Trump tariffs blow to Indian IT: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ కొనసాగుతోంది. ఒకవైపు వైఖరిలో మార్పు కనిపిస్తున్నా.. ఇంకోవైపు భారత్‌ను దెబ్బతీసే వ్యూహాలకు పదును పెడుతున్నారు. టారిఫ్‌ల పేరుతో మొదట వస్తువులపై దృష్టి సారించిన ట్రంప్.. ఇప్పుడు రిమోట్ వర్కర్లు, అవుట్‌సోర్సింగ్ సేవలకు టారిఫ్‌లు విస్తరించాలని అతని సలహాదారు పీటర్ నావర్రో ప్రతిపాదిస్తున్నారు. సెప్టెంబర్ 1న ఎక్స్ (ట్విట్టర్) ప్లాట్‌ఫామ్‌లో రైట్–వింగ్ యాక్టివిస్ట్ జాక్ పోసోబియెక్ చేసిన పోస్ట్‌ను నావర్రో రీపోస్ట్ చేయడం ద్వారా ఈ చర్చకు కొత్త ఊపు లభించింది. పోసోబియెక్ ప్రకారం, ‘విదేశీ దేశాలు అమెరికాకు రిమోట్‌గా సేవలు అందించేలా చేయడానికి టారిఫ్ చెల్లించాలి, వస్తువుల మీద చేసినట్లే. ఇది అన్ని ఇండస్ట్రీల్లో అమలు చేయాలి, దేశాల వారీగా స్థాయి సర్దాలి. అని పేర్కొన్నారు. ఈ సూచన అమెరికా ఐటీ మార్కెట్‌లో భారతదేశం వంటి దేశాలపై ప్రభావం చూపనుంది, ఎందుకంటే అమెరికా ఐటీ అవుట్‌సోర్సింగ్‌లో ప్రధాన కస్టమర్, ఇక్కడ భారతీయ సంస్థలు భారీ ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి.
అమెరికన్ టెక్ వర్కర్లలో ఆనందం..
ఈ టారిఫ్ ఆలోచన అమెరికన్ టెక్ కార్మికుల్లో భారీ ఆనందాన్ని కలిగించింది. రెడ్డిట్‌లోని r/AmericanTechWorkers సబ్‌రెడ్డిట్‌లో ఈ వార్తను పంచుకున్న యూజర్లు, ‘ఇది నిజమైతే మాకు భారీ సహాయం‘ అని, ‘ఆఫ్‌షోరింగ్ హెచ్–1బీ వీసాల కంటే పెద్ద ముప్పు‘ అని వ్యాఖ్యానించారు. ఒక నెటిజన్ అమెరికా డేటాను ప్రస్తావించి, ‘చాలా కాలం తర్వాత మొదటిసారి ఉద్యోగాల సంఖ్య కంటే బేరోజు అమెరికన్లు ఎక్కువ. అమెరికన్లను ప్రాధాన్యత ఇవ్వాలి, అవుట్‌సోర్సింగ్‌పై టారిఫ్ విధించాలి‘ అని పిలుపునిచ్చాడు. ఈ డిమాండ్లు అమెరికా లేబర్‌ను బలోపేతం చేయడానికి ఇన్సెంటివ్‌లు కూడా కోరుతున్నాయి. ట్రంప్ ‘అమెరికా ఫస్ట్‘ విధానం ఈ సెంటిమెంట్‌ను మరింత బలపరుస్తోంది, దీంతో అవుట్‌సోర్సింగ్‌ను ఆపి, లోకల్ ఉద్యోగాలు పెంచుకోవాలనే ఆలోచన ప్రబలమవుతోంది. అయితే సేవలపై టారిఫ్ విధించడం అంటే వస్తువుల మీద చేసినట్లు సులభం కాదు. అంతర్జాతీయ వాణిజ్య మండలి (ఐసీసీ) ప్రకారం, ‘సేవలు ఒక దేశంలోకి ’ప్రవేశించే’ స్పష్టమైన సమయం లేదు, వస్తువులకు హార్మోనైజ్డ్ సిస్టమ్ వంటి గ్లోబల్ క్లాసిఫికేషన్ లేదు, ఏమి పన్ను విధించాలో నిర్ణయించే స్థిరమైన పద్ధతి లేదు.‘ ఇది చట్టపరమైన, ఆపరేషనల్, ఆర్థిక ప్రమాదాలకు దారితీస్తుందని ఐసీసీ హెచ్చరిస్తోంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీవో)లో చట్టపరమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమెరికా ప్రస్తుతం సేవలపై పన్ను విధించడం లేదు, కానీ టారిఫ్ అమలైతే అమెరికన్ కంపెనీలకు కాస్ట్ పెరిగి, ప్రాజెక్టులు ఆలస్యమవుతాయి. భారతదేశం వంటి దేశాలు ప్రతీకారంగా అమెరికన్ టెక్ ఎగుమతులపై డిజిటల్ సర్వీస్ టాక్స్‌లు విధించవచ్చు, ఇది రిలేషన్‌లను మరింత దెబ్బతీస్తుంది.
భారత ఐటీ రంగంపై ప్రభావం..
భారతదేశం ఐటీ అవుట్‌సోర్సింగ్‌లో ప్రపంచ లీడర్, 250 బిలియన్ డార్లకుపైగా ఆదాయం సంపాదిస్తోంది, ఇందులో అమెరికా మార్కెట్ ప్రధానం. టీసీఎస్, ఇన్‌ఫోసిస్, విప్రో వంటి సంస్థలు అమెరికన్ కంపెనీలకు సాఫ్ట్‌వేర్, క్లౌడ్, బీపీవో సేవలు అందిస్తున్నాయి. టారిఫ్ అమలైతే ఈ సేవల కాస్ట్ పెరిగి, కాంట్రాక్టులు తగ్గవచ్చు, లేదా కంపెనీలు ఆన్‌షోర్ (అమెరికాలోనే) ఉద్యోగాలు పెంచుకోవచ్చు. ఇది భారతదేశంలో మిలియన్ల ఐటీ ఉద్యోగాలకు ముప్పు, హెచ్–1బీ వీసా ప్రోగ్రామ్‌పై ఇప్పటికే ఒత్తిడి ఉన్న సమయంలో మరింత ఇబ్బంది కలిగిస్తుంది. భారత్–అమెరికా ట్రేడ్ డీల్ చర్చలు జరుగుతున్నప్పటికీ, ఈ టారిఫ్ ఆలోచన రిలేషన్‌లను దెబ్బతీస్తుంది. నావర్రో ముందు భారతదేశంపై ’బ్రాహ్మణులు లాభపడుతున్నారు’ వంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటికీ, ఈ టారిఫ్ సూచన ఆర్థికంగా మరింత హానికరం.
అవుట్‌సోర్సింగ్‌పై టారిఫ్ ఆలోచన అమెరికన్ టెక్ వర్కర్లకు ఆశాకిరణం అయినప్పటికీ, భారత ఐటీ రంగానికి తీవ్ర సవాల్. అమెరికా ఉద్యోగాలను రక్షించాలనే ఉద్దేశం మంచిదే అయినా, గ్లోబల్ ఎకానమీలో అసమతుల్యత తీసుకువస్తుంది. డబ్ల్యూటీవో వంటి సంస్థలు జోక్యం చేసుకుంటే ఈ విధానం అమలు కష్టమవుతుంది. గ్లోబల్ సహకారాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. భారతదేశం మార్కెట్ వైవిధ్యీకరణ, కొత్త ట్రేడ్ డీల్స్ ద్వారా స్పందించాలి.