం వేళ ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యతను పోలీసులు భుజానకెత్తుకున్నారు. ఎవరితో చెప్పిస్తే బాగా ప్రజల్లోకి వెళుతుందో వారితేనే చెప్పిస్తున్నారు. ముఖ్యంగా క్రేజ్ ఉన్న సినీ తారల వీడియోలు, వాయిస్ లతో తెలంగాణ పోలీసులు కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతోంది. ఈ మహమ్మారి వ్యాప్తికి కళ్లెం వేసేందుకు అన్ని ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. మాస్క్ ధరించడం.. భౌతిక దూరం పాటించడం సహా కోవిడ్ […]

Written By: NARESH, Updated On : April 25, 2021 9:10 am
Follow us on

కరోనా కల్లోలం వేళ ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యతను పోలీసులు భుజానకెత్తుకున్నారు. ఎవరితో చెప్పిస్తే బాగా ప్రజల్లోకి వెళుతుందో వారితేనే చెప్పిస్తున్నారు. ముఖ్యంగా క్రేజ్ ఉన్న సినీ తారల వీడియోలు, వాయిస్ లతో తెలంగాణ పోలీసులు కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతోంది. ఈ మహమ్మారి వ్యాప్తికి కళ్లెం వేసేందుకు అన్ని ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. మాస్క్ ధరించడం.. భౌతిక దూరం పాటించడం సహా కోవిడ్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విజ్ఞప్తి చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే తెలంగాణ పోలీసులు ప్రజలకు కరోనా అవగాహన కల్పించేందుకు మహేష్ బాబును వాడుకున్నారు. ఆయన డైలాగులతో వినూత్న ప్రచారం మొదలు పెట్టారు.

మహేష్ బాబు మాస్క్ ధరించి ఉన్న ఓ ఫొటోతో ప్రత్యేక వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో వదిలారు. మాస్క్, కరోనా రక్షణ నిబంధనలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

‘జీవితం అనేది ఒక యుద్ధం.. దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు.. అప్రమత్తంగా ఉండండి.. మిమ్మల్ని మీరు రక్షించుకోండి’ అని మహేష్ బాబు చెప్పిన సినిమా డైలాగులను ఈ వీడియోలో జొప్పించారు. అవగాహన కల్పించేలా ఉండడంతో దీన్ని నెటిజన్లు షేర్లు, కామెంట్లు చేస్తూ హోరెత్తిస్తున్నారు.