Homeజాతీయ వార్తలువైరస్ ప్రభావం తక్కువ ఉండే బ్లడ్ గ్రూప్ ఇదేనట..!

వైరస్ ప్రభావం తక్కువ ఉండే బ్లడ్ గ్రూప్ ఇదేనట..!


చైనాలో సోకిన కరోనా మహమ్మరి ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబెలేత్తిస్తోంది. ఈ మయదారి రోగం దేశంలోకి ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ 5.0 జూన్ 30వరకు కొనసాగనుంది. లాక్డౌన్ అమల్లోకి ఉన్నప్పటికీ దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా మహమ్మరి ఒక్క భారత్లోనే కాకుండా ప్రపంచమంతటా తన ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పట్లో కరోనా కట్టడి సాధ్యమేనా అనే ప్రశ్న అందరికి తలెత్తుతోంది.

కరోనాకు వ్యాక్సిన్ కనుగోనేందుకు సైంటిస్టులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే వైరస్ ఒక్కో దేశంలో ఒక్కోలా రూపాంతరం చెందుతుందటంతో వ్యాక్సిన్ కనుగోనడం కష్టతరంగా మారుతోంది. దీంతో ఎప్పటిలోగా కరోనా వ్యాక్సిన్ వస్తుందనే చెప్పడం ప్రశ్నార్థకంగా మారింది. అయితే కరోనా వైరస్ బారిన పడిన వారి నుంచి పెద్దఎత్తున శాంపిళ్లను సేకరించి 23అండ్ మీ అనే జెనెటిక్ టెస్టింగ్ సంస్థ అధ్యాయనం చేపట్టింది. వీరి అధ్యాయనంలో అందరిలో ఒకే లక్షణాలు కన్పించడం లేదని తేలింది. కరోనా వైరస్ ఉసరవెల్లిలా రంగులు మారుస్తూ రూపాంతరం చెందుతుందని ప్రకటించారు.

వీరి అధ్యాయనంలో మరో విషయం వెల్లడైంది. ప్రిలిమినరీ ఫలితాలను పరిశీలించినట్లయితే ‘ఓ’ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు వైరస్ బారిన తక్కువగా పడుతున్నారని తేలిందట. మిగతా గ్రూప్ బ్లడ్ శాంపిళ్లతో పోలిస్తే టైప్ ‘ఓ’ గ్రూప్ బ్లడ్ వ్యక్తులు 9 నుంచి 18శాతం వరకు మాత్రమే వైరస్ ప్రభావానికి గురవుతున్నట్లు తేలిందట. అదేవిధంగా టైప్ ‘ఏ’ గ్రూప్ బ్లడ్ కలిగినవారు ఎక్కువగా వైరస్ బారిన పడినట్లు వారి అధ్యయనంలో వెల్లడైందట. దాదాపు 8లక్షలమందిపై ఈ సంస్థ అధ్యాయనం చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతానికైతే ఈ సంస్థ స్పష్టమైన ఆధారాలను మాత్రం ప్రకటించలేదు. మరిన్ని అధ్యాయనాల అనంతరం త్వరలోనే వివరాలను ప్రకటించనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version