AP Cabinet : ఏపీ కేబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ మంత్రులు ఈ నిర్ణయాల్లో భాగస్వాములయ్యారు. జులై నెలలో చేపట్టనున్న పలు సంక్షేమ, ఇతర కార్యక్రమాలకు కేబినెట్ ఆమోదం తెలిపారు. ఆ నిర్ణయాలు ఏంటో తెలుసుకుందాం..
-ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవీ
1. a) ఈ నెల 18వ తేదీన జగనన్న తోడు.
నాలుగో ఏడాది మొదటి విడత కార్యక్రమం.
5.1లక్షల మందికి రూ.510 కోట్లు రుణాలు ఇప్పిస్తూ.. వడ్డీ మాఫీ కింద 4.58లక్షలమందికి రూ.10.03 కోట్లు చెల్లింపు.
b)ఈ నెల 21న నేతన్న నేస్తం కింద లబ్ధిదారులకు నిధులు జమ.
వరుసగా ఐదో ఏడాది నేతన్ననేస్తం పథకం అమలు.
80,686 మందికి దాదాపు రూ.300 కోట్ల లబ్ది.
c) ఈ నెల 24న సీఆర్డీయే ప్రాంతంలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం.
ఏపీ సీఆర్డీయే పరిధిలో పేదలందరికీ ఇళ్ల నిర్మాణం ఊపందుకోనుంది.
మొత్తంగా 50,793 మందికి పట్టాలు 1366.48 ఎకరాల్లో ఇచ్చారు.
వీరికి సంబంధించి 47,017 ఇళ్లు మంజూరు అయ్యాయి.
ఈ నెల 24 నుంచి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయి.
ఇళ్ల నిర్మాణం జరుపుకుంటున్న లే అవుట్లలో మౌలిక సదుపాయాల కోసం రూ.384.52 కోట్లు కేటాయింపు
దీనికి కేబినెట్‌ఆమోద ముద్ర వేసింది.
d)ఈ నెల 26న సున్నావడ్డీ కింద డ్వాక్రా మహిళలకు డబ్బు జమ చేయనున్న ప్రభుత్వం.
వరుసగా నాలుగో ఏడాది అమలు.
మహిళలకు వైయస్‌ఆర్ సున్నావడ్డీ కింద ఈ నాలుగేళ్లలో ఈ ప్రభుత్వం సుమారు రూ5వేల కోట్లు ఇచ్చింది.
ఈ ఏడాది ఈ పథకం కింద రూ.1353.76 కోట్లు ఇస్తోంది.
9.48 లక్షల గ్రూపుల్లోని మహిళలకు అత్యంత ప్రయోజనం ఈపథకం వల్ల లభిస్తుంది.
d) ఈ నెల 28న విదేశీ విద్యాదీవెన కింద.. అర్హులైన లబ్ధిదారులకు డబ్బు జమచేయనున్న ప్రభుత్వం.
దాదాపు రూ.50 కోట్ల లబ్ది.
2. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలకు భూ పంపిణీకి జగన్ సర్కార్ సిద్ధం.
డాక్టర్ వైయస్సార్ తర్వాత మళ్లీ భూ పంపిణీ చేయనున్న వైయస్.జగన్ సర్కార్
రాష్ట్రవ్యాప్తంగా 54,129.45 ఎకరాలను పేద రైతులకు అసైన్ చేయనున్న ప్రభుత్వం.
భూమిలేని నిరుపేదలకు ఈ భూములు ఇవ్వనున్న ప్రభుత్వం.
మొత్తంగా 46,935 మంది లబ్ధిదారులకు భూములు ఇవ్వనున్న ప్రభుత్వం.
3. అలాగే 3 కేటగిరీల్లో 9,062 ఎకరాల లంక భూములు విషయంలో రైతులకు అనుకూలంగా అసైన్‌మెంట్ పట్టాలు, 5 ఏళ్ల లీజు ఇవ్వడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
తద్వారా 19,176 మంది రైతులకు మేలు జరుగుతోంది.
