Bandi Sanjay: శంకర్ దాదా ఎంబీబీఎస్ ఈ సినిమాలో మీకు కొన్ని సన్నివేశాలు ఐడియా ఉన్నాయి కదండి. అందులో మెగాస్టార్ చిరంజీవి పేషెంట్లను మానసికంగా ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నిస్తాడు. అలా అయితే వారు త్వరగా కోలుకుంటారు అనేది ఆ సన్నివేశాల్లో ని ముఖ్య ఉద్దేశం. అయితే ఆ సినిమాను చూశారు ఏమో లేదంటే స్వతహాగా అలాంటిది అలవర్చుకున్నారో తెలియదుగానీ ఇప్పుడు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మానసిక వైద్యుని అవతారమెత్తారు.

ఇది మేం చెబుతున్న మాట కాదండోయ్.. సాక్షాత్తు ఆయన హాస్పిటల్ లోకి వెళ్లి ఈ పని చేశారు కాబట్టి ఇలాంటి టాపిక్ తెరపైకి వచ్చింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ అధ్యక్షుడు పసుపులేటి బాబు రావు తండ్రి గుండెపోటుతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న బండి సంజయ్ వెంటనే హైదరాబాద్ చేరుకొని బాబు రావు తండ్రి వద్దకు పరుగులు తీశారు.
Also Read: ఫైర్ బ్రాండ్ కొడాలి నానికి వేటు తప్పదా.. ఆయన ప్లేస్ లో వచ్చేది అతనేనట..
గా ఆస్పత్రి బెడ్ పై ఉన్న బాబురావు తన మాటలతో ధైర్యం చెప్పే పని చేశారు బండి సంజయ్. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూనే.. తన మాటలతో ఆయనను మానసికంగా ధైర్యం గా ఉండేలా కొన్ని మాటలను నూరిపోశారు. ఆయన మాటలు విన్న బాబురావు కుటుంబీకులు కూడా కొంత షాక్ అయిపోయారు అంట.

ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్.. ఇంత సమయం కేటాయించి ఒక మానసిక వైద్యుడిలా మనోధైర్యం చెబుతారని వారు కూడా అనుకోలేదు అంట. ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read: పోలవరంపై కేంద్రం హామీలు సరే.. నిలబెట్టుకుంటదా.. నమ్మొచ్చా..?
[…] […]