రూల్స్ అంటే రూల్సే.. కేసీఆర్‌‌ ఆస్తులు సైతం నమోదు

తెలంగాణలో రెవెన్యూ పరిపాలన వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా కొత్తగా ధరణి అనే వెబ్‌సైట్‌ను తెస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ వెబ్‌సైట్‌లో ఇప్పటికే ప్రభుత్వం దగ్గర ఉన్న రికార్డులను యథాతథంగా ఎక్కిస్తారని అంతా భావించారు. కానీ, వ్యవసాయేతర భూముల వివరాలను ఇంటింటికీ తిరిగి రాసుకుని ఆ వెబ్‌సైట్‌లో పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. Also Read: తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇందుకోసం ఆస్తుల యజమానులు నుంచి చాలా వివరాలు సేకరిస్తోంది. భూమికి సంబంధించిన వివిధ కాలమ్స్‌తో పాటూ, ఆధార్ […]

Written By: NARESH, Updated On : October 11, 2020 12:04 pm
Follow us on

తెలంగాణలో రెవెన్యూ పరిపాలన వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా కొత్తగా ధరణి అనే వెబ్‌సైట్‌ను తెస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ వెబ్‌సైట్‌లో ఇప్పటికే ప్రభుత్వం దగ్గర ఉన్న రికార్డులను యథాతథంగా ఎక్కిస్తారని అంతా భావించారు. కానీ, వ్యవసాయేతర భూముల వివరాలను ఇంటింటికీ తిరిగి రాసుకుని ఆ వెబ్‌సైట్‌లో పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.

Also Read: తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

ఇందుకోసం ఆస్తుల యజమానులు నుంచి చాలా వివరాలు సేకరిస్తోంది. భూమికి సంబంధించిన వివిధ కాలమ్స్‌తో పాటూ, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్లు.. ఇలా 53 రకాల వివరాలను ఇందులో అడిగారు. సమాచార సేకరణ కోసం స్థానిక సంస్థల శాఖలైన పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల సిబ్బందిని కూడా వినియోగిస్తున్నారు. వ్యవసాయేతర భూములకు కొత్తగా కుంకుమ రంగు పాస్ పుస్తకాలు కూడా ఇవ్వననున్నారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆస్తుల నమోదు సర్వే నడుస్తోంది. ఇందులో ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. తన పేరిట ఉన్న వ్యవసాయేతర ఆస్తులను సీఎం కేసీఆర్‌ కూడా నిన్న నమోదు చేయించుకున్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లి శివారులోని వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించిన వివరాలను గ్రామ కార్యదర్శి సిద్ధేశ్వర్‌కు ముఖ్యమంత్రి స్వయంగా తెలియజేశారు.

Also Read: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. హోం లోన్ తీసుకునే వారికి శుభవార్త..?

ఈ సందర్భంగా ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌ వివరాలతోపాటు కేసీఆర్‌ ఫొటోను సిబ్బంది యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ ఆస్తులపై ప్రజలకు హక్కు, భద్రత కల్పించేందుకే వివరాలు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు.  వ్యవసాయ భూముల తరహాలోనే వ్యవసాయేతర ఆస్తులకూ పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా చేపట్టిన స్థిరాస్తుల నమోదు ప్రక్రియ చర్రితలో మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ స్థిరాస్తుల వివరాలను నమోదు చేయించుకోవాలని పిలుపునిచ్చారు.