Telangana Elections 2023: తొలిసారిగా ఏకతాటిపై రెడ్డి, కమ్మ సామాజిక వర్గం

తెలంగాణ ఎన్నికల్లో గతంలో ఎన్నడు చూడని చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కమ్మ, రెడ్డి సామాజిక వర్గం ఓకే తాటి పైకి రావడం విశేషం. ఈ రెండు సామాజిక వర్గాలు వేర్వేరు కారణాలతోనే కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతుండడం విశేషం.

Written By: Dharma, Updated On : November 4, 2023 3:56 pm

Telangana Elections 2023

Follow us on

Telangana Elections 2023: సామాజిక వర్గపరంగా రెడ్డి, కమ్మ కులాలు బద్ధ శత్రువులు. ఆ రెండు సామాజిక వర్గాలు ఒకే తాటి పైకి రావడం అరుదైన అంశం. కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి, రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ కు, ప్రస్తుతం వైసీపీకి బలమైన మద్దతుదారులుగా ఉన్నాయి. అయితే రాజకీయ అవసరాల కోసం తెలుగుదేశం పార్టీలో రెడ్డి సామాజిక వర్గం నేతలు, వైసీపీలో కమ్మ సామాజిక వర్గం నేతలు ఉన్నారు. అయితే జనాభా ప్రాతిపదికన తక్కువగా ఉన్న ఈ రెండు సామాజిక వర్గాలు రాజ్యాధికారం దక్కించుకోవడాన్ని మిగతా సామాజిక వర్గాలు సహించలేకపోతున్నాయి. కానీ ఆ రెండు సామాజిక వర్గాలు ఏకతాటి పైకి వచ్చింది లేదు. బలమైన కాపు సామాజిక వర్గంతో పాటు బలహీన వర్గాల సాయంతో రెండు పార్టీలు అధికారాన్ని చెలాయిస్తూ వచ్చాయి. కానీ ఆ రెండు సామాజిక వర్గాలు ఒకే తాటి పైకి రావాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది.

తెలంగాణ ఎన్నికల్లో గతంలో ఎన్నడు చూడని చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కమ్మ, రెడ్డి సామాజిక వర్గం ఓకే తాటి పైకి రావడం విశేషం. ఈ రెండు సామాజిక వర్గాలు వేర్వేరు కారణాలతోనే కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతుండడం విశేషం. చంద్రబాబును రాజకీయంగా తెలంగాణ సీఎం కేసీఆర్, బిజెపి అగ్రనేతలు ఇబ్బంది పెట్టారన్న అనుమానం కమ్మ సామాజిక వర్గంలో ఉంది. అందుకే వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్, బిజెపికి బుద్ధి చెప్పడానికి కాంగ్రెస్కు ఓట్లు వేసి తీరాలన్న కృత నిశ్చయంతో కమ్మ సామాజిక వర్గం ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నది రెడ్లు అయినా.. ఆ రెండు పార్టీలను దెబ్బతీయాలన్న ఆలోచనలో కమ్మ సామాజిక వర్గం ఉంది. పైగా అక్కడ పిసిసి అధ్యక్షుడిగా చంద్రబాబు అనుచరుడు రేవంత్ రెడ్డి ఉండడం కూడా కమ్మ సామాజిక వర్గం ఆసక్తికి కారణం. అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి నిధులు ఇవ్వడానికి సైతం కమ్మ సంఘం ముందుకు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్కు సపోర్ట్ చేయడానికి ప్రధాన కారణం.. తెలంగాణలో కెసిఆర్ దొరతనం పోయి.. రెడ్ల రాజ్యం రావాలని ఆ సామాజిక వర్గం కోరుకుంటుంది. వాస్తవానికి అధికార బీఆర్ఎస్ రెడ్డి సామాజిక వర్గానికి 42 సీట్లను కేటాయించింది. అయినా సరే రెడ్డి సామాజిక వర్గానికి సంతృప్తి లేదు. గత రెండుసార్లు అధికారానికి దూరం కావడం.. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం పై కేసీఆర్ కత్తులు దూయడం తదితర కారణాలతో ఈసారి ఎలాగైనా రెడ్డి సామాజిక వర్గం నేత సీఎం కావాలని బలమైన ఆకాంక్షతో ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ సైతం రెడ్డి సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ఇప్పటివరకు ప్రకటించిన సీట్లలో ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గం నేతలకే అగ్ర తాంబూలం ఇచ్చింది.

తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. తమకు వ్యక్తిగత విభేదాలు ఏవీ లేవని.. బలవంతంగా రాజకీయ విభేదాలు సృష్టించారని రెండు సామాజిక వర్గాల నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండడం విశేషం. సహజంగా కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు ఏకతాటి పైకి రావడం.. అధికార బీఆర్ఎస్ కు కలవర పెడుతోంది. అందుకే కెసిఆర్ సైతం 42 సీట్లను రెడ్డిలకు కేటాయించారు. మరో ఐదు సీట్లను కమ్మ సామాజిక వర్గానికి అందించారు. అయినా సరే ఆ రెండు సామాజిక వర్గాల అభిమానాన్ని చూరగొనలేకపోతున్నారు. అంది వచ్చిన ఈ అపురూప అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ సద్వినియోగం చేసుకుంటుందో? లేదో? చూడాలి.