Sanchar Saathi
Sanchar Saathi : ‘సంచార్ సాథీ’ యాప్ అనేది భారత ప్రభుత్వం, ముఖ్యంగా టెలికాం శాఖ ద్వారా ప్రారంభించబడిన ఒక మొబైల్ యాప్. ఇది టెలికాం వినియోగదారుల కోసం అనుమానిత కాల్స్, స్పామ్ మెసేజ్లు, లేదా అనధికారిక ఫోన్ నంబర్లను ట్రాక్ చేసి, ఫిర్యాదులు, నివారణ చర్యలు చేపట్టడంలో సహాయపడుతుంది. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ (iOS) ప్లాట్‌ఫార్మ్స్ లో అందుబాటులో ఉంటుంది. ‘సంచార్ సాథీ’ యాప్‌ను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా అనుమానిత కాల్స్, సందేశాలను నివారించుకోవచ్చు. దీని ముఖ్య లక్ష్యాలు, ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం.
1. స్పామ్ కాల్స్ , మెసేజ్ నివారణ:
ఈ యాప్ ద్వారా వినియోగదారులు అనుమానిత కాల్స్, స్పామ్ కాల్స్, అనవసరమైన సందేశాలను గుర్తించి, వాటిని నివారించుకోవచ్చు. ఎవరైనా సందేశం లేదా కాల్ ద్వారా భయపెట్టే సమాచారం పంపిస్తే, యాప్ ఉపయోగించి ఫిర్యాదు చేసుకోవచ్చు.
2. ఫోన్ నంబర్లను బ్లాక్ చేయడం:
అలా సందేశాలు లేదా కాల్స్ పంపించే ఫోన్ నంబర్లను యాప్ ద్వారా బ్లాక్ చేయవచ్చు. దీనివల్ల దొంగతనమైన లేదా అనవసరమైన నంబర్ల నుంచి వచ్చే కాల్స్ బ్లాక్ అవుతాయి.
3. మొబైల్ ఫోన్‌ను బ్లాక్ చేయడం:
మొబైల్ ఫోన్ పోయినప్పుడు లేదా దొంగతనం జరిగినప్పుడు ఈ యాప్ ద్వారా ఆ ఫోన్‌ను వెంటనే బ్లాక్ చేయవచ్చు. మొబైల్ ఫోన్‌ను తిరిగి పాస్‌కోడ్ లేదా జియో-లొకేషన్ ద్వారా ట్రాక్ చేసి, తిరిగి పొందటానికి సహాయపడుతుంది.
4. ఫోన్ IMEIతో ఒరిజినాలిటీ తనిఖీ
యాప్ ద్వారా మీరు మీ మొబైల్ ఫోన్ IMEI నంబర్ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ) ను ఎంటర్ చేసి, ఆ ఫోన్ ఒరిజినాలిటీని తనిఖీ చేయవచ్చు. ఇది దొంగతనమైన ఫోన్‌లను గుర్తించడంలో ఉపయోగపడుతుంది.
5. ప్రైవసీ రక్షణ:
ఈ యాప్ వినియోగదారులకు వారి ప్రైవసీని కాపాడేందుకు, ఈ స్పామ్ కాల్స్, సందేశాల నుండి రక్షణ ఇవ్వడమే కాకుండా టెలికాం సేవలపై పూర్తి నియంత్రణ కూడా అందిస్తుంది.
6. ఫిర్యాదు, స్పందన:
యాప్ ద్వారా, మీరు తమ ఫిర్యాదును టెలికాం శాఖకు సులభంగా పంపించవచ్చు. దీనిలో అనవసర కాల్స్, సందేశాలపై సమాచారం ఇవ్వవచ్చు. స్పందన కూడా పొందవచ్చు.
7. సేవలను పూర్తిగా ట్రాక్ చేయడం:
‘సంచార్ సాథీ’ యాప్ వినియోగదారులను తమ టెలికాం సంబంధిత సేవలను పూర్తిగా ట్రాక్ చేయడానికి అనుమతిస్తుంది. మీరు ఎవరి నుండి స్పామ్ కాల్స్ లేదా సందేశాలు వస్తున్నాయో తెలుసుకోవచ్చు.
ఈ విధంగా, ‘సంచార్ సాథీ’ యాప్ వినియోగదారులకు సులభంగా తమ ఫోన్ ప్రైవసీని, సెక్యూరిటీని కల్పించుకునేందుకు అవకాశం కల్పిస్తుంది.