
ఒకప్పుడు ఆ రెండు పార్టీలు జాతీయ, స్థానిక రాజకీయాల్లో చక్రం తిప్పాయి. కానీ ప్రస్తుతం ఆ రెండు పార్టీలు దీనస్థితికి చేరుకున్నాయి. ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న ఆ రెండు పార్టీలు ఇప్పుడు దీనస్థితిలోకి చేరడానికి కారణం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాలు చేయకపోవడం ఒక కారణమైతే.. ఇక వారసత్వంపై మమకారం ఆ రెండు పార్టీలను దెబ్బతీశాయనే టాక్ విన్పిస్తున్నాయి. ఇంతకీ ఆ రెండు పార్టీలెంటో ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది.
Also Read: అసమ్మతి నేతలపై సోనియా వేటు వేస్తారా?
కేంద్రంలో ఏళ్లతరబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నాయకత్వంలో యూపీఎ కూటమి రెండుసార్లు కేంద్రంలో అధికారం చేపట్టింది. పదేళ్లపాటు అధికారంలో ఉండటం.. పలు స్కాములో యూపీఏ ఇరుక్కోవడంతో ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. ఈ సమయంలో బీజేపీ పుంజుకోవడంతో మోదీ నాయకత్వంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. ప్రధాని మోదీ అయ్యాక పలు సంచలన నిర్ణయాలతో రెండోసారి అధికారం చేపట్టిన సంగతి తెల్సిందే.
దశాబ్దకాలంగా కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉండటంతో నేతలు ఇతర పార్టీలోకి జంప్ అవుతుండటంతో కాంగ్రెస్ క్రమంగా బలహీనం అవుతోంది. మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వయస్సు పైబడటం.. అనారోగ్య కారణాలతో ఇంతకుముందులా యాక్టివ్ పాలిటిక్స్ చేయడం లేదు. ఇక ఆమె తనయుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవీ చేపట్టేందుకు నిరాకరిస్తున్నారు. అదే అదనుగా పార్టీలోని సీనియర్లు రాహుల్ గాంధీకి పదవీ దక్కకుండా పావులు కుదుపుతున్నారు. దీనిని ముందుగానే గ్రహించిన సోనియాగా ప్రస్తుతానికి కాంగ్రెస్ అధ్యక్ష పదవీని తన దగ్గరే పెట్టుకున్నారు. అయితే ఇలా ఎంతకాలం నెట్టుకొస్తారనేది ప్రశ్నార్థకంగా మారుతోంది.
Also Read: సొంత గూటికే డీకే అరుణ?
మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నూతన ఏపీలోనూ ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ కూడా అలాగే మారింది. కిందటి ఎన్నికల్లో ఏపీలో వైసీపీ సృష్టించిన ప్రభంజనానికి టీడీపీకి ఇంకా కోలుకోవడం లేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి టీడీపీ పార్టీని టార్గెట్ చేయడంతో ఆ పార్టీ నేతలంతా ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడికి కూడా వయస్సు పైబడటంతో మునుపటిలా యాక్టివ్ పాలిటిక్స్ చేయడం లేదు. ఆయన తనయుడికి రాజకీయంగా నెట్టుకొచ్చే నాయకత్వం లేదనే టాక్ విన్పిస్తుంది.
టీడీపీ ఎంతోమంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ ఒక్క ఓటమితోనే టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంది. లోకేష్ నాయతక్వంపై టీడీపీ నేతలకు పెద్దగా నమ్మకం లేకపోవడంతో ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడే పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. తనయుడిలో చేతిలో టీడీపీ భవిష్యత్ పెట్టేందుకు చంద్రబాబు నాయుడు చూస్తుంటడటంతో ఆ పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. దీంతో సోనియాగాంధీ, చంద్రబాబుల పరిస్థితి ఒకేలా మారిందనే కామెంట్లు విన్పిస్తున్నాయి. వీరిద్దరికి కూడా వారి పుత్రరత్నాలే మైనస్ అనే టాక్ విన్పిస్తుంది. ‘పండితపుత్ర.. పరమ సుంఠ’ అనే నానుడిని ఇందుకు పలువురు ఉదహరించడం కొసమెరుపు.