AP BRS Party: తెలంగాణ రాష్ట్ర సమితి తన పేరు మార్చుకొని భారత రాష్ట్ర సమితి అయింది.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అర్జెంటుగా ప్రధానమంత్రి కావాలనుకుని ఏకంగా తన పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించాడు.. అంతేకాదు దేశ రాజధానిలో పార్టీ కార్యాలయం కూడా ప్రారంభించాడు. ఇంత జరిగాక భారత రాష్ట్ర సమితి కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం అయిపోతే కెసిఆర్ కు ఎంతటి నామార్ధ.. అందుకే తన రాజకీయ చాణక్యాన్ని మరోసారి తెరపైకి తెచ్చాడు.. వెంటనే ఆంధ్రాలో పాగా వేయాలని నిర్ణయించుకున్నాడు. ఆంధ్రాలో కమ్మలకు టిడిపి ఉంది.. రెడ్డిలకు వైఎస్ఆర్సిపి ఉంది. మరి కాపులకు? పవన్ కళ్యాణ్ ఉన్నా ఆ సామాజిక వర్గానికి పెద్ద ఫాయిదా దక్కలేదు. అందుకే కేసిఆర్ కాపు సామాజిక వర్గం వైపు గురిపెట్టాడు. ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ కు కుడి భుజం లా ఉన్న తోట చంద్రశేఖర్ కు గాలం వేశాడు.. ఆయన ఏం చెప్పాడో… ఈయన ఏం విన్నాడో తెలియదు కానీ… మొత్తానికి చంద్రశేఖర్ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు అయిపోయాడు. ఇక్కడ తెలంగాణకు ఎవరు? భారతదేశానికి ఎవరు? అనే ప్రశ్నలు మాత్రం కేసీఆర్ ను వేయొద్దు.

పార్టీ పరిస్థితి ఏంటి
చంద్రశేఖర్ తో పాటు కొంతమంది నాయకులు భారత రాష్ట్ర సమితిలో చేరారు. నమస్తే తెలంగాణ చెప్పినట్టు అక్కడ గాయి గత్తర ఏమీ రావడం లేదు. ఆంధ్ర ఆయనతోనే బాగుపడుతుందన్న సంకేతాలు వినిపించడం లేదు. పై పెచ్చు రాజకీయ ఉపద్రవం పెద్దగా ముంచుకు రావడం లేదు. ఇదే సమయంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కెసిఆర్ నోటి నుంచి వచ్చిన ఆణిముత్యాలు ప్రజల నోళ్ళల్లో నానుతున్నాయి. ఆంధ్ర పేడ బిర్యాని, ఆంధ్రుల మోసం అనే మాటలు వారికి వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే భారత రాష్ట్ర సమితికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అక్కడి ప్రజలు తొలగిస్తున్నారు. కెసిఆర్ పై ఉన్న ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్
భారత రాష్ట్ర సమితి ఫ్లెక్సీలను ఏపీలో తొలగిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. తోట చంద్రశేఖర్ పార్టీలో చేరడం పట్ల ఆంధ్రా జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తులసీ రెడ్డి, రోజా వంటి వారు కేసీఆర్ తీరు పట్ల నేరుగా ఆరోపణలు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని కేసీఆర్ తన రాజకీయ ఎదుగుదలకు విచ్ఛిన్నం చేశారని దుయ్య బట్టారు.

వాటి మాటేమిటి?
మొన్న జరిగిన చేరికల మీటింగ్ లా కాకుండా ప్లానింగ్ కమిటీ మీటింగ్ లా ఉంది. ఇదే సందర్భం లో కెసిఆర్ జింబాబ్వే డ్యామ్ దాకా వెళ్ళిపోయాడు. పోతి రెడ్డి పాడుకు జగన్ పెడుతున్న పొక్క గురించి మార్చి పోయాడు. ఇప్పుడు రాజకీయంగా ఎవరినీ ఏమీ అనలేడు. కాబట్టి దేశమంతా దళిత బంధు, రైతు బంధు,ఉచిత కరెంట్, సోకాల్డ్ తెలంగాణ మోడల్ గురించి మాత్రమే చెప్పాడు. ఇంతలో ఎంత మార్పు. ఏ మాటకి ఆ మాట తోట చంద్రశేఖర్ రాకతో కేసీఆర్ కి డప్పు కొట్టే చానెళ్ళల్లో మరొకటి చేరింది.