కరోనా పరీక్షల పేరుతో వల పన్నుతున్న సైబర్ కేటుగాళ్లు

కరోనా వైరస్ సోకకుండా ప్రజలంతా ఇళ్లకే పరిమితమై ప్రాణాలను కాపాడుకుంటుంటే మరోవైపు సైబర్ నేరగాళ్లు దానినే క్యాష్ గా మార్చుకుంటున్నారు. కోవిడ్-19 ఫ్రీ టెస్టుల పేరిట మొయిల్ పంపుతూ హ్యకింగ్ కు పాల్పడుతున్నారు. ఇప్పటికే దేశంలోని 20లక్షల మందికి హానికర మొయిల్ వెళ్లినట్లు కేంద్రం గుర్తించి అప్రమత్తం చేస్తోంది. కోవిడ్ ఫ్రీ టెస్టుల పేరిట వస్తున్న నకిలీ మొయిల్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుది. ఈ మొయిల్స్ తెరిస్తే వ్యక్తిగత సమాచారం హ్యకింగ్ గురయ్యే ప్రమాదం […]

Written By: Neelambaram, Updated On : June 24, 2020 12:38 pm
Follow us on


కరోనా వైరస్ సోకకుండా ప్రజలంతా ఇళ్లకే పరిమితమై ప్రాణాలను కాపాడుకుంటుంటే మరోవైపు సైబర్ నేరగాళ్లు దానినే క్యాష్ గా మార్చుకుంటున్నారు. కోవిడ్-19 ఫ్రీ టెస్టుల పేరిట మొయిల్ పంపుతూ హ్యకింగ్ కు పాల్పడుతున్నారు. ఇప్పటికే దేశంలోని 20లక్షల మందికి హానికర మొయిల్ వెళ్లినట్లు కేంద్రం గుర్తించి అప్రమత్తం చేస్తోంది. కోవిడ్ ఫ్రీ టెస్టుల పేరిట వస్తున్న నకిలీ మొయిల్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుది. ఈ మొయిల్స్ తెరిస్తే వ్యక్తిగత సమాచారం హ్యకింగ్ గురయ్యే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరిస్తోంది.

చంద్రబాబు కోటరీ బీజేపీని దెబ్బతీస్తుందా?

దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలనే సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌, చెన్నై, అహ్మదాబాద్‌ వంటి నగరాల్లోని ప్రజలందరికీ ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తామంటూ పెద్దఎత్తున నకిలీ మెయిల్స్‌ వస్తున్నట్లు ద ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం(Cert-In) గుర్తించింది. ఈ సంస్థ కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ కింద సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించే ఓ నోడల్‌ ఏజెన్సీ.

ఇప్పటికే దేశంలోని దాదాపు 20లక్షల ఖాతాలకు ఈ హానికర మొయిల్స్ వెళ్లినట్లు సెర్ట్ ఇన్ గుర్తించింది. ఈ నకిలీ ఈ- మెయిల్స్‌ను ఓపెన్ చేస్తే అవి మనల్ని నకిలీ వెబ్‌సైట్ల వైపు తీసుకెళ్తాయని పేర్కొంది. ఆ తర్వాత హానికర ఫైల్స్‌ మన డివైజ్లోకి డౌన్‌లోడ్‌ అవుతాయని తెలిపింది. దీనిద్వారా వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు తస్కరించి మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించింది.

బీజేపీ దోస్తీ పవన్ కి బలమా… భారమా?

నకిలీ మొయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సెర్ట్ ఇన్ సూచించింది. కంప్యూటర్, మొబైల్స్ లో యాంటీవైరస్ టూల్స్ ఉపయోగిస్తే ఇలాంటి మోసాలను నుంచి బయటపడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మొయిల్స్ ఓపెన్ చేయకపోవడం మంచిదని సూచిస్తున్నారు. నకిలీ ఈమొయిల్స్ వస్తే https://www.cert-in.org.in/ సమాచారం పంపించాలని సూచిస్తున్నారు. కరోనా భయంతో ప్రజలు అల్లాడుతుంటే దానినే సైబర్ నేరగాళ్లు అనుకూలంగా మార్చుకొని హ్యాకింగ్ పాల్పతుడటంతో ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో కేంద్రం కరోనా ఫ్రీ టెస్టుల పేరిట వచ్చే మొయిల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేస్తుంది.