పైరెండు నిర్ణయాల కారణంగా మొత్తంగా 63,191.84 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్స్ నిరుపేదలకు ఇవ్వనున్న సర్కారు
మొత్తంగా 66,111 మందికి పూర్తి హక్కులు లభించనున్నాయి.
4. దళితులకు కేబినెట్ వరం
రాష్ట్ర విభజనకు ముందు ల్యాండ్ పర్చేజ్ స్కీం కింద గతంలో 16,213 ఎకరాలు పొందిన దళితులకు సానుకూలంగా నిర్ణయం
14,223 మందికి గతంలో భూములు, వారు కట్టాల్సిన రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా కూడా మాఫీ
దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన భూములపై వారికి పూర్తి హక్కులు.
ఆగస్టు మొదటి వారంలో దళితులకు హక్కు పత్రాలు పంపిణీకి ఏర్పాట్లు చేయనున్న ప్రభుత్వం.
5. అసైన్డ్ చేసిన డీకేటీ రైతులకు కేబినెట్ తీపికబురు
అసైన్‌మెంట్ అయిన 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు అనుభవించేలా తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్. Æ
ఇతర రైతుల మాదిరిగానే వారికి క్రయ, విక్రయాలపైన పూర్తి హక్కులు.
ఒరిజనల్ అస్సైనీలకు వారి లీగల్ హీర్స్‌కు మాత్రమే ఇది వర్తింపు.
దాదాపు 22 లక్షలమంది బడుగు, బలహీనవర్గాల వారికి ప్రయోజనం.
6. గ్రామాల్లోని కుల వృత్తులు చేసుకునేవారికి ఇచ్చిన ఇనాన్ భూములను నిషేధిత జాబితానుంచి తొలగించేందుకు కేబినెట్‌ఆమోద ముద్ర.
రజక, నాయీబ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, … తదితర ఇతర కులవృత్తులు సంబంధించిన వారి భూములను నిషేధిత జాబితానుంచి తొలగించనున్న ప్రభుత్వం.
1,13,610 మంది రైతులకు ప్రయోజనకరం
1,68,603.71 ఎకరాల భూములు ఈ జాబితానుంచి తొలగించనున్న ప్రభుత్వం
2013కి ముందే వీరందరికీ రైత్వారీ పట్టాలు.
2013 తర్వాత ఈ భూములపై మళ్లీ ఆంక్షల నేపథ్యంలో వాటిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.
ఇన్నాళ్లుగా ఈభూములు సాగుచేసుకుంటున్న రైతులను వేధింపులకు గురయ్యారని కేబినెట్లో చర్చ
7. గ్రామాల్లో శ్మసాన వాటికలు లేని ఎస్సీలకు శ్మసాన వాటికలుకోసం భూములు కేటాయిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం.
1,966 రెవిన్యూ గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికలు లేవని సర్వ ద్వారా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.
ఇందులో 1700 రెవిన్యూ గ్రామాల్లోని వారికి అందుబాటులో ఉన్న 1050.08 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించిన కేబినెట్.
ఒక ఎకరా వరకూ ఇవ్వనున్న ప్రభుత్వం.
ఈ భూమి కేటాయింపు అధికారం జిల్లా కలెక్టర్లకు అప్పగింత
మరో 266 రెవిన్యూ గ్రామాలకు భూ సేకరణ చేసి ఇవ్వనున్న ప్రభుత్వం, దీనికి కేబినెట్‌ఆమోదం.
8. నంద్యాల జిల్లా బేతంచర్ల, అనంతపురం జిల్లా గుంతకల్, వైయస్సార్ జిల్లా మైదుకూరు పాలిటెక్నిక్ కళాశాలల్లో 128 టీచింగ్ పోస్టులు, 68 నాన్ టీచింగ్ పోస్టలు మంజూరుచేస్తూ కేబినెట్ నిర్ణయం.
