Homeజాతీయ వార్తలుతెలంగాణలో మరో ఉప ఎన్నిక.. ఏకగ్రీవం కానుందా?

తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. ఏకగ్రీవం కానుందా?

Dubbaka MLA Solipeta Ramalinga Reddy
తెలంగాణలో మరోసారి ఉప ఎన్నిక జరుగడం ఖాయం. సిద్ధిపేట జిల్లా దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతితో త్వరలోనే ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రానుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికకు ముందే తొకముడుస్తుందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. టీఆర్ఎస్ అధిష్టానం ఉప ఎన్నిక విషయంలో ఎలాంటి ప్రకటన చేయకముందే.. కాంగ్రెస్ నేతలు చూపిస్తున్న అత్యుత్యాహం చూస్తుంటే ఉప ఎన్నికకు ముందే ఆపార్టీ ఓటమిని అంగీకరించినట్లు కన్పిస్తుందని విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి.

Also Read: ఏపీ మూడు రాజధానులపై తెలంగాణ సీఎం ఫోకస్?

దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపోట రామలింగారెడ్డి మృతితో ఉప ఎన్నిక జరుగడం ఖాయంగా కన్పిస్తుంది. సీఎం కేసీఆర్ ఈ సీటు ఎవరికీ కేటాయిస్తారనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాగా రామలింగారెడ్డి సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. జర్నలిస్టుగా తెలంగాణ ఉద్యమంలో అనేక కథనాలు రాసి ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కేసీఆర్ టీఆర్ఎస్ ఏర్పాటు చేసే క్రమంలో టీడీపీకి, ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లినపుడు ఆయన వెంటే నడిచారు. కేసీఆర్ గెలుపు కోసం రామలింగారెడ్డి తనవంతు కృషి చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయనపై 30కిపైగా పోలీస్ కేసులు నమోదయ్యాయి.

ఇక 2004లో టీఆర్ఎస్ నుంచి దొమ్మాట నియోజకవర్గం నుంచి రామలింగారెడ్డికి టికెట్ దక్కింది. ఈ ఎన్నికల్లో రామలింగారెడ్డి గెలుపొందడంతో కేసీఆర్ కు మరింత దగ్గరయ్యారు. 2008 ఉప ఎన్నికల్లో రామలింగారెడ్డి గెలిచినా 2009లో మాత్రం ఓటమి చవిచూశారు. ఆ తర్వాత 2014, 2018ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. అయితే ఇటీవల రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో ఉప ఎన్నిక జరుగనుంది. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి విషయంలో సీఎం కేసీఆర్ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మాత్రం రామలింగారెడ్డి భార్యకు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమెకు టికెట్ ఇస్తే ఉప ఎన్నిక ఏకగ్రీవానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ తో తాను మాట్లాడుతానని అనడం చర్చనీయాంశంగా మారింది.

దుబ్బాకలో రామలింగారెడ్డి భార్యకు టికెట్ ఇస్తే తాము పోటీకి రాబోమని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రకటిస్తుండం ఆసక్తిని రేపుతోంది. దుబ్బాకలో కాంగ్రెస్ ఎలాగు ఓటమి పాలవుతుందని ముందుగా ఊహించి జగ్గారెడ్డి ఈ ప్రతిపాదన? చేశారా? లేక టీఆర్ఎస్ నేతలే జగ్గారెడ్డితో ఇలా చెప్పిస్తున్నారా? అనే అనుమానాలు రేకెత్తుతోన్నాయి. గతంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమారెడ్డి ఎంపీగా గెలువడంతో తన ఎమ్మెల్సే సీటుకు రాజీనామాచేసి ఆయన భార్యను పోటీకి దింపారు. అయితే నాడు టీఆర్ఎస్ ఏమైనా మద్దతు ఇచ్చిందా? అంటూ పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ ఎలా రియాక్టవుతారో చూడాలి. జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నిక ముందే అస్త్ర సన్యాసం చేసినట్లు కన్పిస్తోంది.

Also Read: కారులో రగులుతున్న ‘కార్చిచ్చు’

అయితే ఇదంతా కేసీఆర్ వ్యూహంలో భాగమే అన్న చర్చ నడుస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ ను ఈ ఎన్నికల నుంచి సైడ్ చేస్తే మిగతా పార్టీలు కూడా తమకు సహకరిస్తాయని టీఆర్ఎస్ భావిస్తుంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ నేత జగ్గారెడ్డితో టీఆర్ఎస్ ఇలాంటి వ్యాఖ్యలు చేయించిందా? అన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా సీఎం కేసీఆర్ దుబ్బాక స్థానాన్ని ఏకగ్రీవం చేసేందుకు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దుబ్బాక బరిలో కాంగ్రెస్ నిలుస్తుందా? లేదా అనేది మాత్రం తేలాల్సి ఉంది. దీనిపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular