పాకిస్తాన్ లోని బెలూచీస్తాన్ ప్రజలు పోరాటం మొదలుపెట్టారు. తాజాగా బెలుచీస్తాన్ వాసులు, ఇతర మానవ హక్కుల కార్యకర్తలు మార్చి 15న జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయం వెలుపల నిరసనకు దిగారు. బలూచిస్తాన్‌లో పెరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు , మతపరమైన తీవ్రవాదం వ్యాప్తిపై నిరసనకారులు లేవనెత్తారు.
ఈ విషయంలో నిరసనకారులు బలూచిస్తాన్‌లో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. “బలూచ్ జీవితాలను కాపాడాలని.. “బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ మారణహోమం ఆపండి” బ్యానర్‌లను పట్టుకున్నారు.
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి కొనసాగుతున్న 52వ సెషన్‌లో ఈ ప్రదర్శన జరిగింది. వివిధ మానవ హక్కుల సంస్థల ప్రతినిధులు బలూచిస్తాన్‌లోని అధ్వాన్నమైన పరిస్థితులను ఎత్తిచూపారు. .బలూచ్ సామాజిక-రాజకీయ కార్యకర్తల బలవంతపు అదృశ్యాలు , చట్టవిరుద్ధమైన హత్యలకు పాక్ భద్రతా దళాలు చేస్తున్నారని వారంతా ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ మరియు యూఎన్ మానవ హక్కుల హై కమీషనర్‌కు రెండు వేర్వేరు పిటిషన్లను సమర్పించారు బెలూచిస్తాన్ వాసులు.. ఈ వివాదం ఇప్పుడు అంతర్జాతీయంగా సాగుతోంది..
వేలాది మంది బెలూచీల బలిదానంతో ఎరుపెక్కిన బెలూచీ నేలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.