Nadendla Manohar: పచ్చ పార్టీ టీడీపీ కొత్త కుట్రకు తెర తీసింది. జనసేన ముఖ్య నేతకు గాలం వేస్తోంది. తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు టీడీపీ సీనియర్ నేత ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పొత్తులు ఖాయమని భావిస్తున్నల వేళ టీడీపీ కొత్త వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో టీడీపీ – జనసేన పొత్తు ఖాయమని చెబుతున్నారు. ఇదే సమయంలో జనసేనలో చేరాల్సిన నేతలు టీడీపీలో ఎంట్రీ ఇస్తున్నారు.
జన సైనికులకు గాలం..
ఇదిలా ఉంటే.. ఇటు జనసేనలోని ముఖ్య నేతకు టీడీపీ సీనియర్ల నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. దీని పైన ఇప్పుడు చంద్రబాబు నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.
పొత్తు వేళ కీలక పరిణామం..
తెలుగు దేశం – జనసేన పొత్తు ఖాయమని అందరూ భావిస్తున్నారు. కానీ, పాత్తుపైన రెండు పార్టీల నుంచి అధికారక స్పందన లేదు. ఇదే సమయంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయమని పిలుపునిచ్చిన జనసేన ఎవరికి వేయాలనేది మాత్రం ఓపెన్ గా చెప్పలేదు. బీజేపీ నుంచి బరిలో నిలిచిన అభ్యర్ధులు తాము బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా ప్రచారం చేసుకుంటున్నాయి. జనసేన మాత్రం బీజేపీ అభ్యర్ధికి మద్దతివ్వాలని ఎక్కడా చెప్పటం లేదు. కొద్ది రోజులుగా పవన్ తీరులోనూ మార్పు కనిపిస్తోంది. గతంలో పవన్ కు మద్దతుగా టీడీపీ.. చంద్రబాబుకు మద్దతుగా పవన్ ప్రకటనలు ఇచ్చారు. కానీ, గన్నవరం టీడీపీ కార్యాయలం పై దాడి జరిగితే జనసేన ఎక్కడా ఖండించలేదు. కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరటం ఖాయం అనుకున్న వేళ ఆయన టీడీపీ లో చేరారు. మరో వైపు టీడీపీ నాయకత్వం ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోసం వామపక్ష పార్టీలతో చర్చలు చేస్తోంది.
నాదెండ్లకు ఆఫర్..!
ఇదే సమయంలో అనూహ్య పరిణామం తెర మీదకు వచ్చింది. జనసేనలో దాదాపు నంబర్ టూ స్థానంలో ఉన్న నాదెండ్ల మనోహర్ ను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు టీడీపీ సీనియర్ నేత ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. నాదెండ్ల వచ్చే ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నారు. గతంలో ఆయన జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి టీడీపీ నుంచి ఆ సీటులో పోటీ చేస్తే విజయం ఖాయమని జిల్లాకు చెందిన సీనియర్ నేత ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. టీడీపీతో పొత్తు దిశగా జనసేనలో ఆ నేత తన వంతు ప్రయత్నం చేశారనే ప్రచారం ఉంది. పార్టీలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు.
జనసేనతో పొత్తు ఉన్నా లేకున్నా గెలుస్తామనే ధీమా కొంత కాలంగా టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ సీట్ల విషయంలో ఒత్తిడి పెంచకుండా.. బీజేపీ వైపు చూడకుండా తమతో కలిసి వచ్చేలా ఒత్తిడి పెంచే వ్యూహం టీడీపీ నుంచి మొదలైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.