Punjab: మనం చాలా వార్తల్లో వింటూనే ఉంటాం. గోడకూలి కూలీల మృతి, అగ్ని ప్రమాదంలో దహనమైన కూలీలు.. ఇలాంటివి ఎన్నోవిన్నాం కదా. అయితే ఇప్పుడు కూడా ఇలాంటి హృదయ విదాకర ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవేమో. వారంతా పొట్టకూటి కోసం చెత్త ఏరుకునే వారు. రోజంతా చెత్త ఏరుకుని.. అదే చెత్త కుప్పల పక్కన వేసుకున్న గుడిసెల్లో పడుకుంటారు.
వారికి సొంత ఇల్లు లేదు. కానీ విధి ఆడిన నాటకంతో వారి జీవితాలు అదే చెత్తలో కాలిబూడిదైపోయాయి. తెల్లారి చెత్తేరుకోవడానికి వెళ్దామనుకున్న వారి ఆశలు.. తెల్లారిపోయాయి. రాత్రి వేళల్లో చెత్తకు అంటుకున్న మంటలు.. గుడిసెలకు పాకి వారంతా సజీవదహనమయ్యారు. ఏడుగురు చనిపోగా.. ఇందులో ఐదుగురు చిన్నపిల్లలే ఉన్నారు.
Also Read: CM Jagan Chiranjeevi: సీఎం జగన్ డిమాండ్స్ కి నో చెప్పిన మెగాస్టార్ చిరంజీవి.
పంజాబ్ లోని లూథియానా సిటీలో బుధవారం రాత్రి ఈ ఘోరం చోటుచేసుకుంది. ఈ సిటీలోని టిబ్బా రోడ్డు మున్సిపల్ ఏరియాలో డంపింగ్ యార్టు ఉంది. దీనికి దగ్గరలో చెత్తకుప్పల పక్కన ఓ గుడిసెలో ఏడుగురు నివసిస్తున్నారు. వీరంతా చెత్త ఏరుకునే జీవిస్తున్నారు. అయితే బుధవారం రాత్రి చెత్తకుప్పలకు నిప్పు అంటుకుని.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
అగ్ని జ్వాలలు గుడిసెకు అంటుకుని వారంతా సజీవ దహనమయ్యారని అసిస్టెంట్ కమిషనర్ సురీందర్ సింగ్ వివరించారు. ఇక కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్టు టిబ్బా ఎస్‌హెచ్‌వో రణబీర్ సింగ్ తెలిపారు. అయితే చెత్త కుప్పలకు మంటలు ఎలా అంటుకున్నాయో ఇంకా తెలియరాలేదని.. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామని వివరించారు.
Also Read:Heroine Gazala: ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడ్డ హీరోయిన్ గజాలా.. చివరకు దారుణమైన మోసం..!
Recommended Videos