Revanth Reddy : తెలంగాణ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి ఆగ్రహం కాంగ్రెస్ కు ముప్పు తెస్తోంది. ఆయన బూతుల భాషతో మాట్లాడడం.. బీఆర్ఎస్ నేతలపై దారుణ పదజాలం వాడడం ఇప్పటికే విమర్శలకు కారణం అవుతోంది. ఇప్పుడు ఆయన భాష మాత్రమే కాదు వ్యవహారశైలి కూడా వివాదాస్పదం అవుతోంది.
ఇప్పటికే రెడ్డి పొగరును చూపించిన రేవంత్ రెడ్డి.. సభలు, సమావేశాల్లో వ్యవహరిస్తున్న తీరు తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా జనతాకిడిని నాయకుడిగా ఎంజాయ్ చేయాల్సింది పోయి.. వారికి ఆటోగ్రాఫ్ లు, సెల్ఫీలు ఇవ్వాల్సింది పోయి.. తన దారికి అడ్డు వచ్చిన వారిని తొక్కుకుంటూ పోయాడు. కాంగ్రెస్ కార్యకర్తలను తొక్కుకుంటూ తన్నుకుంటూ వెళ్లిన రేవంత్ రెడ్డి వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇతడా నేతా? ఇతడా తమను పాలించేది అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. కార్యకర్తల కష్టం ఫలితం అంటూ వారినే తన్నడం ఏంటని నిలదీస్తున్నారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.
పాలకుర్తి సభలో కార్యకర్తలు ఎగబడడంతో కాలుతో తన్నిన రేవంత్ రెడ్డి pic.twitter.com/8nZZixE2KQ
— Telugu Scribe (@TeluguScribe) November 9, 2023