Rishikonda: ‘రిషికొండ’.. కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్న ఎల్లో మీడియా

ప్రకృతి ప్రసాదించిన వనరుగా రిషికొండను భావిస్తున్నారు. కానీ పక్కనే ఉన్న రామానాయుడు స్టూడియో వారికి కనిపించకపోవడం విశేషం. అసలు విశాఖకు రిషికొండ కన్నా కీలకమైనది డాల్ఫిన్ నోస్.

Written By: Dharma, Updated On : August 18, 2023 7:59 pm

Rishikonda

Follow us on

Rishikonda: విశాఖలో రిషికొండ వ్యవహారం ఎల్లో మీడియాకు హాట్ టాపిక్ గా మారిపోయింది. అనువైన అస్త్రంగా దొరికింది. మొత్తం విశాఖ నే జగన్ దోచుకుంటున్నారు అంతగా నానా యాగి చేస్తోంది. అటు ప్రభుత్వం సైతం దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు. అక్కడ ఏవో ప్రభుత్వ నిర్మాణాలు మాత్రం అయితే జరుగుతున్నాయి. అయితే అవి సీఎం జగన్ సొంత భవనాలు కావు. ఆయన అధికారంలోకి దిగిపోయిన మరుక్షణం.. మరో ప్రభుత్వం ఆ నిర్మాణాలను హ్యాండోవర్ చేసుకుంటాయి. ఇది తెలిసి కూడా అదే పనిగా ఎల్లో మీడియా ప్రాధాన్యత ఇవ్వడం అతిగా అనిపిస్తోంది.

ప్రకృతి ప్రసాదించిన వనరుగా రిషికొండను భావిస్తున్నారు. కానీ పక్కనే ఉన్న రామానాయుడు స్టూడియో వారికి కనిపించకపోవడం విశేషం. అసలు విశాఖకు రిషికొండ కన్నా కీలకమైనది డాల్ఫిన్ నోస్. అక్కడ రక్షణ శాఖ లెక్కకు మించి కట్టడాలు నిర్మించింది. డాల్ఫిన్ నోస్ మొత్తం ఇప్పుడు రక్షణ శాఖ ఆధీనంలో ఉంది. విశాఖకి తలమానికంగా నిలిచే డాల్ఫిన్ నోస్ ను తీసుకుంటారా అని రక్షణ శాఖను అడిగే దమ్ము ఎల్లో మీడియాకు ఉందా. పోనీ గాజువాక నుంచి మధురవాడ వరకు కొండలను ఆక్రమించి జనాలు ఇల్లు నిర్మించుకున్నారు. ఇందులో చాలామంది బడా బాబులు సైతం ఉన్నారు. అలాంటి ఆక్రమణలపై వార్తలు ప్రచురించేందుకు ఎల్లో మీడియా ముందుకు రావడం లేదు.

ఇటువంటి కట్టడాల విషయంలో తెలంగాణలో ఒక మాదిరిగా.. ఏపీలో మరో విధంగా ఎల్లో మీడియా వ్యవహరిస్తుంది. హైదరాబాద్ లోని భారీ కట్టడాలు వెనుక కొండల తవ్వకాలు ఉన్నాయి. హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో భారీ కార్పొరేట్ ఆసుపత్రి నిర్మించారు. దానిని ప్రారంభానికి కూడా సిద్ధం చేశారు. ఓ భారీ కొండను పూర్తిగా కూల్చేసి.. ఏకంగా 10 నెలలు అక్కడ కొండ అన్నదే లేకుండా చేశారు. అటువంటిదేది ఎల్లో మీడియాకు కనిపించకపోవడం విచారకరం. రిషికొండ తవ్వకాల విషయంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్నది తప్పే. అక్కడ ఏం చేస్తున్నామన్న దానిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ అది తన పని కాదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దానినే పట్టుకొని ఎల్లో మీడియా ప్రవర్తిస్తుండడం కొంచెం అతిగా ఉంది.