ఒకే లొకేషన్లో ఉన్న పాలిటెక్నిక్, ఐటీఐలు వీటన్నింటినీ ఇంటిగ్రేట్ చేయాలన్న సీఎం
ప్రతి నియోజకవర్గంలో కూడా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉండాలన్న సీఎం.
ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 26, ప్రతినియోజకవర్గంలో ఒకటి చొప్పున 175 నైపుణ్యాభి వృద్ధి సంస్థలు ఉండాలన్న సీఎం.
వీటన్నింటికీ కూడా ఒక యూనివర్శిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా పాఠ్యప్రణాళికను రూపొందించాలన్న సీఎం.
నైపుణ్యశిక్షణాభి వృద్ధి కార్యక్రమాల దిశగా ముందుకు తీసుకెళ్లొచ్చన్న ప్రభుత్వం.
విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా కూడా ఈ విద్యసంస్థల్లో బోధనా సిబ్బంది ఉండేలా చూడాలన్న సీఎం.
వారిలో నైపుణ్యాన్ని మెరుగుపరిచేలా కొత్త తరహా కోర్సులను కూడా ప్రవేశపెట్టాలన్న సీఎం
ప్రపంచంలో మారుతున్న సాంకేతికత, విధానాల్లో మార్పులకు అనుగుణంగా కోర్సులు ఉండాలన్న సీఎం.
9. జేఎన్డీయూ కాకినాడలో 27 నాన్‌టీచింగ్ స్టాఫ్ నియామకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
10. యూనివర్శిటీల్లో బోధనా సిబ్బంది కొరతను తీర్చేందుకు కేబినెట్ ప్రత్యామ్నాయ ఏర్పాటు.
రిటైర్‌అవుతున్న బోధనా సిబ్బంది సేవలను కాంట్రాక్టు పద్ధతిలో వినియోగించుకోవాలని నిర్ణయం
కోర్టు కేసుల దృష్ట్యా పోస్టుల భర్తీలో భారీ జాప్యం
దీనికి ప్రత్యామ్నాయంగా ఈ ఆలోచనను ముందుకు తీసుకొచ్చన ప్రభుత్వం.
62 ఏళ్లకు రిటైర్ అవుతున్న బోధనా సిబ్బందిని 65 ఏళ్ల వరకూ కాంట్రాక్టు పద్ధతిలో వారి సేవలను వినియోగించుకునేందుకు కేబినెట్‌ఆమోదం.
11. టోఫెల్ పరీక్షల కోసం ప్రభుత్వ విద్యార్థులకు శిక్షణ
విఖ్యాత విద్యా సంస్థ ఈటీఎస్‌తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందానికి కేబినెట్‌ఆమోదం
3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు శిక్షన ఇవ్వనున్న ఈటీఎస్.
సన్నాహక పరీక్షలతోపాటు టోఫెల్ ప్రైమరీ, జూనియర్ స్దాయి పరీక్షలు నిర్వహించనున్న ఈటీఎస్
అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకునేలా ప్రాథమిక స్థాయినుంచే విద్యార్థులను సన్నద్ధంచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.
ఈ శిక్షణను ప్లస్, ప్లస్ వన్ స్ధాయికి విస్తరించనున్న ప్రభుత్వం
ఈనెల 23 నుంచి ప్రభుత్వ విద్యాసంస్థల్లో టోఫెల్ పై శిక్షణ ప్రారంభం
12. ఎస్‌సీఈఆర్‌టిని మరింత బలోపేతం చేసేందకు ప్రభుత్వం చర్యలు.
ఎస్‌సీఈఆర్టీలో అకడమిక్ ఎక్స్‌పర్ట్ నియామకాలకు కేబినెట్ ఆమోదం.
కాంట్రాక్టు పద్ధతిలో నియామకానికి కేబినెట్‌ఓకే
దీనికి సంబంధించి తొమ్మిది పోస్టులను భర్తీచేయనున్న విద్యాశాఖ.
