Also Read: కేసీఆర్ ఫౌంహౌస్ పై ‘బండి’ సంచలన కామెంట్స్..!
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ కు ఆదిలోనే అనేక సమస్యలు వచ్చిపడుతున్నాయి. ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ వివరాలను ప్రభుత్వం సేకరించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిని విచారించిన హైకోర్టు ఆధార్ వివరాలు.. కులం.. వ్యక్తిగత వివరాలను సేకరించొద్దని సూచించింది. అయితే ప్రభుత్వం మాత్రం యథావిధిగా రిజిస్ట్రేషన్లు కొనసాగించడంపై హైకోర్టు ప్రభుత్వంపై సీరియస్ అయింది.
ఈక్రమంలోనే తెలంగాణ సర్కార్ తాజాగా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్‌లను నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ సదుపాయం ఉంటుందని స్పష్టం చేసింది.
Also Read: చంద్రబాబు, జగన్.. ఓ అధికారి బలి!
ధరణిలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి పాతపద్ధతిలోనే కొనసాగుతాయంటూ తాజాగా వెల్లడించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
మరోవైపు ఇప్పటికే స్లాబ్ బుకింగ్ చేసుకున్న వాళ్లకు మాత్రం 21తేది వరకు రిజిస్ట్రేషన్లు చేయనున్నట్లు తెలిపారు. ఇకపై పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరుగనుండటంతో ఇప్పటివరకు ఆగిపోయిన ఆస్తుల నమోదు ప్రక్రియ తిరిగి గాడినపడే అవకాశం కన్పిస్తోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్