Inter 1st Year Result 2021: గతేడాది మార్చిలో జరగాల్సిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కరోనా కారణంగా వాయిదా పడ్డ విషయం తెలిసిందే. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత పోయిన అక్టోబర్25 వ తేదీ నుండి నవంబర్ 3 దాకా కండక్ట్ చేశారు అధికారులు. ఈ ఎగ్జామ్స్‌ను 4.3 లక్షల మంది స్టూడెంట్లు రాశారు. కాగా ఈ ఎగ్జామ్స్ ఫలితాలు నేడు నేడు విడుదల కాబోతున్నాయి. ముందుగా చెప్పినట్టుగానే ఈ రోజే రిజల్ట్ రిలీజ్ చేస్తున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. దీంతో స్టూడెంట్లు, తల్లి దండ్రులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక స్టూడెంట్లు అధికారిక వెబ్ సైట్ లోనే తమ ఫలితాలను చెక్ చేసుకోవాలంటూ సూచించింది ఇంటర్ బోర్డు. tsbie.cgg.gov.in అనే తమ అధికారిక వెబ్ సైట్ లోనే విడుదల చేస్తామని కాబట్టి స్టూడెంట్లు కేవలం ఈ వెబ్ సైట్‌ను మాత్రమే అనుసరించాలని వివరించారు. ఈ వెబ్ సైట్‌లోకి వెళ్లిన తర్వాత స్టూడెంట్లు హాల్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేసి ఆ తర్వాత పుట్టిన తేదీ, అలాగే ఇతర వివరాలను ఎంటర్ చేసి రిజల్ట్ సెర్చ్ చేసుకోవాలంటూ వివరించారు.
అయితే ఈ ప్రాసెస్ లో భాగంగా.. అధికారిక వెబ్ సైట్ అయిన tsbie.cgg.gov.in లోకి వెళ్లాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత కొత్త పేజ్‌లో ‘TS Inter First Year Results 2021’ అనే లింక్ మీద క్లిక్ చేస్తే లాగిన్ పేజీ అవుతుంది. ఇక ఈ పేజీలోనే మన ఫలితాలను చూసుకోవచ్చు. ఇందులో హాల్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత బర్త్ డేట్‌ను అలాగే అక్కడ కనిపించే ఇతర వివరాలను నమోదు చేయాలి. ఇలా వివరాలను ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
లోడ్ అయిన తర్వాత కొత్త పేజీలో స్క్రీన్ మీద సబ్జెక్టుల వారీగా మార్కుల లిస్టు కనిపిస్తుంది. ఇక దీన్ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇక ఇందులోనే స్కోర్ కార్డును కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇందులో స్టూడెంట్లు సాధించిన మార్కుల లిస్టు ఉంటుంది. ఇక ఈ సర్వర్ బిజీగా వస్తే గనక మరో సర్వర్ examresults.ts.nic.in ను కూడా అధికారులు అందుబాటులో ఉంచారు. దీంట్లో కూడా రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు.