Farmer Suicides in Telangana: తెలంగాణ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. ధనిక రాష్ర్టంగా కాగ్ నివేదిక ఇచ్చిందని సీఎం కేసీఆర్ పదేపదే చెబుతుంటారు. కానీ ధనిక రాష్ట్రమైతే అప్పులెందుకు? ఉద్యోగులకు సరైన సమయానికి వేతనాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరుకోవడం దేనికి సంకేతం. మరోవైపు రాష్ర్టంలో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నా తమ రాష్ర్టం సుభిక్షం అని చంకలు గుద్దుకుంటోంది. గత ఎనిమిదేళ్లుగా వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి కనీసం పరామర్శ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అందే పంజాబ్ లో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు మూడు లక్షలు చొప్పున పంపిణీ చేయడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. ప్రభుత్వం తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు తెగ ప్రయత్నిస్తుందని తెలుస్తోంది.

ఎన్ సీఆర్ బీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని సామాజిక వేత్త కోట నీలిమ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో వ్యవసాయం భారంగా మారడంతో రైతులు తట్టుకోలేకపోతున్నారు. పెట్టుబడులు పెరగడంతో రాబడి తగ్గి ఆయువు తీసుకుంటున్నట్లు సమాచారం. కానీ ప్రభుత్వం మాత్రం మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. దుర్భర పరిస్థితులు తట్టుకుని నిలవలేకే ప్రాణాలు తీసుకుంటున్నట్లు భోగట్టా. ఈ క్రమంలో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు.
దేశంలో రైతు ఆత్మహత్యల రేటు 11.3 శాతం ఉంటే తెలంగాణలో 22.5 శాతంగా ఉందని చెబుతున్నారు. దేశంతో పోల్చుకుంటే తెలంగాణలోనే అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సమాచారం దీంతో ఆత్మహత్యల తెలంగాణగా అభివర్ణిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా ఇంకా ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా చోద్యం చూస్తూనే ఉంది. కానీ ఆత్మహత్యల నివారణకు ఏం చేస్తుందనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఎనిమిది ఏళ్లుగా రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఎందుకు తాత్సారం చేస్తోంది. వారి ఆత్మహత్యల నివారణకు ఎందుకు ముందుకు రావడం లేదు. వారి ఆత్మహత్యలతో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నా వారికి కనీసం సాయం కూడా చేయడం లేదు. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు రూ. 3 లక్షలు సాయం చేస్తూ మన వారిని ఎందుకు పట్టించుకోవడం లేదనే వాదనలు వస్తున్నాయి.

దీనిపై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది. మాది ధనిక రాష్ట్రమని చెప్పుకుని రైతులను మాత్రం గాలికొదిలేయడంపై విమర్శలు వస్తున్నాయి. మంత్రులు మాత్రం మాది సుభిక్షమైన తెలంగాణ అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఆచరణలో మాత్రం అంతా వట్టిదేనని తేలుతోంది. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పడం ఖాయంగానే కనిపిస్తోంది. ఓ పక్క రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు జరుపుకుంటున్నా రైతుల గురించి మాత్రం పట్టించుకోవడం లేదు ఫలితంగా వారి జీవితాలకు భరోసా దక్కడం లేదు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. దీనికి సరైన సమాధానం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read:Modi Jagan: రాష్ట్రపతి ఎన్నికలు: మోడీని ఆడించే అవకాశం జగన్ కు…
Recommended Videos:
[…] […]
[…] […]