CM KCR Birthday: పేదరికంలో పుట్టడం తప్పు కాదు పేదరికంలో చావడం తప్పు అని ఓ సామెత. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మధ్య తరగతి కుటుంబం నుంఇ వచ్చినా ఆయన ఎదిగిన తీరు చూస్తే మనకు అర్థమవుతుంది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా చివరకు తాను అనుకున్నది మాత్రం సాధించారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని ఎదురు నిలిచిన సంగతి తెలిసిందే. కేసీఆర్ సొంత ఊరు మెదక్ జిల్లాలోని చింతమడక. ఇంకా వారి పాత ఊరు ఎగువ మానేరు డ్యాంలో పోవడంతో చింతమడకకు వలస వచ్చి స్థిరపడ్డారు.

సిద్దిపేటలో బీసీ చదివిని ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివారు. తన వాగ్దాటితో అందరిని మెప్పించగల కేసీఆర్ స్థానిక భాషలో అనర్గళంగా మాట్లాడతారు. మన ప్రాంత పదాలు వాడుతూ భాష వ్యక్తీకరణలో అందరిని ఆకట్టుకుంటారు. దీంతోనే ఆయన భాషకు అందరు జై కొడతారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన తన భాషతోనే అందరిని తన వైపు తిప్పుకున్నారు. ఇలా తెలంగాణ ఉద్యమాన్ని అంచెలంచెలుగా ఎదిగింది.
2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పార్టీని స్థాపించి అధికారం లేకున్నా పద్నాలుగేళ్లు పార్టీని నడిపించారు. కాంగ్రెస్ తో జతకట్టి కేంద్రమంత్రిగా కూడా తనదైన పాత్ర పోషించారు. అప్పటి సీనియర్ నేత ఎం. సత్యనారాయణ రావు విసిరిన సవాలును స్వీకరించి తన ఎంపీ పదవికి రాజీనామా చేసి దాదాపు లక్షకుపైగా ఓట్లతో సమాధానం చెప్పి తెలంగాణ ప్రజల ఆకాంక్షను వారికి తెలియజేశారు. దీంతో స్థానిక ఎన్నికల్లో కూడా తనదైన సత్తా చాటి టీఆర్ఎస్ కు తిరుగులేదని నిరూపించారు.
సీనియర్ నేత ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో టీడీపీలో చేరి వారి ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. చంద్రబాబు హయాంలో తనకు మంత్రి పదవి దక్కలేదనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ పార్టీ రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. ప్రొఫెసర్ జయశంకర్ సహకారంతో టీఆర్ఎస్ పార్టీ స్థాపించినట్లు తెలుస్తోంది. అలా ప్రారంభమైన పార్టీ తన ప్రభావాన్ని రాష్ట్రమంతటా వ్యాపించి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది.
Also Read: KCR Politics: తెలంగాణలో ‘ముందస్తు ఎన్నికల’ ఊహాగానాలు!? కేసీఆర్ లొల్లికి కారణమదే?
పథకాల రూపకల్పనలో కూడా తనదైన ముద్ర పోషిస్తున్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కల్యాణ లక్ష్మి, రైతుబంధు, దళిత బంధు లాంటి పథకాలతో ప్రజల మనసులు గెలుచుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో మరో పథకం తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రెండు సార్లు తన వాక్చాతుర్యంతోనే పార్టీని ముందుండి నడిపించారు. భవిష్యత్ లో కూడా పార్టీకి దిశానిర్దేశం చేసే పనిలో పడిపోయినట్లు తెలుస్తోంది.
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఎదురైన చేతు అనుభవంతో బీజేపీని టార్గెట్ చేసుకుని దానిపై విమర్శలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకుని మూడో కూటమి ఏర్పాటుకు రూపకల్పన చేస్తున్నారు. ఇందులో భాగంగానే తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్ సీఎంలు స్టాలిన్, విజయన్, మమతా బెనర్జీలను కలుస్తున్నారు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ప్రాముఖ్యతను తెలియజేస్తూ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రజాఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించి ముందుకు నడుస్తున్నారు.
Also Read: KCR-Chinna Jeeyar Swamy: చిన్న జీయర్ స్వామికి కేసీఆర్ తో చిక్కులు తప్పవా?
[…] Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘భీమ్లా నాయక్’ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఉత్తమ చిత్రం అవుతుందని ఇప్పటికే ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మరి అలాంటి సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తారు. పైగా హీరో పవన్ కళ్యాణ్. అన్నిటికీ మించి ఇది మల్టీస్టారర్. అందుకే.. ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. […]
[…] Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ‘లాక్ అప్’ రియాలిటీ షోకి సిద్ధమవుతున్నారు. బిగ్ బాస్ షోని పోలిన లాక్ అప్ షో సరికొత్తగా రూపొందించారు. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో విరామం లేకుండా నిరంతరం ఈ షో ప్రసారం కానుంది. లాక్ అప్ షో ట్రైలర్ ని ఢిల్లీలో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా హోస్ట్ కంగనా, నిర్మాత ఏక్తా కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లాక్ అప్ షోలో మీరు ఎవరిని లాక్ చేయాలని కోరుకుంటున్నారు? అని అడుగగా… దర్శక నిర్మాత కరణ్ జోహార్ పేరు చెప్పారు కంగనా. నా జైలులో నా బెస్ట్ ఫ్రెండ్ కరణ్ జోహార్ ని బంధించాలని అనుకుంటున్నానని సమాధానం చెప్పారు. […]
[…] […]
[…] Also Read: CM KCR Birthday: కేసీఆర్ బర్త్ డే స్పెషల్: 68వ వసం… […]