Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్.. ఎవరి సత్తా ఎంత? సైన్యం బలాబలాలివీ!

Russia Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రపంచంపై భారీ ప్రభావాన్ని చూపుతోంది. అగ్రరాజ్యాలు రెండు జట్లుగా విడిపోయేలా పరిస్థితులు దిగజారుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతటి తీవ్రతతో రష్యా ఈ వార్ ను మొదలుపెట్టింది. అమెరికా, యూరప్ లు ఉక్రెయిన్ కు మద్దతు ఇవ్వడంతో ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది. ఉక్రెయిన్ పై రష్యా మొదలుపెట్టిన యుద్ధంతో ప్రపంచం రెండుగా చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ కు తోడుగా యూరప్ […]

Written By: NARESH, Updated On : February 24, 2022 4:05 pm
Follow us on

Russia Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రపంచంపై భారీ ప్రభావాన్ని చూపుతోంది. అగ్రరాజ్యాలు రెండు జట్లుగా విడిపోయేలా పరిస్థితులు దిగజారుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతటి తీవ్రతతో రష్యా ఈ వార్ ను మొదలుపెట్టింది. అమెరికా, యూరప్ లు ఉక్రెయిన్ కు మద్దతు ఇవ్వడంతో ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది. ఉక్రెయిన్ పై రష్యా మొదలుపెట్టిన యుద్ధంతో ప్రపంచం రెండుగా చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ కు తోడుగా యూరప్ దేశాలు, అమెరికా నిలవగా.. రష్యాకు చైనా, పాకిస్తాన్ లు అండదండలు అందిస్తున్నాయి. ఇప్పటికే రష్యా తనవద్దనున్న క్షిపణులతో ఉక్రెయిన్ పై భీకర దాడులు చేస్తోంది. అక్కడి సైనిక, వైమానికస్థావరాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇక ఇప్పటికే ఉక్రెయిన్ పై సైబర్ దాడులు కూడా రష్యా మొదలుపెట్టింది.

Russia Ukraine War

ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో రెండు దేశాల బలాబలాలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఏ దేశం వద్ద ఎంత ఆయుధాలున్నాయి.? సైనిక బలం ఎంత? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో ఏ దేశం సత్తా ఎంత ఉందో తెలుసుకుందాం..

రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధానంగా ఉక్రెయిన్ పై దాడికి తూర్పు ఉక్రెయిన్ లోని వేర్పాటువాదులకు మద్దతుగా నిలవడమే.వారికి అండగా ఆయన ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగారు. అయితే ఉక్రెయిన్ కు బాసటగా అమెరికా, యూరప్ దేశాలున్నాయి. ఉక్రెయిన్ కు అమెరికా, యూకే, కెనడా నుంచి ఆయుధాల సరఫరా పెరిగింది.

అయితే ఉక్రెయిన్ తో పోలిస్తే రష్యా ఆయుధ, సైనిక సంపత్తి అధికం.కానీ ఉక్రెయిన్ కు అమెరికా, యూరప్ దేశాల సహకారంతో రష్యాకు ధీటుగా బదులు ఇవ్వడానికి రెడీ అవుతోంది.

రష్యా సైనిక బలం 9 లక్షలు.. కానీ ఉక్రెయిన్ సైనిక బలం కేవలం 2 లక్షలు మాత్రమే. రష్యా తన మిలటరీ బడ్జెట్ 50బిలియన్ డాలర్లు. ఉక్రెయిన్ మిలటరీ బడ్జెట్ కేవలం 2 బిలియన్ డాలర్లు మాత్రమే. రష్యా మిలటరీ బడ్జెట్ ఏకంగా 15 రెట్లు ఎక్కువ కావడం విశేషం.

Also Read: మోడీది ఏం తప్పులేదా? ఆ రెండు పత్రికలదే తప్పా?

ఎయిర్ ఫోర్స్ సత్తా చూస్తే రష్యా వద్ద 1,65,000 ఎయిర్ ఫోర్స్ ట్రూప్స్ ఉండగా.. ఉక్రెయిన్ వద్ద కేవలం 35వేలు మాత్రమే ఉన్నాయి. రష్యా వద్ద 1328 యుద్ధ విమానాలుండగా.. ఉక్రెయిన్ వద్ద 146 మాత్రమే ఉన్నాయి. ఎటాక్ హెలిక్యాప్టర్లు రష్యా వద్ద 478 ఉండగా.. ఉక్రెయిన్ వద్ద 42 మాత్రమే ఉన్నాయి. ఎటూ చూసినా ఉక్రెయిన్ తో పోలిస్తే రష్యా సైనిక బలం అపారం. కానీ అమెరికా, యూరప్ దేశాలు సహకరిస్తే మాత్రం రష్యాను ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కోవచ్చు. ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.

-ఉక్రెయిన్, రష్యా బలాబలాలను ఈ కింది చార్ట్ లో తెలుసుకోవచ్చు.

Russia Ukraine War

Also Read: హైదరాబాద్ నుంచి సినీ ఇండస్ట్రీ తరలిపోకుండా తెలంగాణ సర్కార్ ‘భీమ్లానాయక్’ ను వాడుకుందా?

Recommended Video: