టార్గెట్ 2024: కేబినేట్ మార్పులు అందుకే..?

కేంద్ర కేబినెట్లో ఇటీవల భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. 12 మంది మంత్రులకు ఉద్వాసన పలుకగా.. 43 మందితో కేబినేట్లో చాలా మార్పులు చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ మార్పులు చేశారన్న చర్చ సాగుతోంది. అయితే కొత్తగా కేబీనేట్లోకి తీసుకున్నవారిలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్, పంజాబ్ నుంచే ఉన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి 14 మందిని మంత్రులను చేశారు. త్వరలో ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్రానికి ప్రాధాన్యం ఇచ్చారా..? అన్న […]

Written By: NARESH, Updated On : July 9, 2021 3:54 pm
Follow us on

కేంద్ర కేబినెట్లో ఇటీవల భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. 12 మంది మంత్రులకు ఉద్వాసన పలుకగా.. 43 మందితో కేబినేట్లో చాలా మార్పులు చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ మార్పులు చేశారన్న చర్చ సాగుతోంది. అయితే కొత్తగా కేబీనేట్లోకి తీసుకున్నవారిలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్, పంజాబ్ నుంచే ఉన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి 14 మందిని మంత్రులను చేశారు. త్వరలో ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్రానికి ప్రాధాన్యం ఇచ్చారా..? అన్న కోణంలో చర్చ సాగుతోంది.

ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉంది. యోగి ఆదిత్యానాథ్ సీఎంగా కొనసాగుతున్నారు. కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ఠాకూర్ల జోక్యం ఎక్కవగా ఉందని, అదీ కాగా సొంత పార్టీ నేతలే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే ఇక్కడ కులసమీకరణాలను సమానం చేసేందుకు కేంద్రం ఈ రాష్ట్రం నుంచి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారని అంటున్నారు.

యూపీ నుంచి కేంద్ర కేబినేట్లోకి వెళ్లిన వారిలో ఒకరు బ్రహ్మణ నాయకుడు ఉండగా.. మిగతా వారంతా బీసీ, దళిత సామాజికవర్గానికి చెందినవారే. అయితే ఈ కుల సమీకరణాలు రాబోయే ఎన్నికల్లో ప్రభావితం చూపుతాయా..? అని అనుకుంటున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడంలో విఫలమయ్యారని, మోదీ సొంత నియోజకవర్గంలోనే అసంతృప్తి మొదలైందని చర్చించుకుంటున్నారు.

ఇక కొత్తగా మంత్రులైనవారు చాలా మంది కొత్తవారే. అయితే వారు తమ నియోజకవర్గాల్లో పట్టు సాధించినవారు. అంతేకాకుండా విద్యావంతులు. ఇలా వీరిని ఏరికోరి మరి మోదీ ఎంపిక చేశారని అంటున్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి మార్పులు బీజేపీకి బాగా ఉపయోగపడుతాయని యూపీకి చెందిన ఓ జర్నలిస్టు పేర్కొన్నాడు. మొత్తంగా మోదీ 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ మార్పులు చేశారని అంటున్నారు.