
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ పార్టీ జెండా రంగును పోలిన రంగులను తొలగించేందుకు ప్రభుత్వం కోరిన విధంగా మూడు నెలల గడువు ఇచ్చేది లేదని హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ పనులకు మూడు నెలల గడువు ఎవ్వలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటీషన్ పై ధర్మాసనం ఈ విధంగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వ టరు చూస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికలు అయ్యే వరకూ రంగులు తొలగించకూడదని భవిస్తున్నట్లుగా ఉందని పేర్కొంది. మూడు నెలల గడువు ఇస్తామని, అప్పటి వరకు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా ఉంటారా అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. ప్రస్తుతం కొనసాగుతున్న రెండవ విడత లాక్ డౌన్ ముగిసిన అనంతరం ఎప్పుడు ఉన్న రంగులు మార్చడానికి ఎన్నిరోజులు పడుతుందో అధికారుల నుంచి సమాచారం తీసుకుని కోర్టుకు తెలియజేస్తామని ప్రభుత్వం తరుపు న్యాయవాది ధర్మాసనానికి తెలియజేసారు. కొద్దీ రోజుల కిందట పంచాయతీలకు ఏ రంగులు వేయాలనే నిర్ణయం తీసుకునెందుకు ఉన్నతాధికారులతో కమీటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ త్వరలో సమావేశమై నిర్ణయాన్ని తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు.