
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలపై అభిమానం ఉంటే రాష్ట్రానికి రావాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంట్లో కూర్చొని చంద్రబాబు దిక్కుమాలిన లేఖలు రాస్తున్నారని చెప్పారు. అమరావతిలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు లేఖలో పేర్కొన్నవి అన్ని అబద్ధాలేనని, లేఖలో ఉపయోగ పడే అంశాలు లేవన్నారు. బాబు ఆయన కుమారుడు హైదరాబాద్ లో కూర్చొని ప్రభుత్వం పై బురద జల్లుతున్నారని చెప్పారు. బాబు రైతుల గురించి మాట్లాడడితే ప్రజలు నవ్వుతారన్నారు. అవగాహన లేకుండా మాట్లాడం బాబుకు తగదన్నారు. హైదరాబాద్ లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్న బాబు ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరి కాదన్నారు.
బాబు ప్రజలను లాక్ డౌన్ పాటించమని చెపుతుంటే ఆయన కుమారుడు రోడ్లు మీద షికార్లు చేస్తున్నాడని చెప్పారు. కనీసం మొహానికి మాస్క్ కూడా లోకేష్ దరించలేదన్నారు. బాబు మౌత్ పీస్ కన్నా లక్ష్మీనారాయణ మారాడన్నారు.
ర్యాపిడ్ టెస్ట్ కిట్లును ప్రభుత్వం పారదర్శకంగా కొనుగోలు చేసిందని తెలిపారు. బాబు నాయకత్వం బిల్డప్ లకే పరిమితమని అన్నారు. పాత ఫొటోలతో ప్రజలను బాబు మభ్యపెడుతున్నారని తెలిపారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న ఫీజ్ రియంబర్స్ మెంట్ కు 4 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల ఉబిలోకి నెట్టారన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేకపోయిన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. కరోనా నివారణలో దేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ నిలిసిందన్నారు. వైస్సార్సీపీ నాయకులు అనేక సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. వైస్సార్సీపీ నేతలు వలనే కరోనా వచ్చిందని మాట్లాడడం చంద్రబాబు నీచ రాజకీయానికి నిదర్శనమని అన్నారు. దళితుడైన కనగ రాజ్ ను ఎన్నికల కమిషనర్ గా నియనిస్తే చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారని చెప్పారు. ఎస్.ఈ.సి కనగరాజ్ వలన గవర్నర్ కార్యాలయంలో కరోనా వచ్చిందని అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి వలన దేశంలో కరోనా వచ్చిందని విమర్శలు చేయగలరా అని ప్రశ్నించారు.