13. ఈ ఏడాది 5 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం.
రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం.
వచ్చే ఏడాది మరో 5 కాలేజీల ప్రారంభానికి చర్యలు
తదుపరి మిగిలిన కాలేజీల్లో బోధన ప్రారంభం.
దీనికి సంబంధించి 706 పోస్టులు మంజూరుకు కేబినెట్‌ఆమోదం
ఇందులో 222 పోస్టులు మెడికల్ కాలేజీలు, 484 పోస్టులు బోధనాసుత్రులకూ సంబంధించినవి
14. క్యాన్సర్ నిరోధం, చికిత్సలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.
కర్నూలులో కేన్సర్ ఇనిస్టిట్యూట్‌కు 247 పోస్టులు మంజూరుచేస్తూ కేబినెట్ నిర్ణయం.
పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని పేర్కొన్న కేబినెట్
15. పుంగనూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు కేబినెట్ ఆమోదం.
16. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్‌ను ప్రభుత్వ విభాగంలో కలిపేందుకు జారీచేసిన ఆర్డినెన్స్‌కి కేబినెట్ ఆమోదం. విశాఖపట్నంలో విమ్స్‌ను మెడికల్ కాలేజీగా మార్చాలని సీఎం ఆదేశం.
17. ప్రస్తుతం ఉన్న 11 మెడికల్ కాలేజీల్లో కార్డియాలజీ, కేథ్లా్బ్, సీటీవీసీ విభాగాల్లో 94 పోస్టుల మంజూరుకు కేబినెట్‌ఆమోదం.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా కూడా ఒక్క పోస్టుకూడా ఖాళీగా ఉండకూడదని స్పష్టంచేసిన సీఎం.
ప్రతి మూడునెలలకోసారి దీనిపై నివేదిక ఇవ్వాలన్న సీఎం.
18. వైయస్సార్ జిల్లా గండికోట ముంపు బాధితులకు రూ.454.6 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్‌ఆమోదం.
10,231 మంది కుటుంబాలకు పునరావాసం ప్యాకేజీ
ఫేజ్ 2, 3 లోని ముంపు బాధితుల తరహాలోనే ఫేజ్ –1 బాధితులకూ రూ.10 లక్షల చొప్పున ప్యాకేజీ.
19. పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు సహాయ పునరావాస పనులకోసం ప్రత్యేక ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ ఏర్పాటుకు కేబినెట్‌ఆమోదం.
ఆరుగురు అధికారులు, 73 పోస్టులతో విభాగం ఏర్పాటు.
ఇప్పటికే ఉన్న ప్రభుత్వ శాఖల సిబ్బందితో ఈ విభాగం ఏర్పాటు.
వీటికి అదనంగా 6 ఔట్ సోర్సింగ్ పోస్టులు భర్తీ.
20. వైయస్సార్ జిల్లా వేంపల్లిలో 1500 మెగావాట్ల పంప్డు స్టోరేజీ ప్రాజెక్టుకు కేబినెట్‌ఆమోదం
రూ. 8104 కోట్లు పెట్టుబడి పెట్టనున్న జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ.
1500 మందికి ఉద్యోగ అవకాశాలు.
21. హీరో ప్యూచర్స్‌కు చెందిన క్లీన్ ఎనర్జీ ప్రైయివేటు లిమిటెడ్ సోలార్, విండ్ ఎనర్జీ ప్లాంట్లు్ నెలకొల్పేందుకు కేబినెట్‌ఆమోదం.
375 మెగావాట్ల సామర్ధ్యంతో పవర్ ప్లాంట్లు్
అనంతపురం, నంద్యాల, వైయస్సార్ జిల్లాల్లో ప్లాంట్లు.
రూ.2450 కోట్ల పెట్టుబడి, 375 మందికి ఉద్యోగాల కల్పన.
