తెలంగాణ ఆవిర్భావం: అమరులకు కేసీఆర్ నివాళి

ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. జూన్ 2 , 2014న అధికారికంగా తెలంగాణ ఆవిర్భవించింది. 60 ఏళ్ల కల సాకారమైన రోజు. కరోనా లాక్ డౌన్ లేకుంటే తెలంగాణలో సంబరాలు అంబరాన్ని అంటేవి. కానీ ఈ ఆంక్షల నడుమ సాదాసీదాగానే ఈసారి వేడుకలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా ప్రగతి భవన్ లో వేడుకలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. అంతకుముందు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం […]

Written By: NARESH, Updated On : June 2, 2021 12:14 pm
Follow us on

ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. జూన్ 2 , 2014న అధికారికంగా తెలంగాణ ఆవిర్భవించింది. 60 ఏళ్ల కల సాకారమైన రోజు. కరోనా లాక్ డౌన్ లేకుంటే తెలంగాణలో సంబరాలు అంబరాన్ని అంటేవి. కానీ ఈ ఆంక్షల నడుమ సాదాసీదాగానే ఈసారి వేడుకలు నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా ప్రగతి భవన్ లో వేడుకలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. అంతకుముందు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్దకు సీఎం వెళ్లి అమరవీరులకు ఘన నివాళులర్పించారు.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆవిర్భావ వేడుకలను ఈసారి నిరాడంబరంగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీఆర్ఎస్ నేతలు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. సిద్దిపేటలో హరీష్ రావు, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ జాతీయ జెండాలను ఎగురవేశారు. అమరవీరులకు నివాళులర్పించారు. ప్రజలు ఉద్యమం నాటి నుంచి మద్దతిచ్చారని.. వారికి రుణపడి ఉంటానని మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక శాసన మండలి, శాసన సభలోనూ చైర్మన్, స్పీకర్లు జెండాలు ఎగురవేసి అమరులకు నివాళులర్పించారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్టు మోడీ తెలిపారు. తెలంగాణ ప్రజలు విభిన్న రంగాల్లో సంస్కృతితో రాణిస్తున్నారని కొనియాడారు.