https://oktelugu.com/

Telangana Congress Party: కాంగ్రెస్‌లో కాక రేపుతున్న హ‌రీశ్‌రావు.. వీహెచ్‌కు పైస‌లిచ్చిండ‌ట‌..!

Telangana Congress Party: టీ కాంగ్రెస్‌లో వ‌స్తున్న చిచ్చులు అన్నీ ఇన్నీ కావు. మొన్నటి వ‌ర‌కు కాస్త సైలెంట్ గానే కనిపించిన అసంతృప్త నేత‌లు.. మ‌ళ్లీ రైస్ అవుతున్నారు. ముఖ్యంగా వీహెచ్‌, జ‌గ్గారెడ్డి లాంటి వారు అదే ప‌నిగా రేవంత్ నాయ‌క‌త్వంపై విరుచుకుప‌డుతుండ‌టం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. అయితే మొన్న అశోకా హోట‌ల్ లో సీనియ‌ర్ల భేటీ పేరిట నిర్వ‌హించిన కార్య‌క్ర‌మం ఇప్పుడు కాంగ్రెస్‌లో కాక రేపుతోంది. కాగా ఈ వ‌రుస భేటీల వెన‌క మంత్రి హ‌రీశ్ […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 21, 2022 / 01:03 PM IST
    Follow us on

    Telangana Congress Party: టీ కాంగ్రెస్‌లో వ‌స్తున్న చిచ్చులు అన్నీ ఇన్నీ కావు. మొన్నటి వ‌ర‌కు కాస్త సైలెంట్ గానే కనిపించిన అసంతృప్త నేత‌లు.. మ‌ళ్లీ రైస్ అవుతున్నారు. ముఖ్యంగా వీహెచ్‌, జ‌గ్గారెడ్డి లాంటి వారు అదే ప‌నిగా రేవంత్ నాయ‌క‌త్వంపై విరుచుకుప‌డుతుండ‌టం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. అయితే మొన్న అశోకా హోట‌ల్ లో సీనియ‌ర్ల భేటీ పేరిట నిర్వ‌హించిన కార్య‌క్ర‌మం ఇప్పుడు కాంగ్రెస్‌లో కాక రేపుతోంది.

    V Hanumanth Rao

    కాగా ఈ వ‌రుస భేటీల వెన‌క మంత్రి హ‌రీశ్ రావు ఉన్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి లేక‌పోతే.. స‌డెన్‌గా వీ.హెచ్‌, జ‌గ్గారెడ్డిలు ఇంత బ‌లంగా ఎందుకు స‌వాళ్లు విసురుతారు చెప్పండి.. పైగా ఎన్న‌డూ జేబులోంచి పార్టీ నేత‌ల కోసం ఒక్క రూపాయి ఖ‌ర్చుపెట్ట‌ని వీ.హెచ్ గ్రాండ్ గా అశోకాలో ఏర్పాట్లు ఎలా చేశార‌న్న‌ది పెద్ద ప్ర‌శ్నే. అయితే ఈ ఖ‌ర్చు మొత్తం హ‌రీశ్‌రావు పెట్టుకున్న‌దేనంట‌.

    Also Read: Pawan Kalyan: డబ్బుల కోసం ఇంతకు దిగజారుతారా.. జగన్ పై పవన్ ఫైర్

    రేవంత్‌రెడ్డి పార్టీ ప‌గ్గాలు తీసుకున్న త‌ర్వాత పార్టీ కొంచెం స్పీడుగా ప‌రుగులు పెడుతోంది. దీంతో కాంగ్రెస్ ఎక్క‌డ పుంజుకుంటుందో అనే అనుమానంతో సీనియ‌ర్ల‌తో రీసెంట్ గా హ‌రీశ్‌ రావు ర‌హ‌స్యంగా భేటీ అయ్యారంట‌. వీహెచ్ ఇస్తున్న పార్టీ డ‌బ్బులు మొత్తం టీఆర్ ఎస్ వారివే అని తెలియ‌డంతో చాలామంది సీనియ‌ర్లు ఆ భేటీకి డుమ్మా కొట్టారంట‌.

    కేవ‌లం జ‌గ్గారెడ్డి, మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి మాత్ర‌మే ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చారు. దీంతో రేవంత్ అభిమానుల‌కు ఒక ప‌ట్టు దొరికేసింది. కాంగ్రెస్‌లో కొంద‌రు మాత్ర‌మే టీఆర్ ఎస్ కోవ‌ర్టులు ఉన్నార‌ని, వారెవ‌రో అంద‌రికీ తెలిసిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఓ వైపు ఎల్లారెడ్డిపేటలో రేవంత్ భారీ సభ నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలోనే వీరు భేటీ కావ‌డం గ‌మ‌నార్హం.

    రేవంత్ పెట్టిన స‌భకు భారీ స్పంద‌న వ‌స్తుండ‌టంతో.. దాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు సీనియ‌ర్లు ఇలా భేటీ అయ్యార‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి రేవంత్‌ను అంతా క‌లిసిక‌ట్టుగా ఇలా టార్గెట్ చేయ‌డం ఇక్క‌డ చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. మ‌రి ఈ అసంతృప్తుల‌ను రేవంత్ ఎలా దారికి తెచ్చుకుంటార‌న్న‌ది మాత్రం వేచి చూడాలి.

    Also Read: Victory Venkatesh New Movie: కొత్త కాంబినేషన్.. మరి వర్కౌట్ అవుతుందా ?

    Recommended Video:

    Tags