‘పులి ఒక అడుగు వెనకడుగు వేసిందంటే దానర్థం.. మరింత వేగంతో దాడి చేస్తుందని..’ ఇలాంటి డైలాగులు సినిమాల్లో బాగానే ఉంటాయి. కానీ అపర రాజకీయ చాణక్యుడు , టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెబితే మరింత వినసొంపుగా ఉంటాయి. ఇప్పుడు దుబ్బాక ఓటమితో కుదేలైన టీఆర్ఎస్ నేతలు, క్యాడర్ కు సీఎం కేసీఆర్ పిలిచి మరీ దిశానిర్ధేశం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా గెలవాలి? ఎలా బీజేపీని దెబ్బకొట్టాలనే దానిపై దిశానిర్ధేశం చేస్తున్నారు.
Also Read: టీఆర్ఎస్ కు వరద బాధితుల ముప్పు..!
గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్ నేతలకు దిశానిర్ధేశం చేస్తూ కార్యాచరణను ఉపదేశించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు ప్రచార అస్త్రాలను నాయకులకు కేసీఆర్ వివరించారు. ఇన్నాళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేసిన అభివృద్ధి, కరోనాతో పాటు వరదల సమయంలో ప్రభుత్వం వ్యహరించిన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. అయితే ఓ అంశాన్ని మాత్రం వెంటనే మైండ్ లోంచి తీసేయాలని ఖరాఖండీగా చెప్పేశారు.
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాన్ని మైండ్ నుంచి తీసేయ్యాలని సీఎం కేసీఆర్ పార్టీ నేతలను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రసమితి ముఖ్య నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం తెలంగాణ భవన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రేటర్ ఎన్నికల్లో తిరుగులేని గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కేసీఆర్ పార్టీ వర్గాలకు పిలుపునిచ్చారు.
Also Read: ‘బస్తీ’మే సవాల్.. రంగంలోకి కేసీఆర్..వ్యూహాత్మకమేనా?
బీజేపీ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని.. సోషల్ మీడియాతో సహా అన్ని వేదికల మీద బీజేపీ నేతలకు ధీటైన కౌంటర్లు ఇవ్వాలని గులాబీ బాస్ నిర్ధేశించారు. మొత్తం 200 మంది నాయకులతో సమావేశమైన కేసీఆర్.. 500 మందితో టీం ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి గల్లీలో.. ప్రతి గడపకు టీఆర్ఎస్ ప్రచారం చేరాలని ఆయన ఆదేశించారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్