Homeజాతీయ వార్తలుTelangana BJP: 90 నియోజకవర్గాలపై చర్చ.. 50 సెగ్మెంట్లపై స్పష్టత

Telangana BJP: 90 నియోజకవర్గాలపై చర్చ.. 50 సెగ్మెంట్లపై స్పష్టత

Telangana BJP: త్వరలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది.. ఈ క్రమంలోనే మంగళవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను వెల్లడించే అవకాశం ఉంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ తెలంగాణ ఇన్ ఛార్జ్ ప్రకాష్ జవదేకర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్,
ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్‌ జాబితాపై చర్చించారు. దాదాపు 90 సెగ్మెంట్ల జాబితాపై చర్చించగా, ఇందులో, సుమారు 50 నియోజకవర్గాలకు సంబంధించి స్పష్టత వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ జాబితాను 15 లేదా 16న ప్రకటించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్‌ నేతలంతా పోటీ చేయాల్సిందే అని బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

ఈనేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు ఎంపీలు బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌, సోయం బాపురావు, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యు డు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌లు బరిలోకి దిగక తప్పని పరిస్థితి ఏర్పడింది. బండి సంజయ్‌ కరీంనగర్‌ నుంచి పోటీ చేస్తారు. ధర్మపురి అర్వింద్‌ కోరుట్ల నుంచి బరిలో దిగే అవకాశం ఉంది. డాక్టర్‌ లక్ష్మణ్‌ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన బదులు పార్టీ సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి పేరు పరిశీలనలో ఉంది. ఈమెతో పాటు ప్రదీప్‌ కుమార్‌ కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు తనయుడు బరిలోకి దిగనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. విజయశాంతిని మెదక్‌ నుంచి పోటీ చేయించే ప్రతిపాదన పార్టీ జాతీయ నాయకత్వం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

పరిశీలనలో ఉన్న ఆశావహుల జాబితా..

