ఎమ్మెల్సీ బరిలో నిలిచేందుకు కాంగ్రెస్‌లో పోటాపోటీ

తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగబోతున్నాయి. దీంతో పార్టీల కన్నంతా ఇప్పుడు మహబూబ్‌నగర్‌‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపైనే పడింది. మరోవైపు.. ఈ ఎన్నికలో సత్తా చాటాలని కాంగ్రెస్‌ శ్రేణులు తహతహలాడుతున్నాయి. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ, నల్గొండ–ఖమ్మం–వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు అధికార పార్టీకి వ్యతిరేక ఫలితాలనే ఇచ్చాయి. దీంతో అదే ఫలితాలను పునరావృత్తం చేసి సత్తా చాటాలని హస్తం పార్టీ శ్రేణులు ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే పాలమూరు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న వారి […]

Written By: Srinivas, Updated On : January 30, 2021 4:43 pm
Follow us on


తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగబోతున్నాయి. దీంతో పార్టీల కన్నంతా ఇప్పుడు మహబూబ్‌నగర్‌‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపైనే పడింది. మరోవైపు.. ఈ ఎన్నికలో సత్తా చాటాలని కాంగ్రెస్‌ శ్రేణులు తహతహలాడుతున్నాయి. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ, నల్గొండ–ఖమ్మం–వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు అధికార పార్టీకి వ్యతిరేక ఫలితాలనే ఇచ్చాయి. దీంతో అదే ఫలితాలను పునరావృత్తం చేసి సత్తా చాటాలని హస్తం పార్టీ శ్రేణులు ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే పాలమూరు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య కూడా బాగానే ఉంది.

Also Read: జానారెడ్డి వ్యాఖ్యల వెనుక మర్మమేంటి..?

2007లో శాసన మండలిని పునరుద్ధరించిన తర్వాత తొలి ఎన్నికల్లో ప్రొగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎమ్మెల్సీగా గెలుపొందారు. లక్కీ డిప్ సిస్టమ్‌లో రెండు సంవత్సరాల పదవి కాలం మాత్రమే దక్కడంతో తిరిగి 2009లో పోటీ చేసి మరో ఆరు సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా కొనసాగారు. 2015లో జరిగిన మహబూబ్ నగర్– రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నుంచి రామచంద్రరావు , టీఆర్ఎస్ నుంచి ఉద్యోగ సంఘాల నేత దేవిప్రసాద్, కాంగ్రెస్ నుంచి రవికుమార్ గుప్తా బరిలో నిలవగా బీజేపీ అభ్యర్ది రామచంద్రరావును గెలిపించి మండలికి పంపారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ సంఘాల నేత దేవి ప్రసాద్ ఓటమిని చవిచూశారు. 2007లో శాసన మండలి పునరుద్ధరణ తరువాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ ఈ సెగ్మెంట్ పరిధిలో పట్టభద్రులు విభిన్నమైన తీర్పు ఇచ్చారు.

Also Read: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి గట్టి షాక్

గత ఎన్నికల్లో 2 లక్షల 90 వేలకు పైగా ఓటర్లు ఎన్ రోల్ చేసుకోగా యాభై శాతం మేరనే ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది . అయితే ఈ సారి ఐదున్నర లక్షలకు పైగా ఓటర్లు ఎన్ రోల్ కానున్నట్లు అంచనా. ఇదిలా ఉంటే ఈ సారి మహబూబ్ నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ దక్కించుకొని తమ సత్తా చాటాలనుకుంటున్నారు పాలమూరు కాంగ్రెస్‌ పార్టీ నేతలు . బరిలో నిలిచేందుకు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలు, అనుబంధ సంఘాల నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఊపును పునరావృతం చేయాలనే తలంపుతో ఉన్నట్లు తెలుస్తోంది .

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

గత ఎమ్మెల్సీ ఎన్నికల వరకు బరిలో నిలిచేందుకు వెనుకాడిన హస్తం పార్టీ నేతలు.. ఈ సారి టికెట్ దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఆశావహులుగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, మాజీ మంత్రి, ఏఐసీసీ సెక్రటరీ, వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, సీనియర్ న్యాయవాది ఎన్పీ వెంకటేశ్ ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. వీరితోపాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలోని పలువురు కాంగ్రెస్ నేతలు టికెట్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది .