Jagan Bail Cancellation: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఎస్ జగన్ పై ఇంకా యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. గతంలో తాను దాఖలు చేసిన జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేస్తుందని ముందే తెలుసని వ్యాఖ్యానించారు. ఒకవేళ దాన్ని తిరస్కరిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. జగన్ అక్రమ ఆస్తుల కేసులో సీబీఐ న్యాయస్థానం జగన్ కు బెయిల్ మంజూరు చేసంది. దాన్ని రద్దు చేయాలంటూ రఘురామ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దీనిపై వాదోపవాదాలు విన్న కోర్టు రఘురామ వాదనలతో ఏకీభవించలేదు. ఫలితంగా మరోమారు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

Also Read: సోము వీర్రాజు అంటించిన మాటల మంటలు.. జనసేన, కేటీఆర్ కు బాగా కాలింది
తెలంగాణ హైకోర్టు కూడా రఘురామ విషయంలో వ్యతిరేక తీర్పునే ఇచ్చింది. కేసుతో సంబంధం లేదని వ్యక్తులు ఎలా పిటిషన్ వేస్తారని ప్రశ్నించింది. ఈ కేసులో జగన్ సాక్షులను ఏమైనా ప్రలోభాలాకు గురిచేశారా? లేక ప్రభావితం చేశారా? అని వాదించింది. దీంతో రఘురామ పిటిషన్ ఇక్కడ నిలబడలేదు. ఈ నేపథ్యంలో రఘురామ మరోమారు ఢిల్లీలోని సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
దీనిపై మీడియాలో కూడా కథనాలు వెలువడ్డాయి. తెలంగాణ హైకోర్టు చీవాట్లు పెట్టినట్లు వార్తలు రావడంతో మీడియాకు ముందే ఎలా తెలిసిందని రఘురామ ఆశ్చర్యపోయారు. హైకోర్టు అడిగిన ప్రశ్నలకు రఘురామ వివరణ ఇచ్చారు. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ను కొట్టివేయడంపై రఘురామ సీరియస్ గా తీసుకోలేదు. ఇంకా సుప్రీంకోర్టు ఉంది కదా అని చెబుతున్నారు.