రాజకీయ పార్టీపై సంచలన ప్రకటన చేసిన తీన్మార్ మల్లన్న

ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, సామాజిక అంశాలపై ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడిగే తీన్మార్ మల్లన్న రాజకీయ అడుగులు సంచలనమవుతున్నాయి. తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. టీవీల్లో తీన్మార్ మల్లన్నగా తెలంగాణ గృహాల్లో ప్రసిద్ది చెందాడు. సామాజిక.. రాజకీయ సమస్యలపై అతని తరచుగా వ్యంగ్యంగా ధైర్యంగా వ్యాఖ్యానాలు చేస్తుంటాడు. తీన్మార్ మల్లన్న ఇటీవల గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకంగా వరంగల్ స్తానం నుంచి అధికార టీఆర్ఎస్ కే ముచ్చెమటలు పట్టించారు. ఒకటిన్నర సంవత్సరాల క్రితం జరిగిన […]

Written By: NARESH, Updated On : July 18, 2021 8:47 pm
Follow us on

ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, సామాజిక అంశాలపై ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడిగే తీన్మార్ మల్లన్న రాజకీయ అడుగులు సంచలనమవుతున్నాయి. తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. టీవీల్లో తీన్మార్ మల్లన్నగా తెలంగాణ గృహాల్లో ప్రసిద్ది చెందాడు. సామాజిక.. రాజకీయ సమస్యలపై అతని తరచుగా వ్యంగ్యంగా ధైర్యంగా వ్యాఖ్యానాలు చేస్తుంటాడు.

తీన్మార్ మల్లన్న ఇటీవల గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకంగా వరంగల్ స్తానం నుంచి అధికార టీఆర్ఎస్ కే ముచ్చెమటలు పట్టించారు. ఒకటిన్నర సంవత్సరాల క్రితం జరిగిన హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో పోటీ చేసినప్పుడు అతనికి కేవలం 894 ఓట్లు వచ్చాయి. ఇది నోటాకు వచ్చిన ఓట్ల కన్నా తక్కువ. కానీ ఖమ్మం-నల్గొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం నుంచి తాజాగా ఎమ్మెల్సీగా పోటీచేసిన మల్లన్న పాలక తెలంగాణ రాష్ట్ర సమితిని ఢీకొంటున్నాడు. అంత డబ్బు పరపతి ఉన్న పార్టీకి ముచ్చెమటలు పట్టించాడు.

ఇప్పుడు మల్లన్న తన సొంత జిల్లా నల్గొండ పరిధిలో జరుగనున్న నాగార్జున సాగర్ లో బీజేపీ తరుఫున పోటీచేస్తాడని ప్రచారం బాగా జరిగింది. సాగర్ ఉప ఎన్నికల్లో పోటీపై తీన్మార్ మల్లన్న స్పష్టతనిచ్చారు. ఈ ఎన్నికల్లో తాను పోటీచేయడం లేదని మల్లన్న తెలిపారు.

తాజాగా మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం కాచవాని సింగారంలో నిర్వమించిన సభలో భవిష్యత్ కార్యాచరణను మల్లన్న ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా త్వరలో 6వేల కి.మీల పాదయాత్ర చేపడుతున్నట్టు తెలిపాడు. తీన్మార్ మల్లన్న టీం పేరిట రాష్ట్ర, జిల్లా నియోజకవర్గ మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఇక తాను రాజకీయ పార్టీ పెట్టడం లేదని మల్లన్న స్పష్టం చేశారు. ఈ సభకు భారీగా తీన్మార్ మల్లన్న అనుచరులు హాజరయ్యారు. దీంతో మల్లన్న అడుగులు రాజకీయంగా ఎటుపడుతాయన్నది వేచిచూడాలి.