22. ఏపీఐఐసీ పరధిలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరిశ్రమలకు 352.79 ఎకరాల కేటాయింపునకు సంబంధించి ప్రతిపాదనలకు కేబినెట్‌ఆమోదం.
44 ప్రతిపాదనలకు కేబినెట్‌ఆమోదం.
దాదాపు రూ. 4,204.07 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ఆయా సంస్థలు.
4705 మందికి ఉద్యోగాలు.
23. వీటితోపాటు నిన్న ఎస్‌ఐపీబీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్‌ఆమోదం.
24. శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణానికి అవరసరమైన వనరుల సమీకరణ.
ఏపీ మారిటైం బోర్డు రూ.3884.70 కోట్ల రుణం తీసుకునేందుకు అవసరమైన గ్యారెంటీని ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం.
దీనికి కేబినెట్‌ఆమోదం.
25. ఏపీ మారిటైం బోర్డులో 2 ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి కేబినెట్‌ఆమోదం.
ఎస్‌ఐపీబీలో నిన్న ఆమోదించిన టూరిజం ప్రాజెక్టులకు కేబినెట్‌ఆమోదం.
26. చెన్నై – కడప, విజయవాడ – కడప, బెంగుళూరు – కడప, విశాఖపట్నం – కడపల మధ్య విమానాలు నడుపుతున్న ఇండిగోకు మరో ఏడాది పాటు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కొనసాగింపు.
27. అర్చకులకు కేబినెట్ తీపి కబురు.
వారికి రిటైర్మెంట్ లేదు, ఈ మేరకు చట్ట సవరణకు కేబినెట్‌ఆమోదం.
28. ప్రభుత్వ ఉద్యోగుల్లానే దేవాదాయశాఖ ఉద్యోగులకు రిటైర్‌మెంట్ వయసు పెంపు.
60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం, కేబినెట్‌ఆమోదం
దీనికి సంబంధించిన చట్ట సవరణలకు కేబినెట్‌ఆమోదం
29. కొత్తగా ఏర్పాటు చేసిన తాడేపల్లిగూడెం రెవిన్యూ డివిజన్లో 19 పోస్టుల మంజూరుకు కేబినెట్‌ఆమోదం
కొత్తగా ఏర్పాటు చేసిన ఒంగోలు, అనంతపూర్, నంద్యాల, చిత్తూరు, విజయనగరం, మచిలీపట్నం సౌత్‌ల మండలాల్లో 70 పోస్టుల మంజూరుకు కేబినెట్‌ఆమోదం
30. కొత్తగా ఏర్పాటుచేసిన జిల్లాల్లో 13 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పోస్టుల మంజూరుకు కేబినెట్‌ఆమోదం.
31. మచిలీపట్నం, గుడివాడల్లో ఆరు కాలనీలలో…
1970–80 మధ్య ప్రభుత్వ ఉద్యోగులకు, జర్నలిస్టులకు మార్కెట్ లేదా నామినల్ విలువకు ఇళ్ల స్థలాల కేటాయింపు.
ఈ భూముల కేటాయించినప్పుడు చేసిన నిబంధనలో సవరణకు కేబినెట్‌ఆమోదం.
32. రాష్ట్ర మానవహక్కుల సంఘంలో దర్యాప్తు విభాగానికి 9 పోస్టుల మంజూరుకు కేబినెట్‌ఆమోదం.
వీటితోపాటు మరో 21 పోస్టుల మంజూరుకు కేబినెట్‌ఆమోదం.
33. విశాఖ భూముల అక్రమాలకు సంబంధించిన సిట్ ముగ్గురు సభ్యుల కమిటీ తొలినివేదికకు కేబినెట్ ఆమోదం.
మొత్తంగా 69 సిఫార్సులకు కేబినెట్‌ఆమోదం
మరో 18 సిఫార్సులపై మరింత శోధన అవసరమని పేర్కొన్న నివేదిక.