సిర్‌పూర్‌ : పాల్వాయి హరీశ్‌; ఆసిఫాబాద్‌ : ఆత్మారావు నాయక్‌, కోట్నాక్‌ విజయ్‌; చెన్నూరు : వివేక్‌; బెల్లంపల్లి : శ్రీదేవి; మంచిర్యాల : రఘునాథరావు; ఆదిలాబాద్‌ : పాయల శంకర్‌, సుహాసినిరెడ్డి; బోథ్‌ : సోయం వెంకటేశ్వర్లు, సాకేటి దశరథ్‌; నిర్మల్‌ : మహేశ్వర్‌రెడ్డి; ముథోల్‌: డాక్టర్‌ రమాదేవి, రామారావు పాటిల్‌; ఖానాపూర్‌ : రమేశ్‌ రాథోడ్‌; బాన్సువాడ : మల్యాద్రిరెడ్డి; ఆర్మూరు : ధర్మపురి అర్వింద్‌, రాకేశ్‌రెడ్డి; బోధన్‌: మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, మోహన్‌రెడ్డి; నిజామాబాద్‌ అర్బన్‌: యెండల లక్ష్మీ నారాయణ, ధన్‌పాల్‌ సూర్యనారాయణ; నిజామాబాద్‌ రూరల్‌: దినేశ్‌ కులాచారి, బస్వా లక్ష్మీ నారాయణ; బాల్కొండ: అన్నపూర్ణమ్మ లేదా ఆమెతనయుడు మల్లికార్జున్‌రెడ్డి; జుక్కల్‌: అరుణతార; ఎల్లారెడ్డి: బానాల లక్ష్మారెడ్డి; కామారెడ్డి : వెంకటరమణారెడ్డి; కోరుట్ల: అర్వింద్‌, సురభి సునీల్‌, డాక్టర్‌ వెంకట్‌; జగిత్యాల: బోగ శ్రావణి; ధర్మపురి: లక్ష్మణ్‌, కన్నం అంజయ్య; మంథని: సునీల్‌రెడ్డి; పెద్దపల్లి : ప్రదీ్‌పకుమార్‌, సురేశ్‌రెడ్డి, గుజ్జుల రామకృష్ణారెడ్డి, నల్ల మనోహర్‌రెడ్డి; కరీంనగర్‌: బండి సంజయ్‌; చొప్పదండి: బొడిగె శోభ; హుజూరాబాద్‌: ఈటల రాజేందర్‌; వేములవాడ : సీహెచ్‌ వికాస్‌, తుల ఉమ; జహీరాబాద్‌: రామచంద్ర; సంగారెడ్డి : రాజు, దేశ్‌పాండే; పటాన్‌చెరు: ఎడ్ల రమేశ్‌, నందీశ్వర్‌గౌడ్‌, గడీల శ్రీకాంత్‌గౌడ్‌; నారాయణఖేడ్‌ : సంగప్ప, విజయ్‌పాల్‌రెడ్డి; ఆందోల్‌ : బాబూ మోహన్‌; నర్సాపూర్‌ : గోపి, మురళీయాదవ్‌; దుబ్బాక: ఎం. రఘునందన్‌రావు; హుస్నాబాద్‌: బొమ్మ శ్రీరాం, సురేందర్‌రెడ్డి; కల్వకుర్తి : టి. ఆచారి; షాద్‌నగర్‌ : మిథున్‌రెడ్డి, అందె బాబయ్య, విష్ణువర్ధన్‌రెడ్డి; జడ్చర్ల: చిత్తరంజన్‌దా్‌స; మహబూబ్‌నగర్‌: ఏపీ జితేందర్‌రెడ్డి; గద్వాల: డీకేఅరుణ; మక్తల్‌: జలంధర్‌రెడ్డి; దేవరకద్ర: ఎగ్గని నర్సింలు, సుదర్శన్‌రెడ్డి, పవన్‌ కుమార్‌; కొల్లాపూర్‌: సుధాకర్‌రావు; అచ్చంపేట: సతీష్ మాదిగ; ఇబ్రహీంపట్నం: బూర నర్సయ్యగౌడ్‌, దయానంద్‌గౌడ్‌; ఎల్బీనగర్‌: జి.మనోహర్‌రెడ్డి, సామ రంగారెడ్డి, వంగా మధుసూదన్‌రెడ్డి, కొప్పుల నర్సింహారెడ్డి; మహేశ్వరం: అందెల శ్రీరాములు యాదవ్‌, బొక్కా నర్సింహారెడ్డి; రాజేంద్రనగర్‌: తోకల శ్రీనివాసరెడ్డి, బుక్కా వేణుగోపాల్‌, వై. శ్రీధర్‌, మల్లారెడ్డి; శేరిలింగంపల్లి: రవికుమార్‌, యోగానంద్‌; చేవెళ్ల: కంచర్ల ప్రకాశ్‌, విజయ్‌కుమార్‌; పరిగి:మారుతి కిరణ్‌, పరమేశ్వర్‌రెడ్డి; మేడ్చ ల్‌: మోహన్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి; మల్కాజ్‌గిరి: ఎన్‌.రాంచందర్‌రావు, శ్రావణ్‌కుమార్‌; కుత్బుల్లాపూర్‌: కూన శ్రీశైలం గౌడ్‌; కూకట్‌పల్లి: మాధవరం కాంతారావు, ఎం. ప్రేమ్‌కుమార్‌, వడ్డేపల్లి రాజేశ్వర్‌; ఉప్పల్‌: ఎన్‌.వి.ఎస్. ఎస్. ప్రభాకర్‌; ముషీరాబాద్‌: డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ లేదా బండారు విజయలక్ష్మి; మలక్‌పేట : సురేందర్‌రెడ్డి, లింగాల హరిగౌడ్‌, సుభాష్ చందర్‌జీ , రవీందర్‌రెడ్డి, చీకోటి ప్రవీణ్‌; అంబర్‌పేట: జి. కిషన్‌రెడ్డి, గౌతంరావు; ఖైరతాబాద్‌: ఎన్‌.వి.సుభా్‌ష, చింతల రాంచంద్రారెడ్డి. గౌతంరావు; జూబ్లీహిల్స్‌ : లంకల దీపక్‌రెడ్డి, డాక్టర్‌ వీరపనేని పద్మ; సనత్‌నగర్‌ :మర్రి శశిధర్‌రెడ్డి. శ్యాంసుందర్‌; సికింద్రాబాద్‌: బండ కార్తీకరెడ్డి, జయసుధ, ఆదం విజయ్‌కుమార్‌; కంటోన్మెంట్‌ (ఎస్సీ): డాక్టర్‌ విజయరామారావు, నారాయణరావు; నల్లగొండ: మాదగాని శ్రీనివా్‌సగౌడ్‌, నాగం వర్షిత్‌రెడ్డి, కన్మంతరెడ్డి శ్రీదేవి; మునుగోడు : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి; నకిరేకల్‌ : చేపూరి రవీందర్‌; దేవరకొండ: లాలూనాయక్‌, కల్యాణ్‌ నాయక్‌; నాగార్జునసాగర్‌ : కంకనాల నివేదిత, రిక్కల ఇంద్రసేనారెడ్డి, ముసిరెడ్డి పాండురంగారెడ్డి; మిర్యాలగూడ : సాధినేని శ్రీనివాస్‌; కోదాడ: రామూ యాదవ్‌, పనగాల నారాయణ, నూకలపద్మారెడ్డి, వేలంగి రాజు; సూర్యాపేట: సంకినేని వెంకటేశ్వరరావు; తుంగతుర్తి: కడియం రాంచంద్రయ్య; ఆలేరు: పడాల శ్రీనివాస్‌, వట్టిపల్లి శ్రీను; భువనగిరి: గూడూరు నారాయణరెడ్డి, పీవీ శ్యాంసుందర్‌; జనగాం: దశమంత్‌రెడ్డి; ఘన్‌పూర్‌: విజయరామారావు లేదా వెంకటేశ్వర్లు;డోర్నకల్‌: సంగీతనాయక్‌. లక్ష్మణ్‌నాయక్‌; మహబూబాబాద్‌: హుస్సేన్‌నాయక్‌, సీత య్య; నర్సంపేట: రేవూరి ప్రకాశ్‌రెడ్డి; పరకాల: డాక్టర్‌ కాళీ ప్రసాద్‌, విజయచందర్‌, డాక్టర్‌ సంతోష్‌; వరంగల్‌ వెస్ట్‌: రావు పద్మ, రాకేశ్‌రెడ్డి, ధర్మారావు; వరంగల్‌ ఈస్ట్‌: ఎర్రబెల్లి ప్రదీ్‌పరావు; వర్ధన్నపేట: కె.శ్రీధర్‌, చీటూరు అశోక్‌; ములుగు: కృష్ణవేణి, ప్రహ్లాద్‌, రాజు; భూపాలపల్లి: చందుపట్ల కీర్తిరెడ్డి; కొత్తగూడెం: రంగాకిరణ్‌; భద్రాచలం: కుంజా సత్యవతి;ఖమ్మం:గల్లా సత్యనారాయణ, శారద; పాలేరు: శ్రీధర్‌రెడ్డి; సత్తుపల్లి : రామలింగేశ్వర్‌రావు పేర్లు ఖరారు అయినట్టు తెలుస్తోంది. మిగతా నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను దాదాపు ఎంపిక చేసినట్టు విశ్వసనేయ వర్గాల సమాచారం.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular