Homeజాతీయ వార్తలుRGV : చెక్ బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మ ఎందుకు జైలు పాలయ్యాడు? ఇది...

RGV : చెక్ బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మ ఎందుకు జైలు పాలయ్యాడు? ఇది ఎలా నేరం అవుతుందో తెలుసా ?

RGV : చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష పడింది. అతనిపై చెక్కు బౌన్స్ అయినట్లు ఫిర్యాదు నమోదైంది. చెక్ బౌన్స్ అవ్వడం తీవ్రమైన ఆర్థిక నేరంగా పరిగణించబడుతుంది. దీనిలో కూడా కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఇది ఎలా నేరం అవుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెక్ బౌన్స్ కేసులో దోషిగా తేలి మూడు నెలల జైలు శిక్షకు గురయ్యారు. సినిమా నిర్మాణానికి సంబంధించిన లావాదేవీలలో వాడిన చెక్ తిరస్కరణకు గురికావడం వల్ల ఈ కేసు నమోదు అయ్యింది. ఆర్జీవీ ఒక సినిమాకు చెల్లించడానికి చెక్కు జారీ చేశాడు.. కానీ ఆ చెక్కును చెల్లించడానికి అతని ఖాతాలో తగినంత నిధులు లేవు. దాని కారణంగా చెక్కు బౌన్స్ అయింది. తరువాత రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.

ఎమిటి ఈ చెక్ బౌన్స్?
చెక్కు బౌన్స్ అనేది, ఒక వ్యక్తి తన బ్యాంక్ ఖాతా నుండి ఇచ్చిన చెక్కును సరైన కారణాలు లేకుండా బ్యాంక్ తిరస్కరించడాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా చెక్కు విలువకు సరిపడా నగదు ఖాతాలో లేనప్పుడు ఇది జరుగుతుంది.

చెక్కు బౌన్స్ జరిగేందుకు ప్రధాన కారణాలు
* ఖాతాలో నగదు లేమి.
* చెక్కుపై తప్పుడు సంతకం లేదా తప్పుల సమాచారము.
* గడువు ముగిసిన చెక్కును ఇవ్వడం
* బ్యాంక్ ఖాతా నిలిపివేయడం లేదా మూసివేయడం.

చెక్కు బౌన్స్ కేసులో శిక్షలు
* చెక్కు బౌన్స్ నేరమైందిగా పరిగణించబడుతుంది. భారత చట్టం ప్రకారం,
* నిందితుడు మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా చెక్కు విలువకు రెండింతల జరిమానా లేదా రెండు శిక్షలు పొందవచ్చు.
* బాధితుడు నోటీసు పంపిన తర్వాత ఒక నెలలో చెల్లింపులు జరపకపోతే కేసు నమోదు చేస్తారు.
* కోర్టు విచారణలో నిందితుడు హాజరు కాకపోతే ముందుగా సమన్లు, ఆ తర్వాత అరెస్ట్ వారెంట్ జారీ చేస్తారు.

రామ్ గోపాల్ వర్మ కేసు వివరణ
రిపోర్టుల ప్రకారం, రామ్ గోపాల్ వర్మ ఒక సినిమా ప్రాజెక్ట్ కోసం ఇచ్చిన చెక్కు తిరస్కరించబడింది. బాధితుడు కోర్టులో ఫిర్యాదు చేయగా, విచారణ తర్వాత న్యాయస్థానం వర్మను దోషిగా తేల్చింది.

నిర్మాతలకు హెచ్చరిక
ఈ సంఘటన చెల్లింపుల వ్యవహారాలలో నిర్లక్ష్యంగా వ్యవహరించేవారికి బోధపడే విధంగా మారింది. లావాదేవీల్లో శ్రద్ధగా ఉండాలని, చట్టపరమైన సమస్యలు ఎదుర్కొకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular