
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ కి ఆర్థిక వనరుల సమీకరణ సలహాదారుగా సుభాష్ చంద్ర గార్గ్ ను నియమించుకుంది. 1983 రాజస్థాన్ కేడర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుభాష్ చంద్ర గార్గ్ ను ఈ మేరకు సీఎం జగన్ సలహాదారుడి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చింది. నిధుల సమీకరణ వ్యవహారాల కోసం ఆయనను నియమించింది. సుభాష్ చంద్ర గార్గ్ కు కేబినెట్ హోదా కల్పిస్తూ రెండేళ్ల పాటు కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా సేవలందించడంతో పాటు ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గానూ గార్గ్ వ్యవహరించారు. ఆర్బీఐ సెంట్రల్ బోర్డు, సెబీ లో ఒక సభ్యునిగా కొనసాగారు. దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ ఎల్‌ఐసీలోనూ ఈయన సేవలు అందించారు.