Homeఆంధ్రప్రదేశ్‌Shantanu Singh: వైసీపీకి షాకిస్తూ టీడీపీలోకి పీకే టీం.. చంద్రబాబుకు పండుగే ఇక

Shantanu Singh: వైసీపీకి షాకిస్తూ టీడీపీలోకి పీకే టీం.. చంద్రబాబుకు పండుగే ఇక

Shantanu Singh: ఒకే చోట పనిచేయడం కొందరికి ఇష్టముండదు. అందుకే చాలా మంది స్థాన చలనానికి ఇష్డపడతారు. కొందరు అప్పర్ పొజిషన్ కోసం సంస్థలను మారుతుంటారు. సాఫ్ట్ వేర్ రంగంలోకి వచ్చిన తరువాత ఈ తరహా మార్పులు అధికమయ్యాయి. ఇతర రంగాలకు విస్తరించాయి. అటు రాజకీయాల్లో కూడా ఇప్పుడదే కనిపిస్తోంది. ప్రాంతీయ వాదులు.. జాతీయ వాదులుగా మారిపోతున్నారు. జాతీయవాదాన్ని పరితపించే వారు ప్రాంతీయ పార్టీల్లో చేరుతున్నారు. దానికి రకరకాల కారణాలు చూపి సమర్థించుకుంటున్నారు. అంతెందుకు ఎన్నికల వ్యూహకర్తలు సైతం వేర్వేరు సైద్ధాంతిక విభేదాలుండే పార్టీలకు పనిచేస్తున్నారు. 2014లో ప్రధాని మోదీ గెలుపునకు పనిచేసిన ప్రశాంత్ కిశోర్.. గోవాలో కాంగ్రెస్ పార్టీ విజయానికి వ్యూహాలు పన్నారు. నాయకులే రంగులు మార్చుతున్నారు. వారికి ఐడియాలజీ ఇచ్చే మేము తక్కువ కాదన్నట్టు వారూ వ్యవహరిస్తున్నారు.

Shantanu Singh
Shantanu Singh

ప్రస్తుతం ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీకి వ్యూహకర్తలు ఉన్నారు. ప్రత్యేక బృందాలే పనిచేస్తున్నాయి. వైసీపీకి రుషిరాజ్ సింగ్ నేతృత్వంలోని ఐ ప్యాక్ టీమ్ పనిచేస్తుండగా.. టీడీపీకి రాబిన్ శర్మ ఆధ్వర్యంలో షోటైమ్ కన్సెల్టింగ్ టీమ్ పనిచేస్తోంది. అయితే ఈ% రెండు టీమ్ లు ఒకప్పుడు ప్రశాంత్ కిశోర్ దగ్గర పనిచేసేవే. అయితే పీకే వ్యూహకర్త నుంచి కాస్తా రాజకీయ నాయకుడిగా మారారు. రాజకీయాల్లో బీజీ అయిపోయారు. అటు పీకే కింద పనిచేసిన వారంతా స్వాతంత్రంగా పనిచేసుకోవడం ప్రారంభించారు, సొంత ఏజెన్సీలను పెట్టుకొని వివిధ పార్టీల విజయం కోసం పనిచేస్తున్నారు.

అయితే సడెన్ గా వైసీపీ ఐ ప్యాక్ టీమ్ లో పనిచేస్తున్న కీలక సభ్యుడు ఒకరు గోడ దూకేశారు. రాబిన్ శర్మ ఆధ్వర్యంలోని షోటైమ్ టీమ్ లో డైరెక్టర్ హోదాలో చేరిపోయారు. అయితే ఒక్కసారి ఆయన ప్లేటు ఫిరాయించడం వెనుక పెద్ద కథే నడిచినట్టు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో జగన్ విజయమే లక్ష్యంగా ఐ ప్యాక్ టీమ్ పనిచేస్తోంది. ఆ బృందం నుంచి కీలక వ్యక్తి చేజారిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఐ ప్యాక్ టీమ్ కు చెందిన శంతన్ సింగ్ సడెన్ గా రాబిన్ శర్మ గూటికి చేరారు. ఆ టీమ్ తో పనిచేయాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోల్ మేనేజ్ మెంట్ కు శంతన్ సింగ్ ను వినియోగించుకోవాలని రాబిన్ శర్మ చూస్తున్నారు. శంతన్ ఐ ప్యాక్ లో ఉండేటప్పుడు పొలిటికల్ వింగ్ చూసేవాడు. పీకే వెళ్లిపోయిన తరువాత రుషిరాజ్ సింగ్ కు కుడిభుజంగా ఉండేవాడు. ఐఐటీ కాన్పూర్ పూర్వపు విద్యార్థి. సింగపూర్ లోని లీకాన్ యీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ డిగ్రీ చేశారు. ఇండియన్ పాలిటిక్స్, అనాలసిస్ లో ముందంజలో ఉండేవారు. అందుకే పీకే టీమ్ అయిన ఐప్యాక్ లో చేరారు. మంచి పొజిషన్ లో ఉండగానే ఇప్పుడు ఆ టీమ్ కు రాజీనామా చేశారు.. ఎక్కువ కాలం ఆయన వైసీపీకి చేసివుండటంతో ఆ పార్టీ అనుసరిస్తోన్న వ్యూహాలు, బలహీనతలను తెలుస్తాయనే ఉద్దేశంతో టీడీపీ శంతన్ కు ఆహ్వానం పలికినట్టు ప్రచారం జరుగుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version