https://oktelugu.com/

Taraka Ratna – Laxmi Parvathi : ఇన్నాళ్లు దాచారు.. తారకరత్న మరణంపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

Taraka Ratna – Laxmi Parvathi : నందమూరి తారకరత్న మరణం పట్ల నందమూరి లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లబ్ధికోసమే తారకరత్న మరణాన్ని చంద్రబాబు వాడుకున్నారని ధ్వజమెత్తారు. పాదయాత్ర ప్రారంభంలోనే కుప్పకూలిన తారకరత్న అప్పుడే బ్రెయిన్ డెడ్ అయినా ఇన్ని రోజులు ఆయన మరణాన్ని దాచి పెట్టారని విమర్శించారు. తన కొడుకు లోకేష్ పాదయాత్రకు చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతోనే బాబు కుట్ర చేశారని ఆరోపణలు చేశారు. రాజకీయం కోసం ఆనాడు ఎన్టీఆర్ ను ఇప్పుడు […]

Written By:
  • NARESH
  • , Updated On : February 19, 2023 / 07:45 PM IST
    Follow us on

    Taraka Ratna – Laxmi Parvathi : నందమూరి తారకరత్న మరణం పట్ల నందమూరి లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లబ్ధికోసమే తారకరత్న మరణాన్ని చంద్రబాబు వాడుకున్నారని ధ్వజమెత్తారు. పాదయాత్ర ప్రారంభంలోనే కుప్పకూలిన తారకరత్న అప్పుడే బ్రెయిన్ డెడ్ అయినా ఇన్ని రోజులు ఆయన మరణాన్ని దాచి పెట్టారని విమర్శించారు. తన కొడుకు లోకేష్ పాదయాత్రకు చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతోనే బాబు కుట్ర చేశారని ఆరోపణలు చేశారు. రాజకీయం కోసం ఆనాడు ఎన్టీఆర్ ను ఇప్పుడు తారకరత్నను వాడుకున్నారని గుర్తు చేశారు.

    తారకరత్న మరణించినట్లు వైద్యులు ధృవీకరించినా తన స్వార్థం కోసం ఇన్నాళ్లు ఆపి ఇప్పుడు ప్రకటించేలా చేశారన్నారు. లోకేష్ పాదయాత్రకు చెడ్డపేరు రావొద్దనే ఉద్దేశంతోనే ఈ వార్త బయటకు రాకుండా చేశారని మండిపడ్డారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే తారకరత్న మరణాన్ని కూడా వాడుకున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లోకేష్ లు ఇద్దరు రాష్ట్రానికి పట్టిన పీడగా అభివర్ణించారు. వారి స్వార్థం కోసం ఎంత మందిని బలి తీసుకుంటారో తెలియడం లేదన్నారు. తారకరత్న మరణాన్ని కూడా తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.

    తారకరత్న మరణంపై వైసీపీ నాయకురాలు, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి సంతాపం వ్యక్తం చేశారు. తన కొడుకు పాదయాత్రకు చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతోనే 23 రోజులుగా తారకరత్న మరణాన్ని దాచి పెట్టారని విమర్శించారు. వారి స్వార్థం కోసం అతడిని బలి చేశారని మండిపడుతున్నారు. రాజకీయంగా ఎదిగేందుకు నందమూరి వారసులను టార్గెట్ గా చేసుకుంటున్నారు. ఇంకా ఎన్నాళ్లు వారి ఆగడాలు సాగుతాయో తెలియడం లేదు. వారికి సమయం కూడా దగ్గర పడినట్లు తెలుస్తోంది.

    తారకరత్న మరణంపై పలువురు రాజకీయ, సినీ తారలు సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని, చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు భావోద్వేగానికి గురయ్యారు. తారకరత్న మరణం వేదనకు గురి చేసిందని వాపోయారు. తారకరత్న మరణం నందమూరిలో మరో వివాదం తెస్తుందో ఏమో తెలియడం లేదు. కానీ లక్ష్మీపార్వతి వ్యాఖ్యల్లో నిజమెంత? అనేది తేలాల్సి ఉంది.